STOCKS

News


ఎలక‌్షన్‌ ఫలితాలపై మార్కెట్‌ మనసు మారిందా?

Saturday 11th May 2019
Markets_main1557569597.png-25686

నెలారంభం వరకు ఎన్‌డీఏ మరలా గెలుస్తుందన్న అంచనాలతో పరుగులు తీసిన సూచీలు క్రమంగా పతనాభిముఖంగా పయనం ఆరంభించాయి. యూఎస్‌, చైనా వాణిజ్య ప్రతిష్టంభన బూచిగా చూపి సూచీలు దాదాపు 4 శాతం పతనమయ్యాయి. దేశంలో సార్వత్రిక ఎన్నికలు చరమాంకానికి చేరాయి. దీంతో మదుపరులంతా మరింత అప్రమత్తమయ్యారు. మార్కెట్లో వచ్చిన ఈ మార్పు ఎన్నికల ఫలితాలపై మార్కెట్‌ మనసు మారిందనేందుకు సంకేతంగా పోల్‌పండితులు భావిస్తున్నారు. ఎన్‌డీఏకు సరిపడా మెజార్టీ రాదన్న భావనతోనే సూచీలు తిరుగుముఖం పట్టాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే అనలిస్టులు మొన్నటి వరకు ఎన్‌డీఏనే మరలా వస్తుందన్న జోస్యాలు చెప్పారు. ఈ నేపథ్యంలో నిజ ఫలితాలు వచ్చే వరకు ఇన్వెస్టర్లు ఎవరిని పట్టించుకోవద్దని, సొంత అధ్యయనమే ఉత్తమమని నిపుణులు సలహా ఇస్తున్నారు. అంతర్జాతీయంగా యువాన్‌ మరింత క్షీణిస్తే డాలర్‌ మరింత బలపడుతుంది. ఇదే జరిగితే రూపీ మరింత దిగజారే ఛాన్సుంది.
టెక్నికల్స్‌
నిఫ్టీ తన కీలక మద్దతు స్థాయిలను వేగంగా కోల్పోయింది. గరిష్ఠాల వద్ద డబుల్‌ టాప్‌ ఏర్పరిచి కన్సాలిడేషన్‌ చెందిన సూచీలు ఆపై అప్‌ట్రెండ్‌ కొనసాగించలేకపోయాయి. దీంతో 11వేల పాయింట్ల వరకు పతనం ఉండొచ్చని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం నిఫ్టీకి స్వల్ప మద్దతు దొరకవచ్చని, 11వేలకు దిగజారడానికి కొంత సమయం పట్టవచ్చని విశ్లేషిస్తున్నారు. ఈ దశలో పెరిగినప్పుడు అమ్ము అనే సూత్రం పాటించాలని సూచిస్తున్నారు. ఫలితాలు దగ్గరపడే కొద్దీ ఆటుపోట్లు మరింత తీవ్రమవుతాయని, స్టాప్‌లాస్‌లు వేగంగా కనుమరుగవుతుంటాయని హెచ్చరించారు. అందువల్ల సాధారణ స్థాయిలకు దూరంగా స్టాప్‌లాస్‌లు ఉంచుకోవాలని సలహా ఇచ్చారు. ఈ వారం వాణిజ్య చర్చల ఫలితాలు, కంపెనీల క్యు4 ఫలితాలు మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయి. వారాంతానికి ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రభావం ఉంటుంది. మార్కెట్లో అనుకోని పానిక్‌ పతనం వస్తే నాణ్యమైన స్టాకులను కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎఫ్‌ఎంసీజీలో వాల్యూపిక్స్‌ కనిపిస్తున్నాయి. You may be interested

ఐదు సెషన్‌లో రూ.లక్షకోట్ల ఆవిరి

Saturday 11th May 2019

ముంబై : ప్రైవేట్‌ రంగ దిగ్గజ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఐదు సెషన్లలో రూ.లక్ష కోట్ల మార్కెట్‌ క్యాపిటిలైజేషన్‌ తుడిచిపెట్టుకుపోయింది. మార్కెట్లో నెలకొన్న అస్థిరతకు తోడు, ఇటీవల కంపెనీ షేరుకు ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు ‘‘బేరిష్‌’’ రేటింగ్‌ కేటాయింపు ఇందుకు కారణమైంది. రూ.లక్ష కోట్ల మార్కెట్‌ క్యాప్‌ హరించుకోవడంతో ‘‘అత్యధిక మార్కెట్‌ క్యాప్‌ కలిగిన కంపెనీ’’ అనే పేరును కోల్పోయింది. ఇప్పుడు ఈ స్థానాన్ని ఐటీ సేవల దిగ్గజ కంపెనీ

ఇవన్నీ వాల్యూస్టాకులేనా?!

Saturday 11th May 2019

గత నెల గరిష్ఠాల నుంచి ప్రధాన సూచీలు దాదాపు 3 శాత పతనమయ్యాయి. నిఫ్టీ కీలక డీఎంఏలకు దిగువన ట్రేడవుతోంది. తాజా పతనానికి లార్జ్‌క్యాప్స్‌లో వచ్చిన అమ్మకాల ఒత్తిడే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుత పతనంతో నిఫ్టీ 50లో దాదాపు సగం కంపెనీలు తమతమ పదేళ్ల సరాసరి పీఈ కన్నా దిగువన ట్రేడవుతున్నాయి. కంపెనీ ఎర్నింగ్స్‌కు, స్టాకు ధరకు మధ్య సంబంధాన్ని పీఈ తెలుపుతుంది. పీఈ తక్కువున్న స్టాకులపై టెక్‌

Most from this category