STOCKS

News


ప్రతి 3లో 2 షేర్లకు టార్గెట్‌ డౌన్‌గ్రేడ్‌

Wednesday 5th December 2018
Markets_main1544002162.png-22668

ముంబై: నవంబర్‌లో నిఫ్టీ 50 ఇండెక్స్‌ 4.7 శాతం లాభపడింది. దేశీ మార్కెట్లు గతనెలలో ఏకంగా 891 మిలియన్‌ డాలర్ల విదేశీ నిధులను ఆకర్షించాయి. ఇదే నెలలో ముడిచమురు ధర 20 శాతం పతనమవగా డాలరుతో రూపాయి మారకం విలువ 4.4 శాతం బలపడింది. ఇంతటి సానుకూల అంశాలలో సైతం అనలిస్టులు తామ కవరేజ్‌లో ఉన్నటువంటి 67.6 శాతం షేర్లను డౌన్‌గ్రేడ్‌ చేశారు. ప్రతి 3 షేర్లలో 2 షేర్ల టార్గెట్‌ ధరలను డౌన్‌గ్రేడ్‌ చేసినట్లు తేలింది. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా షేర్లను వర్గీకరించి ఈ మేరకు నిర్ణయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. రూ.25వేల కోట్లలోపు మార్కెట్‌ క్యాప్‌ కలిగిన 305 షేర్లలో 70 శాతం షేర్లకు టార్గెట్‌ ధరలు తగ్గాయి. రూ.25వేల కోట్ల నుంచి రూ.50వేల కోట్లలోపు మార్కెట్‌ క్యాపిటల్‌ కలిగిన షేర్లలో 48 షేర్లు వీరి పర్యవేక్షణలో ఉండగా.. ఈ జాబితాలో 60.4 శాతం షేర్ల టార్గెట్‌ ధరల్లో సవరణ జరిగింది. రూ.50వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లలోపు మార్కెట్‌ క్యాపిటల్‌ గల షేర్లలో 28 షేర్లు ఉండగా.. వీటిలో 71 శాతం షేర్లకు టార్గెట్‌ ధరలు తగ్గాయి. రూ.లక్ష కోట్లను మించి మార్కెట్‌ క్యాపిటల్‌ కలిగిన షేర్లలో 46.2 శాతం షేర్లకు తగ్గింపు సవరణ జరిగింది. ఈ జాబితాల్లోని 5 ప్రధాన షేర్ల విషయానికి వస్తే.. నవకర్‌ కార్ప్‌ టార్గెట్‌ ధర రూ.92కు తగ్గింది. నవంబర్‌లో 40.90 శాతం డౌన్‌గ్రేడ్‌ జరిగింది. జైన్‌ ఇరిగేషన్‌ టార్గెట్‌ ధర రూ.90కు తగ్గింది. 37 శాతం డౌన్‌గ్రేడ్‌ జరిగింది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ టార్గెట్‌ ధర రూ.355కు తగ్గింది. నవంబర్‌లో 36.90 శాతం డౌన్‌గ్రేడ్‌ అయ్యింది. శంకర బిల్డింగ్‌ షేరు టార్గెట్‌ ధర రూ.1,226కు తగ్గింది. 30 శాతం డౌన్‌గ్రేడ్‌ జరిగింది. ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌ టార్గెట్‌ ధర రూ.1,648కు తగ్గింది. నవంబర్‌లో 30 శాతం డౌన్‌గ్రేడ్‌ జరిగింది. 

ఇక అప్‌గ్రేడ్‌ జరిగిన షేర్ల జాబితాను పరిశీలిస్తే.. యునైటెడ్‌ స్పిరిట్స్‌ షేరుకు టార్గెట్‌ ధర 11.7 శాతం పెరిగి రూ.640 చేరుకుంది. హాత్‌వే కేబుల్స్‌ టార్గెట్‌ ధర రూ.35కు పెరిగింది. 11.3 శాతం అప్‌గ్రేడ్‌ జరిగింది. జేఎం ఫైనాన్షియల్స్‌ షేరుకు టార్గెట్‌ ధర 10 శాతం పెరిగి రూ.165 చేరుకుంది. ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌కు టార్గెట్‌ ధర 8.2 శాతం పెరిగి రూ.226 చేరుకుంది. గ్రిండ్‌వెల్‌ నొర్టన్‌ టార్గెట్‌ ధర రూ.623కు పెరిగింది. 8 శాతం అప్‌గ్రేడ్‌ జరిగింది. 
 



You may be interested

మరో నష్టాల ముగింపు.!

Wednesday 5th December 2018

ప్రపంచ మార్కెట్ల క్షీణత, ఆర్‌బీఐ పాలసీ నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్‌ బుధవారం భారీ నష్టంతో ముగిసింది. సెన్సెక్స్‌ 250 పాయింట్లు నష్టపోయి 35,884 వద్ద ముగిసింది. నిఫ్టీ 84 పాయింట్లు కోల్పోయి 10,785 వద్ద ముగిశాయి. నష్టాల ముగింపు వరుసగా ఇది రెండో రోజు.  ప్రపంచమార్కెట్లలో నెలకొన్న ప్రతికూలతలు, రూపాయి నష్టాల ట్రేడింగ్‌తో గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైన మార్కెట్‌ వడ్డీరేట్లపై రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించడంతో మిడ్‌సెషన్‌ సమయాని కల్లా సెన్సెక్స్‌ 36వేల

స్థిరంగానే పాలసీ రేట్లు..

Wednesday 5th December 2018

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అంచనాలకు అనుగుణమైన నిర్ణయాన్నే ప్రకటించింది. గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) తాజా సమీక్షలో వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రెపో రేటు 6.50 శాతంగా నిలకడగానే ఉంది. రెపో పెంపుతో అనుసంధానమైన ఇతర పాలసీ రేట్లు కూడా అలాగే ఉన్నాయి. రివర్స్‌ రెపో రేటు 6.25 శాతంగా ఉంది. ఇక నగదు

Most from this category