STOCKS

News


ఆసియా మార్కెట్లు డౌన్‌..

Tuesday 2nd October 2018
Markets_main1538452732.png-20783

ఒక్క జపాన్‌ మార్కెట్‌ మినహా ఆసియా ప్రధాన సూచీలన్నీ మంగళవారం దాదాపుగా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 37 పాయింట్ల లాభంతో 24,283 పాయింట్లకు పెరిగింది. దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 17 పాయింట్ల నష్టంతో 2,322 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 438 పాయింట్ల నష్టంతో 27,350 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 4 పాయింట్ల స్వల్ప నష్టంతో 3,252 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 127 పాయిం‍ట్ల నష్టంతో 10,928 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. చైనా మార్కెట్‌కు మంగళవారం కూడా సెలవే. చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ శుక్రవారం 30 పాయింట్ల లాభంతో 2,821 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. 

అమెరికా డాలర్‌తో పోలిస్తే యెన్‌ క్షీణించడం వల్ల జపాన్‌ నికాయ్‌ 225.. సోమవారం 27 ఏళ్ల గరిష్ట స్థాయికి తాకింది. 24,246 పాయింట్ల వద్ద ముగిసింది. 1991 నవంబర్‌ 15 నుంచి చూస్తే ఇదే గరిష్ట స్థాయి. కాగా యెన్‌.. డాలర్‌తో పోలిస్తే 11 నెలల కనిష్ట స్థాయిల్లో ట్రేడవుతోంది. అమెరికా-కెనడా ట్రేడ్‌ డీల్‌ జపాన్‌ మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపింది. 



You may be interested

అమెరికా మార్కెట్లు శుభారంభం

Tuesday 2nd October 2018

అమెరికా మార్కెట్లు నాల్గవ త్రైమాసికానికి శభారంభాన్ని ఇచ్చాయి. నాస్‌డాక్‌ మినహా మిగతా రెండు ప్రధాన ఇండెక్స్‌లు సోమవారం లాభాల్లోనే ముగిశాయి. అమెరికా, కెనడా ట్రేడ్‌ డీల్‌ సానుకూల ప్రభావం చూపింది. నాస్‌డాక్‌ ఇండెక్స్‌ స్వల్పంగా నష్టపోతే.. డౌజోన్స్‌, ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌లు లాభపడ్డాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 192 పాయిం‍ట్ల లాభంతో 26,651 పాయింట్ల వద్ద ముగిసింది. చెవ్రాన్‌, బోయింగ్‌ ఔట్‌పర్ఫార్మ్‌ చేశాయి. ఇక ఎనర్జీ, మెటీరియల్స్‌, ఇండస్ట్రీయల్‌ షేర్లు

స్టాక్‌ మార్కెట్‌కు సెలవు

Tuesday 2nd October 2018

సాక్షి, ముంబై:-  అక్టోబర్‌ 2 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నేడు స్టాక్‌ మార్కెట్లకు సెలవు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్ఈతో పాటు బులియన్‌, ఫారెక్స్‌, మనీ మార్కెట్లు ఈరోజు పని చేయవు. మార్కెట్ ట్రేడింగ్ మళ్లీ యథావిథిగా బుధవారం ప్రారంభమవుతుంది. ముడి చమురు ధరలు దిగిరావడం,  ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ను ప్రభుత్వం టేకోవర్‌ చేయనుండడం, తయారీ రంగ పీఎమ్‌ఐ గణాంకాలు సానుకూలంగా ఉండటం తదితర సానుకూల కారణాలతో సోమవారం సూచీలు లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్‌  299

Most from this category