STOCKS

News


ప్రతి పతనం ఒక అవకాశమే!

Monday 25th March 2019
Markets_main1553497804.png-24780

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
నిఫ్టీ, సెన్సెక్స్‌ పలు రోజుల పరుగుల అనంతరం ప్రాఫిట్‌ బుకింగ్‌ చవిచూస్తున్నాయి. శుక్రవారం కనిపించిన బలహీనత మార్కెట్లో సోమవారం కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి పుల్‌బ్యాక్స్‌ను కొత్త కొనుగోళ్లకు అవకాశంగా భావించాలని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అనలిస్టు నాగరాజ్‌ షెట్టి సూచించారు. ప్రస్తుతం వచ్చిన బలహీనత ఓవర్‌బాట్‌ వల్ల వచ్చిందని, మరికొంత సమయం ఈ బలహీనత కొనసాగవచ్చని అంచనా వేశారు. అయితే ఈ బలహీనత సమయాలను కొనుగోళ్లకు అవకాశంగా మలచుకోవాలని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్‌ దీర్ఘకాల బుల్‌దశలో ఉందన్నారు.

వీక్లీ చార్టుల్లో హై వేవ్‌ టైప్‌ పాటర్న్‌ ఏర్పడిందని విశ్లేషించారు. మూడు, నాలుగువారాల్లో వేగంగా పైకి ఎగిసిన మార్కెట్లో లాభాల స్వీకరణ ఉంటుందని చెప్పారు. నిఫ్టీ అప్‌బ్రేకవుట్‌ తర్వాత ఈ వెనుకంజ సహజమని చెప్పారు. ఇలాంటి చిన్న పతనాలు, లాభాల స్వీకరణలు మొత్తంగా ఉన్న లాంగ్‌ అప్‌ట్రెండ్‌ను దెబ్బతీయవన్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో నిఫ్టీ 11550 పాయింట్ల వద్ద నిరోధాన్ని ఎదుర్కొంది. నిఫ్టీకి తక్షణ మద్దతు 11200- 11250 పాయింట్ల వద్ద దొరకవచ్చు. ఈ స్థాయి వద్ద మరలా కొనుగోళ్లు పెరుగుతాయి. వచ్చే ఒకటి రెండు వారాల్లో నిఫ్టీ ఈ దశలోకి రావచ్చు. అనంతరం చూపే అప్‌ట్రెండ్‌లో ఇటీవలి గరిష్ఠాన్ని తాకడం లేదా దాటేయడం జరుగుతుంది. స్వల్పకాలానికి బ్యాంకింగ్‌, ఫార్మా, చమురు మరియు గ్యాస్‌, క్యాపిటల్‌ గూడ్స్‌ రంగాల షేర్లు బుల్లిష్‌గా ఉండొచ్చని అంచనా. 



You may be interested

పెరిగిన పసిడి

Monday 25th March 2019

అంతర్జాతీయ ఆర్థిక మాంద్య ఆందోళనలు పసిడి బలానిచ్చాయి. ఫలితంగా సోమవారం ట్రేడింగ్‌లో 5డాలర్లు లాభపడింది. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ ఉన్నట్టుండి ఈ ఏడాది(2019)లో వడ్డీ రేట్ల పెంపు ఉండబోదంటూ సంకేతాలివ్వడంతో ఇన్వెస్టర్లలో ఆర్థికవృద్ధి ఆందోళనలు రేకెత్తాయి. ఫలితంగా అమెరికాతో పాటు ఆసియాలోనూ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మక ధోరణిలో భాగంగా పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు మొగ్గు చూపారు. దీంతో నేటి ట్రేడింగ్‌లో

ఈ సీరిస్‌లో 11300 వరకు పతనం!

Monday 25th March 2019

నిఫ్టీ మార్చి సీరిస్‌లో 11300- 11350 పాయింట్ల వరకు పతనమవుతుందని సామ్‌కో సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌ హెడ్‌ ఉమేశ్‌ మెహతా అంచనా వేశారు. నిఫ్టీ పరుగులకు విరామం వచ్చే సమయమిదన్నారు. ఇప్పటివరకు సూచీల్లో కనిపించిన ఉత్సాహం సన్నగిల్లిందన్నారు. అందువల్ల నిఫ్టీ ఈ సీరిస్‌ చివరకు 11300-11350 పాయింట్ల వరకు క్షీణించే అవకాశాలున్నాయన్నారు. ప్రధాన ఇండికేటర్లన్నీ ఓవర్‌బాట్‌ స్థితిని సూచిస్తున్నాయని, అందువల్ల గరిష్ఠాల నుంచి పుల్‌బ్యాక్‌ తప్పకపోవచ్చని చెప్పారు. బ్యాంకు నిఫ్టీ సైతం

Most from this category