STOCKS

News


ఆసియా స్టాక్‌ సూచీలకు నష్టాలు..

Saturday 6th October 2018
Markets_main1538797872.png-20902

ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం నష్టాల్లోనే ముగిశాయి. జపాన్‌ నికాయ్‌ 225.. ఏకంగా 192 పాయింట్ల నష్టంతో 23,784 పాయింట్లకు తగ్గింది. దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 7 పాయింట్ల నష్టంతో 2,268 పాయింట్ల వద్ద ముగిసింది. హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 51 పాయింట్ల నష్టంతో 26,572 పాయింట్లకు క్షీణించింది. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 22 పాయింట్ల నష్టంతో 3,209 పాయింట్లకు తగ్గింది. తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ ఏకంగా 202 పాయిం‍ట్ల నష్టంతో 10,517 పాయింట్లకు తగ్గింది. ఇక పోతే చైనా స్టాక్‌ మార్కెట్‌ గత వారం రోజులుగా సెలవులో ఉంటూ వస్తోంది. చివరగా చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ సెప్టెంబర్‌ 28 నాడు 30 పాయింట్ల లాభంతో 2,821 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. యెన్‌ బలపడటంతో జపాన్‌ మార్కెట్‌ నష్టపోయింది. ఇక టెక్నాలజీ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుండటంతో ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. 



You may be interested

అమెరికా మార్కెట్లకు ఈల్డ్స్‌ దెబ్బ

Saturday 6th October 2018

అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 180 పాయిం‍ట్ల నష్టంతో 26,447 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంటెల్‌, క్యాటర్‌పిల్లర్‌ షేర్లు పడిపోవడం ప్రతికూల ప్రభావం చూపింది. ఎస్‌అండ్‌పీ 500.. 0.6 శాతం నష్టపోయి 2,885 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. టెక్నాలజీ రంగం సరైన పనితీరు కనబర్చకపోవడం ఇందుకు కారణం. ఇండెక్స్‌ ఈ వారం మొత్తంగా 1 శాతంమేర పడిపోయింది. ఇండెక్స్‌కు వారం వారీగా నెల రోజుల్లో

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌..

Saturday 6th October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం నష్టాలతో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 30 పాయింట్ల స్వల్ప నష్టంతో 10,270 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,347 పాయింట్లతో పోలిస్తే 77 పాయింట్లు నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిప్టీ సోమవారం నెగటివ్‌ లేదా గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.  శుక్రవారం ఆర్‌బీఐ వడ్డీ

Most from this category