STOCKS

News


ప్రతీ సంక్షోభం సంపద సృష్టికి అవకాశమే!

Wednesday 19th September 2018
Markets_main1537297550.png-20367

మార్కెట్లో సంక్షోభాలు, బుల్‌ ర్యాలీలు క్రమం తప్పకుండా కనిపించే పరిణామాలుగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. 2008 నాటి ఆర్థిక సంక్షోభం ఇన్వెస్టర్లకు ఎన్నో పాఠాలను నేర్పింది. ఇన్వెస్టర్లకు చేదు అనుభవాలను మిగిల్చిన సంక్షోభాల్లో ఇదీ ఒకటి. ఆ సమయంలో మార్కెట్లు కుప్పకూలడంతో స్టాక్స్‌ చెల్లాచెదురయ్యాయి. నాటి నష్టాలను తట్టుకోలేక ఉన్నవన్నీ అమ్ముకుని బయటపడిన వారు ఎందరో. నిజానికి నాటి సంక్షోభ సమయంలో భయపడి ఉన్నదంతా అమ్ముకున్న వారు, ఆ తర్వాతి సంవత్సరం 2009లో మార్కెట్లు తిరిగి కోలుకున్న సమయంలో బాధపడాల్సి వచ్చింది. అందుకే ప్రతీ ఇన్వెస్టర్‌ కూడా ఈ తరహా అనుభవాలను తీసుకుని, మార్కెట్‌ పతనాల్లో ఏ మేరకు నష్టాలను భరించగలమన్న దానిపై ఓ విధానాన్ని పాటించడం అవసరం. ఇందుకు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు, రిస్క్‌ అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని శాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అధికారి సునీల్‌ శర్మ సూచించారు. 

 

‘‘2008 సంక్షోభ తదనంతర పరిణామాల్లో ఇన్వెస్టర్లు ఈక్విటీలకు భయపడి తమ పెట్టుబడులను ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలోకి మళ్లించుకున్నారు. 2014 మధ్య వరకు ఈక్విటీల పట్ల ప్రతికూల ధోరణితోనే ఉన్నారు. గత మూడేళ్లుగా మళ్లీ ఈక్విటీల్లోకి అడుగుపెట్టారు. నిజానికి ఈ విధమైన అధిక భద్రత, నిరాశావాదం అన్నవి దీర్ఘకాలంలో ఈక్విటీల రాబడులకు ముప్పుగా భావించాల్సి ఉంటుంది. పెట్టుబడులకు సంబంధించి మానసిక పరమైన అంశాలను కూడా అర్థం చేసుకోవాలి. ప్రతీ సంక్షోభం అనంతరం మార్కెట్లు స్వల్ప కాలంలోనే అధిక స్థాయిలకు చేరాయి. ఇది మార్కెట్ల సహజ రీతి’’ అని శర్మ తెలియజేశారు.

 

కొనుగోలు చేసి కొనసాగడం
మన ఈక్విటీ మార్కెట్లలో మంచి స్టాక్స్‌ను కొనుగోలు చేసి కొనసాగించడం అన్నది దీర్ఘకాలంలో మంచి లాభసాటి అని నిరూపితమైన అంశం. కానీ, జపాన్‌ మార్కెట్‌ విషయంలో ఇలా లేదు. 1990ల్లో నికాయ్‌ 38,000 స్థాయికి చేరింది. కానీ 2009 నాటికి 7,173కు పడిపోయింది. తిరిగి ఇప్పుడు 22,000కు పైన ఉంది. అందుకే నాణ్యమైన స్టాక్స్‌ను సరసమైన ధరల వద్ద కొనుగోలు చేసి, వాటిని హోల్డ్‌ చేయడమే ఫలితమిస్తుంది.

 

అప్పుతో వద్దు
‘అప్పు చేసి పప్పుకూడు’ అన్నది రాబడులను చంపేస్తుంది. 2008 నాటి లెహమాన్‌ బ్రదర్స్‌ సంక్షోభం అధిక పరపతి ఆధారంగా కొనసాగిందే. ఇన్వెస్టర్లు స్థూల ఆర్థిక వాతావరణాన్ని గమనించాలి. పోర్ట్‌ఫోలియో రాబడులపై ప్రభావం చూపించే అంశాలపై అవగాహన కలిగి ఉండాలి. పెద్ద సంక్షోభాలకు ముందు ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోను కాపాడుకునేందుకు కొన్న వాటిని కొనసాగించడం లేదా క్రమానుగతంగా కొనుగోలు చేయడం ద్వారా మెరుగైన రాబడులను అందుకోవచ్చు. You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 40 పాయింట్లు అప్‌

Wednesday 19th September 2018

ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలతో సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ బుధవారం ఉదయం 8.30 గంటల సమయానికి 40 పాయింట్ల పెరుగుదలతో 11,347 పాయింట్ల వద్ద ట్రేడవుతుంది. క్రితం రోజు ఇక్కడ భారీ పతనం తర్వాత నిఫ్టీ ఫ్యూచర్‌ 11,407 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఫ్యూచర్‌కు అనుసంధానమయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ క్రితం ముగింపుతో పోలిస్తే 40 పాయింట్లు పెరిగింది. గత రాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు 1 శాతంపైగా

అప్‌ట్రెండ్‌ కొనసాగుతుంది: మోర్గాన్‌ స్టాన్లీ

Wednesday 19th September 2018

ప్రస్తుత సమస్యలను మార్కెట్లు ఇప్పటికే సర్దుబాటు చేసుకున్నాయని, ఫండమెంటల్‌ విలువలు ప్రస్తుత అప్‌ట్రెండ్‌ కొనసాగుతుందని తెలియజేస్తున్నట్టు మోర్గాన్‌స్టాన్లీ ఇండియా ఎండీ రిధమ్‌ దేశాయ్‌ పేర్కొన్నారు. సెన్సెక్స్‌ 2019 సెప్టెంబర్‌ నాటికి 42,000కు చేరుతుందని, ఇక్కడి నుంచి 11 శాతం అప్‌సైడ్‌కు అవకాశం ఉంటుందని మోర్గాన్‌స్టాన్లీ తన తాజా నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే. తొలుత 2019 జూన్‌కు 36,000 టార్గెట్‌ ఇవ్వగా, అది ఈ ఏడాది జూలైలోనే సెన్సెక్స్‌ అధిగమించేసింది.

Most from this category