STOCKS

News


చైనా ఎఫెక్ట్: ఆసియా డల్‌..

Saturday 15th December 2018
Markets_main1544857197.png-22963

చైనా పారిశ్రామికోత్పత్తి, రిటైల్‌ విక్రయాల గణాంకాలు నిరుత్సాహానికి గురిచేయడంతో ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ శుక్రవారం నష్టాలతోనే ముగిశాయి. సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 34 పాయింట్ల నష్టంతో 3,077 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 85 పాయింట్ల నష్టంతో 9,774 పాయింట్ల వద్ద ముగిసింది. చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 40 పాయింట్ల నష్టంతో 2,593 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 26 పాయింట్ల నష్టంతో 2,069 పాయింట్ల వద్దనే ఉంది.  హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 429 పాయింట్ల నష్టంతో 26,094 పాయింట్ల వద్ద ముగిసింది. జపాన్‌ నికాయ్‌ 225 కూడా ఏకంగా 441 పాయింట్ల నష్టంతో 21,374 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నికాయ్‌ ఇండెక్స్‌ 2 శాతానికి పైగా పతనమైతే.. చైనా షాంఘై, కొస్పి, హాంగ్‌ సెంగ్‌, స్ట్రైట్స్‌ టైమ్స్‌ ఇండెక్స్‌లు 1 శాతానికి పైగా నష్టపోయాయి. 



You may be interested

వాల్‌ స్ట్రీట్‌ క్రాష్‌

Saturday 15th December 2018

అమెరికా మార్కెట్లు శుక్రవారం పతనమయ్యాయి. ఇండెక్స్‌లు 2 శాతం మేర పడిపోయాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 2.02 శాతం లేదా 497 పాయిం‍ట్ల నష్టంతో 24,100 పాయింట్ల వద్ద ముగిసింది. మే నెల నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థాయి. యాపిల్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ షేర్లు నష్టపోవడం ఇండెక్స్‌ను కుంగదీసింది. ఈ ఏడాది ఇప్పటి దాకా చూస్తే డౌజోన్స్‌ లాభాలన్నీ అవిరయ్యి.. 2.5 శాతం మేర నష్టపోయింది. ఎస్‌అండ్‌పీ

విప్రో ఏడీఆర్‌ డౌన్‌..

Saturday 15th December 2018

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏడీఆర్‌లు పెరిగాయి. ఇకపోతే టాటా మోటార్స్‌, వేదాంత, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, విప్రో ఏడీఆర్‌లన్నీ తగ్గాయి. విప్రో ఏడీఆర్‌ గరిష్టంగా 2 శాతానికి పైగా పడిపోయింది.   టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 0.43 శాతం తగ్గుదలతో 11.53 డాలర్లకు క్షీణించింది. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ అధిక

Most from this category