STOCKS

News


మొండిబకాయిల విక్రయంలో ఆంధ్రాబ్యాంక్‌

Monday 26th November 2018
Markets_main1543214162.png-22384

- రూ. 1,553 కోట్ల ఎన్‌పీఏలు వేలానికి
- లిస్టులో ట్రాన్స్‌ట్రాయ్ పద్దులు కూడా

న్యూఢిల్లీ: సుమారు 50 ఖాతాల నుంచి రావాల్సిన మొండిబాకీలను రికవర్ చేసుకోవడంపై ప్రభుత్వ రంగ ఆంధ్రా బ్యాంక్ దృష్టి సారించింది. దాదాపు రూ. 1,553 కోట్ల మేర మొండిబాకీలను (ఎన్‌పీఏ) వేలం వేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ‍రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీల (ఏఆర్‌సీ) నుంచి బిడ్లను ఆహ్వానించింది. నవంబర్ 30లోగా ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) సమర్పించాల్సిందని టెండర్ డాక్యుమెంట్‌లో పేర్కొంది. డిసెంబర్‌ 3న ఈ-బిడ్డింగ్‌ జరుగుతుందని, డిసెంబర్ 10లోగా ఒప్పందాలను కుదుర్చుకోవడం, నగదు బదిలీ తదితర లావాదేవీలు పూర్తవుతాయని బ్యాంక్ పేర్కొంది. 53 ఖాతాల్లో రూ. 1,552.96 కోట్ల మొత్తానికి సంబంధించిన ఎన్‌పీఏల ప్రతిపాదిత వేలంలో పాల్గొనేందుకు ఏఆర్‌సీల నుంచి బిడ్లను ఆహ్వానిస్తున్నట్లు వివరించింది. పూర్తిగా నగదు ప్రాతిపదికన ఈ ఎన్‌పీఏల వేలం ఉంటుందని తెలిపింది. వేలానికి వస్తున్న పెద్ద మొండిపద్దుల్లో ట్రాన్స్‌ట్రాయ్‌ దిండిగల్‌-తెని-కుమ్లి టోల్‌వేస్ (మొత్తం బాకీ రూ. 147 కోట్లు), ట్రాన్స్‌ట్రాయ్ కృష్ణగిరి దిండివనం హైవేస్‌ (మొత్తం బాకీ రూ. 103 కోట్లు), కార్పొరేట్ పవర్ (పూర్తి బకాయి రూ. 306.65 కోట్లు), వీసా స్టీల్‌ (పూర్తి బకాయి రూ. 211.76 కోట్లు), తుల్సియాన్‌ ఎన్‌ఈసీ (మొత్తం బాకీ రూ. 154 కోట్లు), కార్పొరేట్ ఇస్పాత్ అలాయ్స్ (రూ. 148 కోట్లు) ఉన్నాయి.



You may be interested

పిల్లల ప్రగతికి పెట్టుబడి ఎలా

Monday 26th November 2018

పిల్లల భవిష్యత్తు లక్ష్యాలు సఫలం కావాలంటే వారు చిన్నగా ఉన్నప్పటి నుంచే తల్లిదండ్రులు తగిన శ్రద్ధ తీసుకోవడం అవసరం. ఇందుకోసం తగిన పెట్టుబడి సాధనాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. విద్య, వివాహం అన్నవి పిల్లలకు సంబంధించి అత్యంత ముఖ్యమైన, పెద్దవైన లక్ష్యాలు. విద్యా వ్యయం విపరీతంగా పెరిగిపోతున్న క్రమంలో వీటికి ఏ విధంగా సన్నద్ధులు కావాలి, ఏ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయాలన్నది తల్లిదండ్రులు తప్పకుండా తెలుసుకోవాలి. వేటిల్లో ఇన్వెస్ట్‌ చేస్తే, మీ

రూ.20లక్షలు ఎక్కడ ఇన్వెస్ట్‌ చేయాలి

Monday 26th November 2018

ప్ర: నా వయస్సు 77 సంవత్సరాలు. నేను అధిక పన్ను స్లాబ్‌లో ఉన్నాను. ఇటీవలే నేను తీసుకున్న కొన్ని పాలసీల్లో ఒకటి మెచ్యూర్‌ అయింది.రూ.20 లక్షలు వచ్చాయి. ఈ మొత్తా‍న్ని దేంట్లో ఇన్వెస్ట్‌ చేస్తే బావుంటుంది. నేను నష్ట భయాన్ని ఓ మోస్తరుగా భరించగలను. తగిన సలహా ఇవ్వండి. -షణ్ముఖ రావు, హైదరాబాద్‌ జ: మీ ఆర్థిక అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేయండి. ద్రవ్యోల్బణం కంటే కూడా అధిక

Most from this category