STOCKS

News


అమ్మకాల ఒత్తిడిలో అడాగ్‌ ‍గ్రూప్‌ షేర్లు

Wednesday 12th September 2018
Markets_main1536739596.png-20200

ముంబై:- హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్న మార్కెట్లలో అనిల్‌ అంబానీ గ్రూప్‌(అడాగ్‌) కౌంటర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలు జరపడంతో  బుధవారం పలు అడాగ్‌ షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. గ్రూప్‌లో రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ షేర్లు 5నుంచి 4శాతం క్షీణించాయి.  
రిలయన్స్‌ క్యాపిటల్‌ :- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.440.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మంగళవారం తొలి తైమాసికంలో ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించకపోవడంతో ఈ కంపెనీ షేరు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రిలయన్స్ కేపిటల్‌ రూ. 272 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ1లో రూ.378 కోట్ల నికర నష్టం ప్రకటించింది. ఇదే క్యూ1లో మొత్తం ఆదాయం రూ.4,641ను నమోదు చేసింది. గతేడాది ఇదే క్యూ1లో సాధించిన రూ.4,444 కోట్లతో ఇది ఇది 4శాతం అధికం.  షేరు ఇంట్రాడేలో 7శాతం నష్టపోయి రూ.410.30 కనిష్టానికి చేరుకుంది. మధ్యాహ్నం గం.12:30ని.లకు సూచి గత ముగింపు ధర రూ.439.75తో పోలిస్తే 5.50శాతం నష్టంతో రూ.414.40ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.452.30ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 5శాతం నష్టపోయి రూ.433.50ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.12:30ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.439.75)తో పోలిస్తే 4శాతం నష్టంతో రూ.438.60ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ :- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.16.20ల వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. ఇంట్రాడేలో 5శాతం నష్టపోయి రూ.15.35ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.12:30ని.లకు షేరు గత ముగింపు ధర(రూ.16.15)తో పోలిస్తే 4.33శాతం నష్టంతో రూ.15.45ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

స్టాక్స్‌ ఎంపికలో జాగ్రత్త!!

Wednesday 12th September 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే దేశీ కరెన్సీ కొత్త కనిష్ట స్థాయిలకు పతనమౌతోందని 5నాన్స్‌.కామ్‌ ఫౌండర్‌ దినేశ్‌ రొహిరా తెలిపారు. కరెంట్‌ అకౌంట్‌ లోటు పెరిగిందన్నారు. ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు సోమవారం కీలక స్థాయిల దిగువకు వచ్చేశాయని పేర్కొన్నారు. అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు మళ్లీ ఆజ్యం పోసుకోవడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోందని తెలిపారు.  ఈ వారంలో నిఫ్టీ ఇండెక్స్‌ తొలిగా 11,500 స్థాయి కిందకు, తర్వాత 1,300 స్థాయి దిగువకు వచ్చిందని పేర్కొన్నారు.

నిఫ్టీ 11,264 పైన నిలిస్తే 11,600కే

Wednesday 12th September 2018

నిఫ్టీకి 11,264 స్థాయి వద్ద కీలక మద్దతు ఉందని యస్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ ఆదిత్య అగర్వాల్‌ తెలిపారు. దీనికి పైన స్థిరపడితే అప్పుడు ఇండెక్స్‌ 11,600-11,750 స్థాయికి చేరొచ్చని అంచనా వేశారు. 11,265-11,260 దిగువకు పడిపోతే అప్పుడు ఇండెక్స్‌ 11,200-11,175 స్థాయికి పడిపోయే అవకాశముందని తెలిపారు. అలాగే ఆర్‌ఎస్‌ఐ ఓవర్‌ సోల్డ్‌ జోన్‌కు వెళ్లిందని పేర్కొన్నారు. అందువల్ల ఇండెక్స్‌లో పుల్‌బ్యాక్‌ ర్యాలీ ఉండొచ్చని తెలిపారు. వచ్చే 3-4 వారాలో

Most from this category