News


ఐపీఓకు అన్నై ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ !

Wednesday 3rd April 2019
Markets_main1554276596.png-24950

ఇష్యూ సైజు రూ.200-225 కోట్లు ! 
న్యూఢిల్లీ: ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెం‍ట్‌ కన్‌స్ట్రక్షన్‌ (ఈపీసీ) కంపెనీ అన్నై ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు వస్తోంది. తమిళనాడుకు చెందిన ఈ కంపెనీ ఐపీఓ సంబంధిత పత్రాలను మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీకి ఇటీవలనే సమర్పించింది. ఐపీఓలో భాగంగా రూ.10 ముఖ విలువ గల కోటి ఈక్విటీ షేర్లను జారీచేస్తారు. ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ప్రాతిపదికన 16 లక్షల ఈక్విటీ షేర్లను కూడా జారీ చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.200-225 కోట్ల మేర నిధులు సమీకరిస్తుందని అంచనా. ఈ నిధులను సాధారణ వాణిజ్య కార్యకలాపాలకు, ప్లాంట్‌, ఎక్విప్‌మెంట్‌ కొనుగోళ్లకు, వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాల కోసం వినియోగించాలని కంపెనీ భావిస్తోంది. ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్‌గా పంటోమత్‌ క్యాపిటల్‌ అడ్వైజర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, రిజిష్ట్రార్‌గా లింక్‌ ఇన్‌టైమ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లు వ్యవహరిస్తున్నాయి. వాటర్‌ మేనేజ్‌మెంట్‌, సాగునీటి ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ఈపీసీ కార్యకలాపాలను ఈ కంపెనీ నిర్వహిస్తోంది. కంపెనీ ఆర్డర్‌ బుక్‌లో ప్రస్తుతం 19 ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వీటిల్లో తమిళనాడుకు చెందినవి 14 కాగా, కేరళకు చెందినవి ఐదు ఉన్నాయి.



You may be interested

2019లో తగ్గనున్న వాణిజ్య వృద్ధి

Wednesday 3rd April 2019

2019లో మరింత తగ్గనున్న వాణిజ్య వృద్ధి అంతర్జాతీయ ఉద్రిక్తతలు, అనిశ్చితులే కారణం  ప్రపంచ వాణిజ్య సంస్థ అంచనా జెనీవా: ఉద్రిక్తతలతోపాటు ఆర్థిక అనిశ్చితుల వల్ల 2019లో క్రితం సంవత్సరంతో పోలిస్తే వాణిజ్య వృద్ధి తగ్గుముఖం పడుతుందని ప్రపంచ వాణిజ్య సం‍స్థ (డబ్ల్యూటీవో) అంచనా వేసింది. ఈ ఏడాది వాణిజ్యం 3.7 శాతం వృద్ధి చెందుతుందని గతంలో ఈ సం‍స్థ అంచనా వేయగా, దీన్ని తాజాగా 2.6 శాతానికి తగ్గించింది. ఈ మేరకు వార్షిక అంచనాలను

ఎన్నికల తర్వాత ఐపీఓల జోరు

Wednesday 3rd April 2019

ఫలితాల కోసం చూస్తున్న ఇన్వెస్టర్లు, కంపెనీలు -సుస్థిర ప్రభుత్వం వస్తే ఐపీఓల వెల్లువ -ఇప్పటికే 70 కంపెనీల క్యూ -ఈవై తాజా నివేదిక  -గత ఆర్థిక సంవత్సరంలో తగ్గిన ఐపీఓల జోరు న్యూఢిల్లీ: ఎన్నికల అనంతరం కంపెనీల ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)ల జోరు మరింతగా ఉంటుందని ఎర్నస్ట్‌ అండ్‌ యంగ్‌(ఈవై) తాజా నివేదిక పేర్కొంది. ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంలో 14 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.6,482 కోట్లు(94 కోట్ల డాలర్లు) సమీకరించాయని తెలిపింది.

Most from this category