STOCKS

News


ఆసియా మార్కెట్లు నష్టాల్లో..

Thursday 18th October 2018
Markets_main1539837794.png-21265

  • చైనా షాంఘై కంపొజిట్‌ 2 శాతం పతనం

ఆసియా స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయాయి. ప్రధాన సూచీలన్నీ గురువారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగియడం, ఫెడరల్‌ రిజర్వు సెప్టెంబర్‌ సమావేశపు మినిట్స్‌ వడ్డీ రేట్ల పెంపును సూచిస్తుండటం ప్రతికూల ప్రభావం చూపాయి. చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొజిట్‌ ఏకంగా 2 శాతం మేర పతనమైంది. నాలుగేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. జపాన్‌ నికాయ్‌ 225.. 176 పాయింట్ల నష్టంతో 22,665 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 2 పాయింట్ల నష్టంతో 3,069 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 27 పాయిం‍ట్ల నష్టంతో 9,951 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 51 పాయింట్ల నష్టంతో 2,511 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 15 పాయింట్ల నష్టంతో 2,152 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 38 పాయింట్ల నష్టంతో 25,424 పాయింట్ల వద్ద ఉన్నాయి. 



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ దిగువకు..

Thursday 18th October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో గురువారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 10:00 గంటల సమయంలో 86 పాయింట్ల నష్టంతో 10,374 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ బుధవారం ముగింపు స్థాయి 10,443 పాయింట్లతో పోలిస్తే 69 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ రోజంతా ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తే..  నిప్టీ శుక్రవారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు

మార్కెట్‌కు సెలవు

Thursday 18th October 2018

దసరా సందర్భంగా నేడు (గురువారం) స్టాక్‌ మార్కెట్‌కు సెలవు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు పనిచేయవు. కాగా బుధవారం నాడు స్టాక్‌ మార్కెట్‌ లాభాలు మూడు రోజుల ముచ్చటే అయింది. డాలర్‌తో రూపాయి మారకం ఒడిదుడుకులకు గురికావడం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ భగ్గుమనడం వంటి కారణాల వల్ల ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు​చూపారు. దీంతో బుధవారం స్టాక్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మళ్లీ 35,000 పాయింట్ల

Most from this category