STOCKS

News


ఆనంద్‌ రాఠీ దసరా సిఫార్సులు

Thursday 18th October 2018
Markets_main1539860003.png-21275

సంవత్సరం కాలపరిమితిలో మంచి రాబడులు ఇచ్చే ఐదు స్టాకులను ఆనంద్‌రాఠీ సెక్యూరిటీస్‌ రికమండ్‌ చేస్తోంది.
1. ఏసియన్‌ పెయింట్స్‌: టార్గెట్‌ రూ. 1471. ఇతర పెయింట్‌ కంపెనీలతో పోలిస్తే పెద్ద నెట్‌వర్క్‌ ఉంది. దేశీయ పెయింట్‌ పరిశ్రమ రాబోయే రోజుల్లో 12 శాతం వరకు వృద్ధి నమోదు చేస్తుందని అంచనా. పెయింట్స్‌ రంగంలో డిమాండ్‌ కూడా ఊపందుకుంటోంది.
2. ఆదిత్య బిర్లా ఫాషన్‌ అండ్‌ రిటైల్‌: టార్గెట్‌ రూ. 237. కంపెనీ పోర్టుఫోలియోలో లైఫ్‌స్టైల్‌, పాంటలూన్స్‌, ఫాస్ట్‌ ఫ్యాషన్‌ లాంటి బడా దిగ్గజాలున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇన్నర్‌వేర్‌ విభాగం రెండు రెట్లు వృద్ధి నమోదు చేస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది.
3. ఆర్తి ఇండస్ట్రీస్‌: టార్గెట్‌ రూ. 1600. బెంజిన్‌ ఆధారిత ఉత్పాదకాల తయారీలో నెంబర్‌వన్‌ సంస్థ. విదేశాల్లో సైతం వ్యాపారం నిర్వహిస్తోంది. ఎప్పటికప్పుడు ప్రణాళికాయుత మూలధనవ్యయం చేస్తోంది. రాబోయే మూడేళ్లు 20 శాతం చక్రీయవార్షిక వృద్ది సాధిస్తుందని అంచనా.
4. బయోకాన్‌: టార్గెట్‌ రూ. 823. ఫుల్‌ఫిలా బయోసిమిలర్‌ అనుమతులు పొందడం కీలక పరిణామం. కంపెనీ వచ్చే రెండేళ్లు 29 శాతం వరకు వృద్ధి సాధించగలదని అంచనా. మార్జిన్లు సైతం బాగా మెరుగుపడతాయి.
5. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌: టార్గెట్‌ రూ. 530. మీడియా రంగంలో మంచి స్థానంలో ఉంది. ఎప్పటికప్పుడు మార్కెట్‌ వాటా పెంచుకుంటోంది. ఇటీవల లాంచ్‌ చేసిన జీ5 వచ్చే రెండేళ్లలో బ్రేక్‌ఈవెన్‌ సాధిస్తుందని అంచనా.



You may be interested

సీజన్‌ ఏదైనా.. సిప్‌ బెటర్‌..

Thursday 18th October 2018

మార్కెట్లో మదుపరుల ఆలోచనలు విచిత్రంగా ఉంటాయి. లాభాలు వస్తున్నప్పుడు అమ్మకానికి తొందరపడడం, నష్టాల్లో ఉన్నప్పుడు మరింత కొని యావరేజ్‌ చేయాలని ఆలోచించడం గమనించవచ్చు. అలాగే సిప్స్‌(సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌)లో పెట్టుబడులు పెట్టిన వాళ్లలో కూడా ఒక చిత్రమైన ధోరణి గమనించవచ్చు. ఒక సిప్‌ ఆరంభించిన ఇన్వెస్టర్‌ దాన్ని కొనసాగించడంపై కన్నా ఎప్పుడు ఆపేయాలా అనే ఆలోచిస్తుంటాడు. మార్కెట్‌ బుల్లిష్‌గా ఉందా? సిప్‌ ఆపాలా? మార్కెట్‌ బేరిష్‌గా ఉందా? సిప్‌ ఆపాలా?

ఆరునెలల్లో రూపీ@80

Thursday 18th October 2018

ఇండియానివేష్‌ సెక్యూరిటీస్‌ వచ్చే ఆరు నెలల కాలంలో రూపాయి 79- 80 స్థాయిలకు చేరే ఛాన్సులున్నాయని ఇండియానివేష్‌ సెక్యూరిటీస్‌ ప్రతినిధి ధర్మేశ్‌ కాంత్‌ అభిప్రాయపడ్డారు. అయితే రూపీ ఈ స్థాయికి చేరినా ఆరునెలల అనంతరం క్రమంగా కన్సాలిడేట్‌ చెంది చివరకు 72- 74 రేంజ్‌లో సెటిల్‌ కావచ్చని అంచనా వేశారు. దేశీయ మార్కెట్లలో ఎఫ్‌ఎంసీజీ, ప్రైవేట్‌ బ్యాంక్స్‌, ఫార్మా రంగాలపై పాజిటివ్‌గా ఉన్నట్లు చెప్పారు. ఇటీవల కాలంలో ఎఫ్‌ఐఐలు ఇండియా నుంచి

Most from this category