STOCKS

News


తగ్గితే.. కొనండి..

Monday 10th December 2018
Markets_main1544426879.png-22802

నిఫ్టీ 10,960 మార్క్‌ను అధిగమించడంలో విఫలమైందని రుద్రా షేర్స్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ సీనియర్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ మనాలి భాటియా తెలిపారు. గత వారంలో 1.68 శాతం మేర పతనమైందని, 10,693 వద్ద ముగిసిందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఎన్నికల ఫలితాల వెల్లడి నేపథ్యంలో మార్కెట్‌లో తీవ్ర ఒడిదుడుకులు ఉండొచ్చని అంచనా వేశారు. రాజస్తాన్‌లో బీజేపీ ఓడిపోతుందని మార్కెట్‌ వర్గాలు ఇప్పటికే అంచనాకు వచ్చేశాయని తెలిపారు. అయితే మధ్యప్రదేశ్‌, ఛత్తీశ్‌గఢ్‌లలో బీజేపీకి ఎదురుగాలి వీస్తే మాత్రం మార్కెట్లలో తీవ్ర ఆటుపోట్లు ఉంటాయని పేర్కొన్నారు. టెక్నికల్‌గా చూస్తే.. 10,870పైన ట్రేడ్ అయ్యి, ఈ స్థాయికి పైనే ముగిస్తే.. ఇండెక్స్‌ 11,046, 11,235 స్థాయిలకు చేరొచ్చని అంచనా వేశారు. శుక్రవారం రోజు నిఫ్టీ బుల్లిష్‌ హరామి క్యాండిల్‌స్టిక్‌ ప్యాట్రన్‌ను ఏర్పరచిందని తెలిపారు. ఇండెక్స్‌కు 10,588 వద్ద బలమైన మద్దతు లభించొచ్చని, ఈ స్థాయి కిందకు పడిపోతే 10,470.. 10,291 స్థాయిల వద్ద మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. స్థూల ఆర్థికాంశాలు మెరుగుపడుతుండటం, క్రూడ్‌ ఆయిల్‌ ధరలు చల్లారడం, బాండ్‌ ఈల్డ్స్‌ దిగిరావడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఎన్నికల ఫలితాలు మార్కెట్‌ ట్రెండ్‌ను మార్చలేవనే అంచనాకు రావొచ్చని తెలిపారు. అందువల్ల ఎన్నికల వల్ల మార్కెట్‌లు పడిపోయిన్నప్పుడు నాణ్యమైన స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేశారు.  

ఆయన సమీప కాలంలో మంచి రాబడి అందించగల మూడు స్టాక్స్‌ను సిఫార్సు చేశారు. అవేంటో ఒకసారి చూద్దాం..  

జేకే పేపర్‌
విక్రయాల వృద్ధి, అధిక లాభదాయకత, మెరుగైన నిర్వహణ పనితీరు వంటి అంశాల కారణంగా ప్రస్తుత క్యూ2లో కంపెనీ అధిక లాభాన్ని అర్జించింది. అలాగే సామర్థ్యం పెంపుపై కూడా కంపెనీ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. చైనాలో పేపర్‌ తయారీపై తగ్గుదల.. ఇండోనేసియా, థాయ్‌లాండ్‌, సింగపూర్‌ దేశాల నుంచి వస్తోన్న దిగుమతులపై యాంటీ డంపింగ్‌ డ్యూటీ వంటి అంశాల నేపథ్యంలో భవిష్యత్‌లో పేపర్‌కు డిమాండ్‌ పెరిగే అంచనాలున్నాయి. అందువల్ల రూ.180 టార్గెట్‌ ప్రైస్‌తో జేకే పేపర్‌ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. దాదాపు 15 శాతం రాబడిని అంచనా వేయవచ్చు.

