STOCKS

News


ఆనంద్‌ రాఠీ మూడు రికమండేషన్లు

Thursday 20th September 2018
Markets_main1537431236.png-20411

ఆర్‌బీఐ పాలసీ మీటింగ్‌ వరకు మార్కెట్లు ఒడిదుడుకుల పయనం చేస్తాయని ఆనంద్‌ రాఠీ సంస్థ అభిప్రాయపడింది. స్వల్పకాలానికి మూడు స్టాకులను రికమండ్‌ చేసింది.
1. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2248. భారత్‌ ఫైనాన్స్‌ డీల్‌ కంపెనీకి మేలు చేకూర్చనుంది. కార్పొరేట్‌, రిటైల్‌లోన్‌ బుక్‌ను 50:50కి తెచ్చేందుకు యత్నిస్తోంది. క్యు1లో క్రెడిట్‌ వృద్ధి 30 శాతంగా నమోదయింది. స్లిపేజ్‌లు తగ్గడంతో ఆస్తుల నాణ్యత క్రమంగా మెరుగుపడుతోంది. భవిష్యత్‌లో ఈ మెరుగుదల మరింత జోరందుకుంటుందని అంచనా. కాసా బలంగా ఉండడంతో ఎన్‌ఐఎం స్థిరంగా కొనసాగనుంది. రిటైల్‌ పోర్టుఫోలియో పెరగడం బ్యాంకుకు కలిసివచ్చే అంశం. 
2. ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీ సర్వీసెస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1940. ఐఓటీ, ఏఐ, 5జీ లాంటి నూతన టెక్నాలజీలతో డిజిటిల్‌ ప్రక్రియ మరింత వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచ పరిశ్రమల్లో ప్రతిదానిలో డిజిటలైజేషన్‌ చొచ్చుకుపోతోంది. దీంతో కంపెనీకి పలు కొత్త అవకాశాలు వస్తున్నాయి. ఐటీ రంగంలో కంపెనీ అనేక విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహించడం బహుళ ప్రయోజనకరంగా మారింది. క్యు1లో కంపెనీ మంచి ఫలితాలు ప్రకటించింది. వచ్చే రెండేళ్లు కంపెనీ రెవెన్యూలో 23 శాతం వార్షిక చక్రీయ వృద్ధి ఉంటుందని అంచనా. 
3. జుబిలాంట్‌ లైఫ్‌ సైన్సెస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1040. ఏడాదిలో కంపెనీ కార్యనిర్వాహక ఆదాయంలో 34 శాతం వృద్ధి నమోదయింది. యూఎస్‌లో స్పెషాలిటీ ఉత్పత్తుల మార్కెట్‌లో మంచి ప్రదర్శన చూపడం కలిసివచ్చింది. ఏడాదికేడాది స్పెషాలిటీ ఫార్మా వ్యాపారం బలంగా పెరుగుతోంది. ఈ ఏడాది ఆర్‌అండ్‌డీపై రూ. 300 కోట్లు వెచ్చించాలని కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. త్వరలో సింగపూర్‌ అనుబంధ కంపెనీని ఐపీఓకి తెస్తోంది. దీంతో కంపెనీకి రుణభారం నుంచి వెసులుబాటు కలగనుంది. కొత్త ఆర్థిక సంవత్సరం రూ. 500 కోట్ల మూలధన వ్యయాన్ని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 

 



You may be interested

2013 సంక్షోభంతో పోలిస్తే చాలా బెటర్‌!

Thursday 20th September 2018

భారత ఎకానమీపై జేపీ మోర్గాన్‌ ఐదేళ్ల క్రితం 2013లో తలెత్తిన కరెన్సీ సంక్షోభం, వాణిజ్య మందగమన పరిస్థితులతో పోలిస్తే భారత ఎకానమీ ప్రస్తుతం చాలా బాగుందని, గడ్డుపరిస్థితులను తట్టుకునే స్థితిలో ఉందని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ జేపీ మోర్గాన్‌ అభిప్రాయపడింది.  వివిధ అంశాలపై సంస్థ అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.. - ట్రేడ్‌వార్‌: వాణిజ్యయుద్ధ భయాలున్నా సేవలు, ఉత్పత్తుల రంగంలో అంతర్గతంగా వృద్ధి ఊపందుకుంటోంది. సాగు రంగంలో అనూహ్య ఉత్పత్తితో రూరల్‌ ఆదాయాలు గణనీయంగా పెరగడం

పీఎన్‌బీ, ఓబీసీ, ఆంధ్రాబ్యాంక్‌ల విలీనం?

Thursday 20th September 2018

మూడు జాతీయ బ్యాంకుల్ని విలీనపరుస్తూ రెండురోజుల క్రితమే ప్రతిపాదనను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మరో మెగా విలీనానికి సిద్ధమవుతున్నది.  ఈ దఫా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ), ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఓబీసీ), ఆంధ్రాబ్యాంక్‌ల్ని విలీనం చేసే ప్రకటన ఈ సంవత్సారంతంలో వెలువడచ్చంటూ ఆంగ్ల దినపత్రిక డీఎన్‌ఏ మనీ ఒక కథనాన్ని వెలువరించింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ), విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌ల్ని విలీనపరుస్తున్నట్లు ఈ నెల 17న

Most from this category