STOCKS

News


అంచనాల్ని మించిన మార్కెట్‌ ర్యాలీ

Wednesday 8th August 2018
Markets_main1533713615.png-19049

దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరు మీదున్నాయి. జీవిత కాల గరిష్ట స్థాయిల్లో కదలాడుతున్నాయి. అయితే ఇక్కడ మార్కెట్‌పై నిపుణుల అంచనాలు తప్పాయి. ట్రెండ్‌ను కచ్చితంగా అంచనా వేయలేకపోయారు. మార్కెట్‌ పెరుగుదల వీరి అంచనాల కన్నా అధిక స్థాయిలో ఉంది. బ్లూమ్‌బర్గ్‌ మార్కెట్‌ విశ్లేషకుల ప్యానల్లో అతి కొద్ది మంది మాత్రమే స్టాక్‌ ధరలు ఈ స్థాయిలో పెరగొచ్చని అంచనా వేశారు. ఎక్కువ మంది మార్కెట్‌ ట్రెండ్‌ను పట్టుకోలేకపోయారు. కేవలం కొన్ని స్టాక్స్‌ కారణంగానే మార్కెట్‌ పరుగులు పెడుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. మరీముఖ్యంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లే కారణమంటున్నారు. వడ్డీ రేట్ల పెంపు, ఆర్‌బీఐ కఠిన ద్రవ్య విధానాలు అవలంభిస్తుందనే అంచనాలు ఇతర షేర్లపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. 
‘రికార్డ్‌ గరిష్ట స్థాయిలు కేవలం కొన్ని స్టాక్స్‌ వల్లే జరిగింది. అందువల్ల అనలిస్ట్‌లు అన్ని స్టాక్స్‌కు అధిక వ్యాల్యుయేషన్లు ఇవ్వడానికి, టార్గెట్‌ ప్రైస్‌ పెంచడానికి ఆసక్తి చూపడం లేదు’ అని కేఆర్‌ చోక్సీ సెక్యూరిటీస్‌ ఎండీ దేవెన్‌ చోక్సీ తెలిపారు. అలాగే నిపుణులు క్యూ1 క్వార్టర్‌ ఫలితాల ముగింపు కోసం వేచిస్తున్నారని పేర్కొన్నారు.  
ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్‌ విలువ ప్రస్తుతం సుమారు 225 బిలియన్‌ డాలర్లుగా ఉంది. జనవరిలోని గరిష్ట స్థాయిల్లో నమోదైన మార్కెట్‌ విలువ కన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. బీఎస్‌ఈ 500 ఇండెక్స్‌లో మూడో వంతు కంపెనీల షేర్లు మాత్రమే వాటి 200 రోజుల మూవింగ్‌ యావరేజ్‌కు పైనా ట్రేడ్‌ అవుతున్నాయి. జనవరి గరిష్ట స్థాయిల్లో దీని కన్నా ఎక్కువ భాగం షేర్లు 200 రోజుల మూవింగ్‌ యావరేజ్‌కు పైగా ట్రేడ్‌ అయ్యాయి.   
ఒకవైపు నొమురా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50 ఇండెక్స్‌ టార్గట్‌ను పెంచినప్పటికీ.. వడ్డీ రేట్ల పంపు, దేశీ పెట్టుబడులు సాధారణ స్థాయిలో ఉండటం, కఠిన ద్రవ్య విధానాలు మార్కెట్‌ వ్యాల్యుయేషన్స్‌ను ప్రభావితం చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.  
కాగా స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాల్లోనే ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునుపటి ముగింపు 37,666 పాయింట్లతో పోలిస్తే 90 పాయింట్ల లాభంతో  37,756 పాయింట్ల వద్ద, నిఫ్టీ తన మునపటి ముగింపు 11,389 పాయింట్లతో పోలిస్తే 23 పాయింట్ల లాభంతో 11,412 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. నిఫ్టీ జీవిత కాల గరిష్ట స్థాయిని తాకింది. You may be interested

క్రెడిట్‌యాక్సెస్‌ గ్రామీణ్‌ ఐపీవో.. సబ్‌స్క్రైబ్‌ చేయొచ్చా?

Wednesday 8th August 2018

నెదర్లాండ్స్‌కు చెందిన క్రెడిట్‌యాక్సెస్‌ ఆసియా ఎన్‌ఈ సంస్థకు చెందిన మైక్రోఫైనాన్స్‌ రంగంలోని క్రెడిట్‌యాక్సెస్‌ గ్రామీణ్‌ కంపెనీ ఆగస్ట్‌ 8న (బుధవారం) ఐపీవోకు వస్తోంది. దీని ద్వారా రూ.1,131 కోట్ల మేర నిధులు సమీకరించాలని భావిస్తోంది. ఐపీవో ప్రైస్‌బాండ్‌ రూ.418-422గా ఉంది. ఐపీవో ఆగస్ట్‌ 10న ముగుస్తుంది.  ఐపీవోలో భాగంగా కంపెనీ రూ.630 కోట్ల విలువైన తాజా షేర్లతోపాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో కింద రూ.510 కోట్ల విలువైన మరిన్ని షేర్లను విక్రయించనుంది.

మల్టీప్లెక్స్‌ షేర్ల ర్యాలీ

Wednesday 8th August 2018

ముంబై:- మల్టీప్లెక్స్ థియేటర్‌లోకి బయటి ఆహారాన్ని తీసుకువచ్చేందుకు వీలు కల్పించే అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వం తగ్గే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో బుధవారం మల్టీప్లెక్స్‌ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. సినిమా ప్రేక్షకులు బయటి నుంచి ఆహార పదార్ధాలు తీసుకువచ్చేందుకు వీలు కల్పిస్తూ ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన  సంగతి తెలిసిందే. ఈ అంశంపై నేడు ముంబై హైకోర్టులో విచారణ జరగుతోంది. మహారాష్ట్ర తన అడఫిట్‌లో ‘‘బయటి ఆహార

Most from this category