News


స్థూల ఆర్థికాంశాలు మారాయ్‌... ఎర్నింగ్స్‌ సమీక్షించాలి..

Friday 5th October 2018
Markets_main1538719626.png-20887

ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు గురువారం రోజు 2 శాతానికిపైగా పతనమయ్యాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ దీపక్‌ జసని తెలిపారు. నిఫ్టీ తన 200 రోజుల మూవింగ్‌ యావరేజ్‌ 10,777 పాయింట్ల దిగువకు వచ్చేసిందని పేర్కొన్నారు. సగటు కన్నా ఎక్కువ వ్యాల్యూమ్స్‌తో మార్కెట్లు పడిపోయాయని తెలిపారు. ఇది ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు విక్రయాలను తెలియజేస్తోందని, వీళ్లు ఐటీ సర్వీసెస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, పలు ప్రైవేట్‌ బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు సహా బలంగా ఉన్న స్టాక్స్‌ను అమ్మేస్తున్నారని వివరించారు. టెక్నికల్‌గా చూస్తే కీలక స్థాయిలు పోయాయని, పలు స్టాక్స్‌లో షా‍ర్ట్‌ పొజిషన్లు బిల్డప్‌ అయ్యాయని తెలిపారు. 
మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్న అతికీలకమైన అంశం రూపాయి పతనమని దీపక్‌ జసని పేర్కొన్నారు.  వర్ధమాన మార్కెట్ల కరెన్సీల్లో అత్యంత చెత్త ప్రదర్శన కనబరుస్తున్న కరెన్సీ మనదేనని తెలిపారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి గురువారం ఒకానొక సమయంలో 73.90 ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయికి పడిపోయిందని పేర్కొన్నారు. అయితే తర్వాత కొంత కోలుకుందన్నారు. రూపాయి పతనాన్ని నిలువరించేందుకు ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటాయని ఇన్వెస్టర్లు భావిస్తున్నారని పేర్కొన్నారు.  
అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌ ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఆసియా ప్రధాన మార్కెట్లన్నీ నష్టపోయాయని దీపక్‌ జసని తెలిపారు. ఈల్డ్స్‌ పెరుగుదల వల్ల ఇతర అసెట్‌ సాధనాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. అమెరికాలో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 3.17 శాతానికి తాకాయని తెలిపారు. క్రూడ్‌ ధరలు నాలుగేళ్ల గరిష్ట స్థాయికి చేరాయని గుర్తు చేశారు. దీని వల్ల భారత్‌పై నెగటివ్‌ ప్రభావం ఉంటుందని, స్థూల ఆర్థికాంశాలు ప్రభావితమౌతాయని తెలిపారు. పరోక్షంగా వృద్ధి రేటు కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు మళ్లీ ఆజ్యం పోసుకుంటున్నాయని తెలిపారు. దీనివల్ల గ్లోబల్‌ ట్రేడ్‌పై ప్రభావం పడుతుందని, తద్వారా భారత్‌ ఆర్థిక వ్యవస్థ కూడా సమస్యలను ఎదుర్కొవలసి వస్తుందని పేర్కొన్నారు.
ద్రవ్యలోటు కట్టడి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకుంటోందని దీపక్‌ జసని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యలు బాండ్‌, ఈక్విటీ మార్కెట్లలో పరిస్థితులను చక్కదిద్దేందుకు సహాయపడతాయని పేర్కొన్నారు. నెల కిందటితో పోలిస్తే ప్రస్తుతం ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు చౌగానే ఉన్నాయని తెలిపారు. అంతర్జాతీయంగా, దేశీయంగా ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో అనలిస్ట్‌లు ఎర్నింగ్స్‌ అంచనాలను సమీక్షించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. You may be interested

పెట్రోమార్కెటింగ్‌ కంపెనీల డౌన్‌గ్రేడ్‌

Friday 5th October 2018

బ్రోకరేజ్‌ సంస్థలు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల స్టాక్స్‌ను డౌన్‌గ్రేడ్‌ చేశాయి. కేంద్ర ప్రభుత్వం గరువారం సాయంత్రం లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2.50 తగ్గింపు ప్రకటించింది. రూ.2.50లో ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపు రూ.1.50 అయితే, మరో రూ.1 ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు తగ్గిస్తాయని పేర్కొంది. వ్యాట్‌ తగ్గింపును కలుపుకొని గుజరాత్‌, మహరాష్ట్ర రాష్ట్రాలు డీజిల్‌, పెట్రోల్‌ ధరలను లీటరుకు రూ.5 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.  కేంద్ర ప్రభుత్వపు ప్రకటనతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు

రికవరీకి సగటున 66 రోజులు?!

Friday 5th October 2018

ఆగస్టు గరిష్ఠాల నుంచి దేశీయ సూచీలు దాదాపు 11 శాతం పతనమయ్యాయి. సెన్సెక్స్‌ దాదాపు 4వేల పాయింట్లు క్షీణించింది. అక్టోబర్‌ వచ్చినా కరెక‌్షన్‌ ఆగకపోవడంతో చిన్న ఇన్వెస్టర్ల నుంచి బడా మదుపరుల వరకు ఆందోళనగా ఉన్నారు. ఇలాగే పరిస్థితి కొనసాగితే ఏం చేయాలని పెద్ద పెద్ద ఫండ్‌ హౌస్‌లు సైతం తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి. అయితే గత చరిత్ర పరిశీలిస్తే ఇలాంటి పతనాలు వచ్చినప్పుడల్లా కొత్త పెట్టుబడులు వచ్చి మార్కెట్లు

Most from this category