News


పాజిటివ్‌ స్టార్ట్‌

Friday 15th March 2019
Markets_main1552621329.png-24618

అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారయ్యిందనేవార్తలతో ఆసియా మార్కెట్లు జోరుగా పెరిగిన నేపథ్యంలో నాలుగురోజులపాటు పెద్ద ర్యాలీ జరిపిన భారత్‌ సూచీలు శుక్రవారం సైతం పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 100 పాయింట్ల లాభంతో 37,855 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 11376 పాయింట్ల వద్ద మొదలయ్యింది. కొద్ది నిముషాల్లోనే 10,400పైకి నిఫ్టీ ఎగబాకడం విశేషం. కొటక్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు ట్రేడింగ్‌ ప్రారంభంలో 1-2 శాతం మధ్య జంప్‌చేశాయి. కోల్‌ ఇండియా, హింద్‌లీవర్‌, జీ టెలి, బజాజ్‌ ఆటోలు 1 శాతంవరకూ నష్టపోయాయి. 

ఆసియా మార్కెట్ల జోరు...

అమెరికాతో డీల్‌ కుదరబోతుందన్న అంచనాలతో తాజాగా ఆసియాలో చైనా షాంఘై ఇండెక్స్‌ 2 శాతం జంప్‌చేయగా, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ సూచి 1 శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. జపాన్‌ నికాయ్‌ కూడా 1 శాతం పెరిగింది. సింగపూర్‌ స్రె‍్టయిట్‌టైమ్స్‌, కొరియా కోస్పిలు  తైవాన్‌ వెయిటెడ్‌ సూచీలు అరశాతం లాభంతోనూ కదులుతున్నాయి.  గత  రాత్రి అమెరికా డోజోన్స్‌ ఇండస్ట్రియల్‌ ఏవరేజ్‌,  నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ సూచీలు స్వల్పంగా పెరిగాయి.



You may be interested

కంపెనీలకు కాసులు కురిపించే పోల్‌ సీజన్‌

Friday 15th March 2019

కంపెనీలకు కాసులు కురిపించే పోల్‌ సీజన్‌ బిస్కట్లు, స్నాక్స్‌, పానీయాలకు డిమాండ్‌ 2014 ఎన్నికల సీజన్‌తో పోలిస్తే పెరుగుతుందని అంచనా అదనపు నిల్వలతో పెరిగే డిమాండ్‌కు కంపెనీలు సిద్ధం డిస్ట్రిబ్యూటర్ల స్థాయిలో అమ్మకాలపై ప్రోత్సాహకాలు న్యూఢిల్లీ: మన దేశంలో ఎన్నికలు ఓ పెద్ద మార్కెట్‌. ఎప్పుడు ఎన్నికలు జరిగినా... రాజకీయ పార్టీలకు ప్రచార సామగ్రిని సమకూర్చే వారికి బోలెడంత ఉపాధి. మరీ ముఖ్యంగా కంపెనీల ఉత్పత్తుల అమ్మకాలూ జోరుగా సాగుతాయి. బిస్కట్లు, స్నాక్స్‌, పానీయాలు పెద్ద ఎత్తున

టోకు ధరలూ పెరిగాయ్‌!

Friday 15th March 2019

న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణంతోపాటు టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణమూ ఫిబ్రవరిలో స్వల్పంగా పెరిగింది. ఫిబ్రవరిలో (2018 ఫిబ్రవరితో పోల్చి) టోకు వస్తువుల బాస్కెట్‌ ధరల స్పీడ్‌ 2.93 శాతంగా ఉంది. ఈ ఏడాది జనవరిలో టోకు ద్రవ్యోల్బణం 2.76 శాతం ఉంటే,  2018 ఫిబ్రవరిలో 2.74 శాతంగా నమోదయ్యింది. కూరగాయలు, తృణధాన్యాలుసహా ఆహార వస్తువుల ధరల్లో పెరుగుదల తాజా గణాంకాలపై

Most from this category