STOCKS

News


ఈ ఐదు షేర్లంటే అనలిస్టులకు మహా ఇష్టం

Wednesday 31st October 2018
Markets_main1540983105.png-21619

పలు బ్రోకింగ్‌ సంస్థలు, మార్కెట్‌ విశ్లేషకులు సూచించిన 185 షేర్లలో ఒక ఐదు షేర్లు మాత్రం కామన్‌గా నిలుస్తున్నాయి. ప్రముఖ 10 మంది విశ్లేషకులు, సంస్థలు సూచించిన జాబితాలో ఈ 5 షేర్లకు స్థానం కొనసాగుతూనే ఉంటుంది. కేవలం సిఫార్సు మాత్రమే కాకుండా, కనీసం 39 శాతానికి తగ్గకుండా ఈ షేర్ల ద్వారా రాబడిని పొందవచ్చని వీరు అందరు కామన్‌గా సూచించడం మరోవిశేషం. ఇంతకీ అవేంటంటే.. 

కంపెనీ పేరు మొత్తం రెకమండేషన్లు బై రేటింగ్స్‌ రాబడి అంచనా (%)
మహీంద్రా & మహీంద్ర 44 44 39
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్‌ 25 25 40
అశోక బిల్డ్‌కాన్ 22 22 80
ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 21 21 32
అహ్లువాలియా కాంట్రాక్ట్స్ 17 17 66

 

ఈ షేర్లను ఏ బ్రోకింగ్‌ సంస్థలు, ఎందుకు రెకమండ్‌ చేస్తున్నారంటే..

మహీంద్రా & మహీంద్ర: గ్రామీణ అభివృద్ధి నేపథ్యంలో ట్రాక్టర్లు, చిన్న వాణిజ్య వాహనాలకు డిమాండ్‌ పెరుగుతోంది. వచ్చేది పండుగల సీజన్‌ కావడం.. నష్టాల్లో ఉన్నటువంటి ట్రక్‌, ద్విచక్ర వాహన విభాగాలు కోలుకుంటుండడం వంటి అంశాల ఆధారంగా ఈ షేరును సిఫార్సు చేస్తున్నట్లు జేపీ మోర్గాన్‌, ఎస్‌బీఐ క్యాపిటల్‌ వివరించాయి.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్: బలమైన పంపిణీ వ్యవస్థ, బలమైన గ్రోత్‌ అవుట్‌లుక్‌, నిలకడైన నిష్పత్తి కలిగిన ఈ కంపెనీ షేరును కొనుగోలు చేయవచ్చని 25 మంది అనలిస్టులు సూచించారు.

అశోక బిల్డ్‌కాన్: ‘బలమైన బ్యాలెన్స్‌ షీటును కలిగిఉన్న కంపెనీ. ఆర్డర్‌ బుక్‌ ఆకర్షణీయంగా ఉంది.’ అని మాక్వైరీ విశ్లేషించింది.

ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్: పరిశ్రమ నిర్వహణ వ్యయం కంటే ఈ సంస్థ వ్యయం చాలా తక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 22,000 ఎస్‌బీఐ శాఖలు ఈ సంస్థ వ్యాపారాన్ని సులభతరం చేస్తున్నాయని అనలిస్టులు సూచిస్తున్నారు. 

అహ్లువాలియా కాంట్రాక్ట్స్: ఆర్డర్‌ బుక్‌ సైజ్‌ పెరుగుతోంది. డెట్‌ ఉన్నప్పటికీ.. అది పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోవడం వంటి అంశాల ఆధారంగా ఈ షేరును సిఫార్సు చేస్తున్నట్లు బ్రోకింగ్‌ సంస్థలు సూచించాయి.
 You may be interested

ఈ నాలుగు రంగాలను పరిశీలించొచ్చు: క్యాపిటల్‌ మైండ్‌

Thursday 1st November 2018

ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో మధ్య కాలానికి ఫార్మా, ఐటీ, తయారీ, ఎన్‌బీఎఫ్‌సీ రంగాల పట్ల బుల్లిష్‌గా ఉన్నట్టు క్యాపిటల్‌ మైండ్‌ వ్యవస్థాపకుడు దీపక్‌ షెనాయ్‌ తెలిపారు. స్వల్ప కాలంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయని, ఈ రంగాలకు చెందిన స్టాక్స్‌ను మంచి ధరలకు సొంతం చేసుకోవచ్చన్నారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు ఆయన తన అభిప్రాయాలను తెలియజేశారు. ‘‘నవంబర్‌లో ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు కమర్షియల్‌ పేపర్లను రోలోవర్‌ చేసుకోవాల్సి ఉంది. రాష్ట్రాల్లో

సెన్సెక్స్‌ 550 పాయింట్లు జంప్‌

Wednesday 31st October 2018

మిడ్‌సెషన్‌ నుంచి జోరందుకున్న కొనుగోళ్లతో మార్కెట్‌ బుధవారం భారీ లాభంతో ముగిసింది. ఐటీ, ఆర్థిక, బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీ అండతో సూచీలు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 551 పాయింట్ల పెరిగి 34,442 వద్ద, నిఫ్టీ 188 లాభంతో 10,386 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌లోని మరో కీలకమైన సూచీ నిఫ్టీ బ్యాంక్‌ 345.50 పాయింట్లు పెరిగి 25వేల పైన 25,153 వద్ద ముగిసింది. ఆర్‌బీఐ సంక్షోభ సెగలతో మార్కెట్‌లో మిడ్‌సెషన్‌

Most from this category