STOCKS

News


నష్టాల్లో అనిల్‌ అంబానీ షేర్లు

Thursday 6th June 2019
Markets_main1559813470.png-26136

అనిల్‌ అంబానీ కంపెనీ షేర్లు గురువారం నష్టాల బాట పట్టాయి. ఈ గ్రూప్‌నకు చెందిన షేర్లు దాదాపు 13శాతం క్షీణించాయి. అత్యధికంగా రిలయన్స్‌ ఇన్ఫ్రా షేర్లు 12శాతం నష్టపోయాయి. ఇంట్రాడేలో రూ.85.50ల వద్ద ఏడాది కనిష్టాన్ని నమోదు చేసింది. మిడ్‌సెషన్‌ సమయానికి 11శాతం నష్టంతో రూ.86.25ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. రిలయన్స్‌ క్యాపిటల్‌ షేర్లు 8శాతం నష్టపోయాయి. మిడ్‌సెషన్‌ సమయంలో 7.50శాతం నష్టంతో 112.15ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. రిలయన్స్‌ పవర్‌ షేర్లు ఇంట్రాడే 7శాతం క్షీణించింది. ప్రస్తుతం 5శాతం నష్టంతో రూ.6.65ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. వాటితో పాటు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ షేరు సైతం 2.50శాతం నష్టపోయింది. 
మధ్యాహ్నం గం.2:30ని.లకు సెన్సెక్స్‌ 514 పాయింట్ల నష్టంతో 39569.89 వద్ద, నిఫ్టీ 164 పాయింట్లను కోల్పోయి 11857.65 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

రేట్‌కట్‌ రుచించలేదా?

Thursday 6th June 2019

భారీగా పతనమైన సూచీలు తాజా సమీక్షా సమావేశంలో ఆర్‌బీఐ రెపోరేట్‌ను పావుశాతం తగ్గించడం, ధక్పథాన్ని న్యూట్రల్‌ నుంచి సర్దుబాటు(అకామిడేటివ్‌)కు మార్చడం చేసింది. ఆర్‌బీఐ చర్యలపై మార్కెట్ల ప్రాథమిక స్పందన నెగిటివ్‌గా ఉంది. సెన్సెక్స్‌ దాదాపు 500 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 170 పాయింట్ల మేర నష్టపోయాయి. మార్కెట్లు పావుశాతం రేట్‌కట్‌ను ముందే డిస్కౌంట్‌ చేశాయని, అంతకుమించి రేట్ల తగ్గింపు ఉంటే పాజిటివ్‌గా స్పందించిఉండేవని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు చర్యలను మార్కెట్లు

ఐదున్నరేళ్ల కనిష్టానికి డీఎల్‌ఎఫ్‌

Thursday 6th June 2019

ద్రవ్యకొరతతో దివాళ తీసిన డీఎల్‌ఎఫ్ కంపెనీ షేర్లు గురువారం మరో 15శాతం నష్టపోయాయి. ఇటీవల కంపెనీ జారీ చేసిన కమర్షియల్‌ పేపర్లపై రేటింగ్‌ ఏజెన్సీలు రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేయడం ఇందుకు కారణమైంది. నేడు బీఎస్‌ఈలో కంపెనీ షేర్లు రూ.100.45ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కంపెనీ ఇటీవల విడుదల చేసిన రూ.850 కోట్ల విలువైన కమర్షియల్‌ పేపర్లపై ఇక్రా, క్రిసెల్‌ రేటింగ్‌ సంస్థలు రేటింగ్‌ ‘‘ఎ4’’ నుంచి ‘‘డిఫాల్ట్‌’’కు డౌన్‌గ్రేడ్‌ చేశాయి.

Most from this category