STOCKS

News


యాపిల్‌ ఐపాడ్‌ప్రో వచ్చింది.

Wednesday 31st October 2018
Markets_main1540972151.png-21609

- ఐఫోన్ 10ఎస్ ఫీచర్లు
- 12.9 అంగుళాల స్క్రీన్‌
- ధర 999 డాలర్లు

న్యూయార్క్‌: గ్యాడ్జెట్‌ ప్రియుల కోసం యాపిల్‌ ‘ఐప్యాడ్ ప్రో’ను  మంగళవారం ఆవిష్కరించింది. తాజాగా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఐఫోన్ 10ఎస్ ఫీచర్లతో ఈ ఐప్యాడ్‌ రూపొందింది. రెండు వేరియంట్లలో ఈ గ్యాడ్జెట్స్‌ లభిస్తున్నాయి. 11 అంగుళాల స్క్రీన్‌ కలిగిన ఐప్యాడ్‌ ధర 799 అమెరికా డాలర్లు. కాగా, 12.9 అంగుళాల ఐప్యాడ్‌ ధర 999 అమెరికా డాలర్లుగా కంపెనీ ప్రకటించింది. ఎడ్జ్ టూ ఎడ్జ్‌ డిస్‌ప్లే, వేగవంతమైన ప్రాసెసర్లు, మరింత మెరుగైన బ్యాక్ కెమెరా, పేమెంట్లు నిర్వహించడం, డివైజ్‌ అన్‌లాక్‌ చేయడం కోసం ఫేస్‌ ఐడీ వంటి అధునాత ఫీచర్లను ఈ డివైజెస్‌ కలిగిఉన్నట్లు తెలిపింది.



You may be interested

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా భేష్‌

Wednesday 31st October 2018

-20 శాతం వృద్ధి -మెరుగుపడిన రుణ నాణ్యత -8 శాతం వృద్ధితో రూ.13,430 కోట్లకు మొత్తం ఆదాయం ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా  ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌లో రూ.425 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.355 కోట్ల నికర లాభం వచ్చిందని 20 శాతం వృద్ధి సాధించామని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తెలిపింది. మొండి బకాయిల పరిస్థితి మెరుగుపడటంతో నికర లాభం ఈ

1న వ్యవస్థలోకి రూ.12వేల కోట్లు

Wednesday 31st October 2018

ముంబై: దీపావళి నేపథ్యంలో వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) పెంచాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నవంబర్‌1వ తేదీన ప్రభుత్వ బాండ్ల కొనుగోలు ద్వారా బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి రూ.12,000 కోట్లు విడుదల చేయనుంది.  పండుగల సీజన్‌ ఫండ్స్‌ డిమాండ్స్‌ను ఎదుర్కొనడానికి నవంబర్‌ నెలలో మొత్తం రూ.40,000 కోట్లను బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి విడుదల చేయనున్నట్లు గత వారం ఆర్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Most from this category