STOCKS

News


టార్గెట్‌ ధరల్లో కోతలు ఎందుకు?

Friday 5th April 2019
Markets_main1554443502.png-24985

ఒకపక్క సూచీలు ఆల్‌టైమ్‌ హైలను చేరి చెలరేగిపోతున్నాయి. కానీ మరోపక్క అనలిస్టులు పలు స్టాకుల టార్గెట్‌ ధరలను తగ్గించుకుంటూ వస్తున్నారు. గత ఆరు నెలల్లో నిఫ్టీ 50లో కంపెనీల టార్గెట్‌ ధరలను అనలిస్టులు సరాసరిన 6.5 శాతం మేర కట్‌ చేశారు. జపాన్‌ తర్వాత ఆసియా దేశాల్లో ఈ రేంజ్‌లో టార్గెట్‌ ధరల్లో కోత పడడం భారత్‌లోనే కనిపిస్తోంది. నిజానికి మార్కెట్‌ ర్యాలీల్లో అనలిస్టులు సరాసరిన షేర్ల టార్గెట్స్‌ పెంచుకుంటూ పోతారు. కానీ ప్రస్తుతం తద్భిన్నంగా టార్గెట్స్‌ను తగ్గిస్తున్నారు. మొత్తం నిఫ్టీ50లోని 50 కంపెనీల్లో 34 కంపెనీల షేర్ల టార్గెట్‌ ధరలు గత ఆరునెలల్లో కోతకు గురయ్యాయి. వీటిలో 21 కంపెనీల షేర్ల టార్గెట్‌ ధరలు పది శాతానికి మించి కటింగ్‌ను చేశాయి. కేవలం 6 కంపెనీలు మాత్రమే నిఫ్టీ50లో పదిశాతానికి మించి టార్గెట్‌ ధర పెరుగుదలను చూశాయి. ముఖ్యంగా ఆటో, మెటల్స్‌, ఓఎంసీల టార్గెట్‌ధరలు 15-40 శాతం మేర కోతపడ్డాయి. టాటామోటర్స్‌, ఐబీ హౌసింగ్‌, వేదాంత, యస్‌ బ్యాంకు, మారుతీ సుజుకీలు అత్యధిక టార్గెట్‌ కట్స్‌ చవిచూశాయి. 
ఎర్నింగ్సే కారణమా
నాలుగేళ్లుగా ప్రతిఏడాది ఎర్నింగ్స్‌లో మెరుగుదల ఉంటుందని ఎదురు చూడడము, తర్వాత ఉసూరనడమూ కనిపిస్తుంది. ఈ దఫా కూడా ఇదే ధోరణి ఉండొచ్చన్న భయాలున్నాయి. దీనికితోడు ఎర్నింగ్స్‌ డౌన్‌గ్రేడ్స్‌ 6-20 శాతం వరకు జరగడంతో అనలిస్టులు షేర్ల టార్గెట్స్‌ను తగ్గిస్తున్నారు. ఉదాహరణకు గత ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో ఆటో రంగంలో విక్రయాలు బాగా తగ్గడంతో ఆ కంపెనీల ఎర్నింగ్స్‌గ్రోత్‌ అంచనాలు డౌన్‌ట్రెండ్‌లోకి మారాయి. ఆటో రంగంలో అగ్రగామి మారుతీ సుజుకీ గతేడాది మార్చి- ఏప్రిల్‌ సమయంలో రెండంకెల వాల్యూం నమోదు చేసింది. డిసెంబర్‌ సమయానికి వాల్యూంలు 6 శాతానికి పడిపోయాయి. ఇదే విధంగా పలు కంపెనీల ఎర్నింగ్స్‌ మందగించడమే టార్గెట్‌ ధరల పతనానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 



You may be interested

జూన్‌లో మరో రేట్‌కట్‌?!

Friday 5th April 2019

దిగ్గజాల అంచనా వచ్చే సమీక్షా సమావేశంలో మరోమారు ఆర్‌బీఐ ఇంకో పావుశాతం రేట్లను తగ్గించే ఛాన్సులున్నాయని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులు అంచనా వేస్తున్నాయి. ఆర్‌బీఐ ధోరణి మరో రేట్‌కట్‌కు అనుకూలంగా ఉందని, ఇందుకు ద్రవ్యోల్బణం దిగిరావడం వీలు కల్పిస్తోందని సీఎల్‌ఎస్‌ఏ ఒక నివేదికలో అభిప్రాయపడింది. వచ్చే నెలల్లో 25- 50 శాతం వరకు ఆర్‌బీఐ రేట్లను తగ్గించవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ ఫైనాన్షియల్స్‌ ఎక్కువ ప్రయోజనం పొందవచ్చని పేర్కొంది. ఐసీఐసీఐ,

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Friday 5th April 2019

రిజర్వుబ్యాంక్‌ పాలసీ ప్రకటన తర్వాత క్రితం రోజు అమ్మకాల ఒత్తిడికి లోనైన భారత్‌ సూచీలు శుక్రవారం గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 155 పాయింట్ల లాభంతో 38,839 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 40 పాయింట్లు జంప్‌చేసి 11,638 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, టైటాన్‌లు 1-2 శాతం మధ్య లాభపడ్డాయి. ఆసియన్‌ పెయింట్స్‌, భారతి ఎయిర్‌టెల్‌, మారుతి, డాక్టస్‌

Most from this category