STOCKS

News


మూడేళ్లు దాటితే ఎల్‌టీసీజీ వద్దు: బ్రోకర్ల డిమాండ్‌

Sunday 16th December 2018
Markets_main1544982287.png-22978

షేర్లను కొనుగోలు చేసి మూడేళ్ల పాటు కొనసాగించిన వారికి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ) మినహాయింపు కల్పించాలని బ్రోకరేజీ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి తాజాగా సూచించాయి. ఏడాది కాలానికి మించి షేర్లను అట్టిపెట్టుకుంటే, వచ్చే లాభాలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ) మినహాయింపును మోదీ సర్కారు ఈ ఏడాది ఎత్తేసి, లాభం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష దాటితే 10 శాతం పన్నును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. డివిడెండ్‌ పంపిణీ పన్నును ఎత్తేయడం, స్టాక్‌ ఎక్సేంజ్‌ లావాదేవీలపై స్టాంప్‌ డ్యూటీ ఎత్తేయడం, సెక్షన్‌ 54ఈసీ కింద పెట్టుబడుల పరిమితిని పెంచడం వంటి డిమాండ్లను కూడా బ్రోకరేజీ సంస్థలు ప్రభుత్వం ముందుంచాయి. అసోసియేషన్‌ ఆఫ్‌ నేషనల్‌ ఎక్సేంజ్‌ మెంబర్స్‌ ఆఫ్‌ ఇండియా, బోంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ బ్రోకర్స్‌ ఫోరం ఈ డిమాండ్లను సంయుక్తంగా ఓ లేఖ రూపంలో సెబీకి నివేదించాయి. కేంద్ర ఆర్థిక శాఖ బడ్జెట్‌ ప్రతిపాదనల్లో వీటిని చేర్పించేలా చూడాలని కోరాయి. 

 

డెలివరీ ఆధారిత డెరివేటివ్‌ కాంట్రాక్టులపై సెక్యూరిటీ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌(ఎస్‌టీటీ)ను క్రమబద్ధీకరించాలన్నది మరో డిమాండ్‌. ప్రస్తుతం వీటిపై డెలవరి ఆధారిత ఈక్విటీ షేర్ల మాదిరే ఎస్‌టీటీ అమలు చేస్తున్నారు. అదనపు పన్నును రద్దు చేయాలని బ్రోకర్లు కోరుతున్నారు. ప్రధాన డిమాండ్‌ మూడేళ్లపాటు కలిగి ఉన్న షేర్లపై ఎల్‌టీసీజీ ఎత్తేయాలన్నది. మన దేశంలో స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉందని, దీర్ఘకాలం పాటు షేర్లను కలిగి ఉంచుకోవడాన్ని ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందని బ్రోకర్ల ఫోరం అభిప్రాయపడింది. తద్వారా ఎక్కువ మంది స్టాక్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌వైపు ఆకర్షించొచ్చని సూచించింది. డివిడెండ్‌ పంపిణీపై పన్ను ప్రస్తుతం 20 శాతంగా ఉంది. దీంతో కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌పై మూడు రకాల పన్నులు పడుతున్నట్టు అవుతోందని బ్రోకరేజీ సంస్థల ఆందోళన. కార్పొరేట్‌, వ్యక్తిగత పన్నుల మధ్య తేడాను సరిచేసే విధంగా పన్ను ఉండాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. డివిడెండ్‌ పంపిణీ పన్ను ఉపసంహరించి, దీని స్థానంలో డివిడెండ్‌ అందుకున్న వారిపైనే 10 శాతం పన్ను విధించాలని సూచించింది. సెక్షన్‌ 88ఈ కింద సెక్యూరిటీ లావాదేవీల పన్ను, కమోడిటీ లావాదేవీల పన్నులకు రాయితీలు కల్పించాలని, ఎస్‌టీటీ రేటు తగ్గించడం వంటి ఇతర డిమాండ్లను కూడా లేఖలో పేర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు సెక్షన్‌ 54ఈసీ కింద అదనంగా రూ.50 లక్షల పరిమితి ఇవ్వాలని కూడా కోరాయి.You may be interested

ఫండ్‌ మేనేజర్లకు తమ పథకాలపై ఉన్న నమ్మకమెంత?

Sunday 16th December 2018

రిటైల్‌ ఇన్వెస్టర్లు పనితీరు ఆధారంగా, రిస్క్‌ తదితర అంశాలను బేరీజు వేసుకుని మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. ఏ పథకం మంచిదని విచారించిన తర్వాతే వారు ఇన్వెస్ట్‌ చేసేందుకు ఆసక్తి చూపుతారు. ఇన్వెస్టర్ల నుంచి వచ్చే నిధులను ఫండ్‌ మేనేజర్లు తమ శక్తి, సామర్థ్యాలు, తెలివితేటలతో వృద్ధికి అవకాశం ఉన్న చోట పెట్టుబడులు పెట్టి రాబడులు పంచుతుంటారు. అయితే, ఇదంతా నాణేనికి ఒకవైపు. మరోవైపు చూస్తే... ఫండ్‌ మేనేజర్లు

జీవిత బీమా పాలసీల్లో భారీ వృద్ధి

Sunday 16th December 2018

జీవిత బీమా పాలసీల ప్రాధాన్యతను మన దేశీయులు బాగానే అర్థం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇందుకు సూచికగా సగటు టికెట్‌ సైజు గత పదేళ్ల కాలంలో 2.45 రెట్లు పెరిగిందని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ తెలిపింది. 2008-09 ఆర్థిక సంవత్సరంలో ఓ సగటు రిటైల్‌ కస్టమర్‌ నుంచి వసూలు చేసే రెగ్యులర్‌ ప్రీమియం రూ.9,942 ఉండగా, 2017-18 సంవత్సరంలో ఇది రూ.22,549కి పెరిగినట్టు పేర్కొంది. టికెట్‌ సైజు పెరగడం అంటే

Most from this category