STOCKS

News


ప్రపంచ మార్కెట్లకు అమెజాన్, గూగుల్‌ దెబ్బ

Friday 26th October 2018
Markets_main1540548436.png-21497

అమెజాన్, అల్ఫాబెట్‌ (గూగుల్‌ మాతృసంస్థ) సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలు....మార్కెట్‌ అంచనాల్ని అందుకోలేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం టెక్నాలజీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఇప్పటికే ప్రధాన ఆసియా మార్కెట్లలో టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌ షేర్లు నష్టాల్లో ముగియగా, యూరప్‌లో గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల సమయానికి ప్రధాన యూరప్‌ సూచీలు జర్మనీ డాక్స్, ఫ్రాన్స్‌ కాక్, బ్రిటన్‌ ఎఫ్‌టీఎస్‌ఈలు 1.5–2 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. భారత్‌లోని సెన్సెక్స్, నిఫ్టీలు మధ్యాహ్న సమయానికి 1 శాతం నష్టంతో కదులుతుండగా, ప్రధాన ఆసియా సూచీలు 1–1.5 శాతం తగ్గుదలతో ముగిసాయి. అమెరికా మార్కెట్‌ నష్టాల ఆరంభాన్ని సూచిస్తూ అక్కడి సూచీలు డోజోన్స్, ఎస్‌ అండ్‌ పీ500, నాస్‌డాక్‌ ఫ్యూచర్లు 1 శాతంపైగా నష్టంతో కదులుతున్నాయి. అమెరికా మార్కెట్లో ‘ఫాంగ్‌, faang’ (ఫేస్‌బుక్, యాపిల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్‌) స్టాక్స్‌గా ప్రాచుర్యం పొందిన ఈ షేర్లే గత రెండేళ్లుగా అమెరికా సూచీల్ని ఉన్నతశిఖరాలకు చేర్చాయి. ఆ సూచీల ప్రభావంతో మన దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ టెక్నాలజీ షేర్లను, తద్వారా మార్కెట్లు పరుగులు తీసాయి. ఈ ఫాంగ్‌ స్టాక్స్‌లో ఫలితాల్ని వెల్లడించిన రెండు కంపెనీలూ నిరాశపర్చడంతో సహజంగానే శుక్రవారం ప్రపంచ మార్కెట్లు క్షీణబాట పట్టాయి. 
 



You may be interested

ఐటీసీ నికరలాభం 12 శాతం అప్‌

Friday 26th October 2018

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ నికరలాభం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి 12 శాతం పెరిగి రూ. 2,950 కోట్లకు చేరింది. ఆదాయం 7.3 శాతం వృద్ధితో రూ. 11,069 కోట్లకు పెరిగింది. కంపెనీ సిగరెట్ల ఆదాయం 10 శాతంపైగా పెరిగి రూ. 5,060 కోట్లకు చేరింది. కంపెనీ మొత్తం ఆదాయంలో ఈ వ్యాపారం ద్వారా 45 శాతం సమకూరింది. సిగరెట్ల మీద ఇబిటా 8.3 శాతం వృద్ధిచెందిందని, అయితే మార్జిన్లు అంతక్రితం

ప్రమోటర్లు వాటాలను పెంచుకున్న కంపెనీలివే..!

Friday 26th October 2018

మార్కెట్‌ ప్రస్తుతం కష్టాల కడలిలో కొట్టుమిట్టులాడుతోంది. షేర్లు ఎప్పటికప్పుడు కొత్త కనిష్టాలను తాకుతూ తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నాయి. అటు ట్రేడర్లు, ఇటు ఇన్వెస్టర్లకు స్టాక్‌ మార్కెట్‌ నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. అయితే ఈ తరుణంలో అనూహ్యంగా కొన్ని కంపెనీల ప్రమోటర్లు సంస్థలో తమ వాటాలను పెంచుకుంటున్నారు. వ్యాపార విస్తరణ, అభివృద్ధికి తీసుకోబోతున్న కంపెనీ తీసుకోబోతున్న నిర్ణయాలు ప్రమోటర్లకు తెలియడం, కంపెనీ షేరుకు ఉన్న వాల్యూను వారు గుర్తించటం,

Most from this category