మహానగర్‌ గ్యాస్‌
కంపెనీ తన కార్యకలాపాల విస్తరణపై దృష్టి కేంద్రీకరించింది. క్లీనర్‌ ఫ్యూయెల్స్‌ డిమాండ్‌ పెరుగుదలను అందిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుత క్యూ2 కంపెనీ స్థూల మార్జిన్లపై ఒత్తిడి ఏర్పడింది. అమెరికా డాలర్‌- ఇండియన్‌ రూపాయి మారక విలువ, ఆర్‌ఎల్‌ఎన్‌జీ ధరల పెరుగుదల, ఏపీఎం గ్యాస్‌ ధర ఎగయడం వంటి అంశాలు ఇందుకు కారణం. అయితే బలమైన బ్యాలెన్స్‌ షీట్‌, రుణ రహితం, అధిక క్యాష్‌ఫ్లో, ఆరోగ్యకరమైన రిటర్న్‌ రేషియో వంటివి కంపెనీకి సానుకూల అంశాలు. అలాగే కంపెనీ తన సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ను విస్తరించుకుంటోంది. ఇది పాజిటివ్‌ అంశం. రూ.972 టార్గెట్‌ ప్రైస్‌తో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. దాదాపు 13 శాతం రాబడిని అంచనా వేయవచ్చు. 

మహీంద్రా అండ్‌ మహీంద్రా
కంపెనీ పలు కొత్త ప్రాడక్టులను మార్కెట్‌లోకి తీసుకువస్తోంది. ఇప్పటికే మారాజోను ఆవిష్కరించింది. అల్‌టురాస్‌జీ4, ఎస్‌201 వంటి మోడళ్లను తీసుకురానుంది. 2018 నవంబర్‌లో కంపెనీ దేశీ విక్రయాలు 15 శాతం వృద్ధితో 41,564 యూనిట్లకు పెరిగాయి. వాహన పరిశ్రమకు సంబంధించిన ఔట్‌లుక్‌ బలహీనంగా ఉన్నప్పటికీ.. ఇంధన ధరల తగ్గుదల, లిక్విడిటీ మెరుగుదల వంటి అంశాలు రానున్న కాలంలో ప్యాసింజర్‌ వాహన అమ్మకాల వృద్ధికి దోహదపడతాయి. అలాగే కంపెనీ అనుబంధ సం‍స్థ జావా బైక్స్‌ను తీసుకువస్తోంది. అలాగే కంపెనీ 2020 కల్లా ఎలక్ట్రిక్‌ వాహనాలను ఆవిష్కరించడాని రెడీ అవుతోంది. అందువల్ల రూ.830 టార్గెట్‌ ప్రైస్‌తో ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు. దాదాపు 15 శాతం రాబడిని అందుకోవచ్చు. You may be interested

ఐఓసీ షేర్లకు బైబ్యాక్‌ ఆఫర్‌ జోష్‌

Monday 10th December 2018

ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ ఆఫర్‌ జోష్‌తో ప్రభుత్వరంగ కంపెనీ ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌(ఐఓసీ) షేర్లు మార్కెట్‌ నష్టాలకు ఎదురీదుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలతో పాటు, ఇటీవల వెలువడిన ఐదు రాష్ట్రాల ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపడంతో సూచీలు భారీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఐఓసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ ఇష్యూ, షేరుపై మధ్యంతర డివిండెండ్‌ ప్రకటనపై చర్చించేందుకు కంపెనీ

ఎలక‌్షన్‌ ఫలితాల టెన్షన్‌ : అదానీ గ్రూప్‌ షేర్లు డౌన్‌

Monday 10th December 2018

సాధారణ ఎన్నికలకు సెమిఫైనల్‌ భావించే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్న నేపథ్యంలో సోమవారం మార్కెట్లో ఇన్వెస్టర్ల అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు. ఈ ఎన్నికల్లో కేంద్రం ప్రభుత్వమైన భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఫలితాలు వెలువడతాయేమోనన్న భయాలతో బీజేపీకి సన్నిహిత గ్రూప్‌గా  పేరొందిన అదానీ గ్రూప్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి. ఈ గ్రూప్‌లోని అదానీ పవర్‌, అదానీ పోర్ట్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్స్‌ షేర్లు 7నుంచి

Most from this category