ఆసియా మార్కెట్లు మిశ్రమం
By Sakshi

ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం మిశ్రమంగానే ముగిశాయి. జపాన్ నికాయ్ 225, దక్షిణ కొరియా కొస్పి, చైనా షాంఘై కంపొసిట్ మినహా మిగతా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లోనే ఉండిపోయాయి. జపాన్ ఇండెక్స్ నికాయ్ 225.. 191 పాయింట్ల లాభంతో 22,602 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్ కొస్పి 11 పాయింట్ల లాభంతో 2,293 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్ షాంఘై కంపొసిట్ 5 పాయింట్ల లాభంతో 2,729 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇక హాంగ్ కాంగ్ ఇండెక్స్ హాంగ్ సెంగ్ 119 పాయింట్ల నష్టంతో 27,672 పాయింట్ల వద్ద, తైవాన్ సూచీ తైవాన్ ఇండెక్స్ 54 పాయింట్ల నష్టంతో 10,809 పాయింట్ల వద్ద, సింగపూర్ ఇండెక్స్ స్ట్రైట్స్ టైమ్స్ 37 పాయింట్ల నష్టంతో 3,213 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి.
You may be interested
రూపాయి రికవరీ
Saturday 25th August 2018రూపాయి శుక్రవారం రికవరీ అయ్యింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ శుక్రవారం ఇండియన్ మార్కెట్లో 20 పైసలు బలపడి 69.91 వద్ద ముగిసింది. కార్పొరేట్స్, ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం సానుకూల ప్రభావం చూపింది. అమెరికా డాలర్‌లోని తీవ్రమైన ఒడిదుడుకులు రూపాయిపై త్రీవంగా ప్రభావం చూపుతున్నాయి. శుక్రవారం 70.20 వద్ద ప్రారంభమైన రూపాయి తర్వాత ఒకానొక సమయంలో 70.24 స్థాయికి కూడా పతనమైంది. అమెరికా-చైనా ప్రతినిధుల మధ్య గురువారం ముగిసిన
వేదాంత ఏడీఆర్ 6 శాతం జంప్..
Saturday 25th August 2018అమెరికా స్టాక్ మార్కెట్లోని న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్వైఎస్ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్ శుక్రవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ ఏడీఆర్‌లు తగ్గితే.. టాటా మోటార్స్, విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, వేదాంత ఏడీఆర్‌లు పెరిగాయి. వేదాంత ఏడీఆర్ అప్ వేదాంత ఏడీఆర్ ఏకంగా 6.16 శాతంమేర ఎగసింది. 12.76 డాలర్లకు పెరిగింది. విప్రో ఏడీఆర్ 2.77 శాతం వృద్ధితో 5.19 డాలర్లకు, టాటా మోటార్స్ ఏడీఆర్