STOCKS

News


అడాగ్‌ షేర్లను వీడని నష్టాలు

Monday 10th June 2019
Markets_main1560158769.png-26205

అనిల్‌ అంబానికి చెందిన అడాగ్‌ గ్రూప్‌ షేర్లు సోమవారం అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఈ గ్రూప్‌నకు చెందిన షేర్లు దాదాపు 20 శాతం నష్టపోయాయి. గతవారం చివర్లో రిలయన్స్‌ పవర్‌ నిరాశజనకమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడం ఇందుకు నేపథ్యం.  మార్చి త్రైమాసికంలో రూ.3,558.51 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.189 కోట్ల లాభం రావడం గమనార్హం. 2018-19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.2,952 కోట్ల నష్టాన్ని ప్రకటించింది.  
రిలయన్స్‌ పవర్‌:- నేడు బీఎస్‌ఈలో రూ.5.56ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 23శాతం నష్టపోయి రూ.4.71ల వద్ద కొత్త ఏడాది కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.2:00లకు షేరు గతముగింపు(రూ.6.17)తో పోలిస్తే 8శాతం నష్టంతో రూ.5.71 వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.4.71, రూ.39.25లుగా నమోదయ్యాయి.
రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌:- గత ట్రేడింగ్‌లో 15 ఏళ్ల కొత్త కనిష్టానికి పతనమైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు నేడు తాజా మరో 17శాతం నష్టపోయాయి. రెండోసారి త్రైమాసిక ఫలితాలను వాయిదా వేయడంతో ఇన్వెస్టర్లు ఈ కంపెనీ షేర్ల అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా ఇంట్రాడేలో 17 నష్టపోయి రూ. 61.30ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.2:00లకు షేరు గతముగింపు(రూ.74)తో పోలిస్తే 11 శాతం నష్టంతో రూ.63.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 61.30, రూ.73.50 లుగా నమోదయ్యాయి.

వాటితో పాటు ఇదే గ్రూప్‌నుకు చెందిన రిలయన్స్‌ నావెల్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ 13శాతం, రిలయన్స్‌ హోమ్స్‌ ఫైనాన్స్‌ 10శాతం, రిలయన్స్‌ క్యాపిటల్‌ 9శాతం,  రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ 4శాతం వరకు నష్టపోయాయి. 



You may be interested

తీవ్ర హెచ్చుతగ్గులతో బ్యాంక్‌ నిఫ్టీ

Monday 10th June 2019

మార్కెట్‌ ఒడిదుడుకుల ట్రేడింగ్‌తో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 500 పాయింట్ల రేంజ్‌లో ట్రేడైంది. నేడు మార్కెట్‌ లాభాల ప్రారంభంలో భాగంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 31,259.20 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్‌ ప్రారంభంలో బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీతో ఇండెక్స్‌ ఒకదశలో 300 పాయింట్ల లాభపడి 31,367.40 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. అనంతరం మార్కెట్లో నెలకొన్న కరెక‌్షన్‌తో ఇండెక్స్‌ మళ్లీ పతనబాట పట్టింది. ఇంట్రాడే గరిష్టం(31,367.40) నుంచి 506

మూడు వారాలకు 10 సిఫార్సులు

Monday 10th June 2019

వచ్చే రెండు మూడు వారాల్లో బలమైన లాభాలందించే పది స్టాకులను వివిధ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి. రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ సిఫార్సులు 1. బాలకృష్ణ ఇండస్ట్రీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 865. స్టాప్‌లాస్‌ రూ. 745. కొద్ది రోజుల క్రితం రూ. 765 వద్ద డబుల్‌ బాటమ్‌ ఏర్పరుచుకొని బలంగా పైకి ఎగిసింది. ఈ అప్‌మూవ్‌లో కీలక డీఎంఏలకు పైన క్లోజయింది. ఆర్‌ఎస్‌ఐ పాజిటివ్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. 2. క్రాంప్టన్‌ గ్రీవ్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ.

Most from this category