పదేళ్లలో పది రెట్లు..యాంబిట్ క్యాపిటల్ బెట్స్
By Sakshi

వచ్చే పదేళ్లలో ఇన్వెస్టర్ల సంపదని 10 రెట్లు పెంచగలిగే 30 షేర్లను పరిశోధించి...బ్రోకింగ్ సంస్థ యాంబిట్ క్యాపిటల్ మంగళవారం జాబితాను విడుదల చేసింది. నీల్కమల్, లాఒపెలా, ఎవిన్యూ సూపర్‌మార్ట్, మారుతి సుజుకి, కన్సాయి నెరోలాక్, పీవీఆర్, వెంకీస్ ఇండియా, సుదర్శన్ కెమికల్స్, టొరెంట్ పవర్, షీలాఫోమ్, గోద్రేజ్ ఆగ్రోవెట్, జేబీ కెమికల్స్, వాబ్కో ఇండియా, హెడిల్బర్గ్ సిమెంట్, డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్, అడ్వాన్స్ ఎంజైమ్స్, జాన్సన్ కంట్రోల్, సీసీఎల్ ప్రాడక్ట్స్, నాట్కో ఫార్మా, జ్యోతి ల్యాబ్స్– ఈ 21 షేర్లూ ఏమాత్రం ఖరీదైనవికాదని, వచ్చే పదేళ్లలో గొప్ప రాబడుల్ని అందించగలవని యాంబిట్ క్యాపిటల్ సిఫార్సుచేసింది. మరో 7 షేర్లు...టిమ్కెన్ ఇండియా, అతుల్, వర్ల్‌పూల్, బ్రిటానియా, సుందరం ఫాజనర్స్, 3ఎం ఇండియా, కజారియా సిరామిక్స్ ప్రస్తుతానికి అధిక విలువ కలిగినవి అయినప్పటికీ, రానున్న సంవత్సరాల్లో లాభాల్ని పంచగలిగే సత్తా వున్నవని, మొత్తంమీద ఈ 30 షేర్లు పదేళ్లలో పదిరెట్లు లాభాల్ని తేగలవని అంచనావేస్తున్నట్లు బ్రోకరేజ్ సంస్థ వివరించింది.
మూలధన పెట్టుబడులు, ఆ పెట్టుబడుల్ని అమ్మకాలుగా మార్చడం, ఆ అమ్మకాల ద్వారా లాభాల్ని ఆర్జించడం, ఆ లాభాలతో బ్యాలెన్స్‌షీట్‌ను పటిష్టపర్చడం, వీటిన్నటి బలాలతో నగదు ప్రవాహాన్ని సృష్టించి, ఆ నగదును తిరిగి పెట్టుబడి చేయడం వంటివన్నీ గొప్ప కంపెనీల లక్షణాలని, ఈ బలాలున్న కంపెనీలను తాము ఎంపికచేసినట్లు యాంబిట్ వివరించింది.
You may be interested
మెప్పించని ఫలితాలు: హెచ్డీఎఫ్సీ 2.5 శాతం డౌన్
Tuesday 29th January 2019గృహ రుణాలను అందించే హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్డీఎఫ్సీ) మంగళవారం మధ్యాహ్న వెల్లడించిన ఫలితాలు మార్కెట్‌ను ఆకట్టుకోలేకపోయాయి. ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలంలో రూ. 2114 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది గతేడాదితోనూ, కూ2తోనూ పోలిస్తే తక్కువ. ఇదే ఆర్థిక సంవత్సరం క్యూ2లో నికరలాభం రూ.2,467 కోట్లుగా నమోదైంది. 2017 డిసెంబర్ క్వార్టర్లో నికరలాభం రూ. 5300 కోట్లు. అయితే ఆ రెండు క్వార్టర్లలోనూ హెచ్డీఎఫ్సీ
ఝున్‌ఝున్‌వాలా ఫోర్ట్పోలియో మార్పులు చేర్పులివే..
Tuesday 29th January 2019గతేడాదిలో రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఫోర్ట్‌ఫోలియోలోని అత్యధిక షేర్లు నష్టపోయాయి. ఫోర్ట్‌పోలియోలో మొత్తం 29 షేర్లలో 26షేర్లు నష్టాలను మిగల్చగా, కేవలం 3 షేర్లు మాత్రం లాభాలను ఆర్జించాయి. లాభపడిన షేర్లలో వీఐసీ ఇండస్ట్రీస్, ఫస్ట్‌సోర్స్ సెల్యూషన్స్ లిమిటెడ్, టైటాన్ లిమిటెడ్‌లు ఉన్నాయి. ఇక డిసెంబర్ త్రైమాసిక కాలానికి ఏపీటెక్, ఎన్సీసీ, ఫెడరల్ బ్యాంక్, జుబిలెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీల్లో వాటాను పెంచుకున్నారు. మరోవైపు దివాన్ హౌసింగ్ ఫైనాన్స్, టీవీ18 బ్రాడ్కాస్ట్,