STOCKS

News


చిన్న స్టాకులతోనే సంపద సృష్టి!

Wednesday 16th January 2019
Markets_main1547629665.png-23616

మోతీలాల్‌ ఓస్వాల్‌ 
ఈ ఏడాది హవా వర్ధమాన మార్కెట్లదేనని మోతీలాల్‌ ఓస్వాల్‌ ప్రతినిధి మనీశ్‌ సొంథాలియా చెప్పారు. దేశీయ మార్కెట్లో స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌తో మంచి లాభాలు వస్తాయని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయంగా ట్రేడ్‌వార్‌ మంటలు కాస్త చల్లబడడం, యూఎస్‌ ఫెడ్‌ స్వరం మృదువుగా మారడం, ఈసీబీ నుంచి కొత్త ఉపసంహరణలు లేకపోవడం వంటి పరిణామాలు, దేశీయంగా ద్రవ్యోల్బణం దిగిరావడం, ఆర్‌బీఐ రేట్‌కట్‌కు అవకాశాలు పెరగడం వంటి పరిణామాలు భారత మార్కెట్లపై పాజిటివ్‌ ప్రభావం చూపుతాయని చెప్పారు. ప్రస్తుతానికి ఇంట్రెస్ట్‌ రేట్‌ సైకిల్‌ టాప్‌ అవుట్‌ అయినట్లు భావించవచ్చన్నారు. అభివృద్ది చెందిన దేశాల నుంచి వర్ధమాన దేశాలకు ఇకపై నిధుల ప్రవాహం రావచ్చని అంచనా వేశారు. గతేడాది వర్దమాన మార్కెట్లన్నీ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయన్నారు. కానీ అదే కొనుగోళ్లకు సరైన సమయమని చెప్పారు. ఆ తరుణంలో దేశీయ మదుపరులు చిన్న, మిడ్‌క్యాప్స్‌ నుంచి నిధులను ఉపసంహరించి లార్జ్‌క్యాప్స్‌పై పెట్టారని చెప్పారు.

ఇప్పుడందరూ ఎర్నింగ్స్‌లో మెరుగుదల గురించి చెబుతున్నారని, ప్రస్తుత కంపెనీల్లో కేవలం 50 శాతం కంపెనీలనే నిఫ్టీ 50 ప్రతిబింబిస్తుందని, మిగిలినవి విశాల మార్కెట్లో భాగమని చెప్పారు. ఇలాంటి షేర్లన్నీ గతేడాది పెద్ద పతనాలను చూశాయని, ఇకమీదట వీటిలో రికవరీ ఉంటుందని వివరించారు. లార్జ్‌క్యాప్స్‌లో ఏ విభాగంలో షేరు కూడా చౌకగా లేదన్నారు. ప్రైవేట్‌బ్యాంకులు, కన్జూమర్స్‌, మెటల్‌ తదితర రంగాల షేర్లన్నీ భారీ వాల్యూషన్ల వద్ద ఉన్నాయని తెలిపారు. అందువల్ల కొంత ధైర్యం చేసుకొని చిన్న స్టాకుల్లో నాణ్యమైన వాటిని ఎంచుకొని పెట్టుబడులు పెట్టడం మంచిదని సలహా ఇచ్చారు. లార్జ్‌ క్యాప్స్‌లో ఇకమీదట పెద్దగా కదలికలుండకపోవచ్చని, అలాంటప్పుడు వీటిలో లాభాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. అందుకే వీలు చూసుకొని అత్యుత్తమ మేనేజ్‌మెంట్‌ కలిగి చౌకగా లభించే స్మాల్‌, మిడ్‌ క్యాప్స్‌పై పెట్టుబడి పెట్టడం సముచితమని తెలిపారు. You may be interested

యూబీఎస్‌ ఎలక‌్షన్‌ పిక్స్‌

Wednesday 16th January 2019

దేశీయ ఈక్విటీలు ఈ సంవత్సరం 7 శాతం వరకు పతనం చవిచూడవచ్చని ప్రముఖ బ్రోకింగ్‌ దిగ్గజం యూబీఎస్‌ అంచనా వేసింది. సాధారణ ఎన్నికల వేళ ఏర్పడే రాజకీయ అనిశ్చితి మార్కెట్‌ను కుంగదీస్తుందని తెలిపింది. నిఫ్టీ ఏడాది చివరకు పదివేల పాయింట్లను చేరవచ్చని అభిప్రాయపడింది. జీడీపీలో మాత్రం వృద్ధి ఉంటుందని 2019 అవుట్‌లుక్‌లో పేర్కొంది. ఎన్నికల వేళ పాపులర్‌ విధానాలు, వాటి ఫలితాలు, వివిధ ప్రభుత్వాలు వాటి ఆధారిత సంస్కరణలు వంటి

జెట్‌ ఎయిర్‌వేస్‌ నేలచూపులు

Wednesday 16th January 2019

8.50శాతం పతనమైన షేరు ధర కంపెనీలో వాటాను కొనుగోలుకు ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ పీజేఎస్‌సీ కఠినమైన నిబంధనలను ప్రతిపాదించడంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు బుధవారం నేలచూపులు చూస్తున్నాయి. జెట్‌ ఎయిర్‌వేస్‌లో నిర్ణయాత్మకమైన వాటాను కొనుగోలు చేయాలంటే కంపెనీ ప్రస్తుత ఛైర్మన్‌ నరేష్‌ గోయల్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు కంపెనీ నుంచి పూర్తిగా వైదొలగాలని, ఓపెన్‌ ఆఫర్‌ పద్ధతిలో ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసేందుకు ప్రస్తుత ధర మీద రూ.150ల డిస్కౌంట్‌ ఇవ్వాల్సిందిగా

Most from this category