STOCKS

News


ఈక్విటీకే అగ్రతాంబూలం!!

Friday 14th December 2018
Markets_main1544777452.png-22936

ఇన్వెస్టర్లు వారి రిస్క్‌ ప్రొఫైల్‌ ఆధారంగా ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించాలని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ హెడ్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ అభిమన్యు సోఫత్‌ సూచించారు. రిస్క్‌ తీసుకోవడానికి ఇష్టపడే ఇన్వెస్టర్‌ తన పోర్ట్‌ఫోలియోలో 70 శాతాన్ని ఈక్విటీకి కేటాయించొచ్చని తెలిపారు. ఇక 20 శాతం డెట్‌కు, 10 శాతం బంగారంలో ఇన్వెస్ట్‌ చేయవచ్చని పేర్కొన్నారు. అదే ఒక మోస్తరుగా రిస్క్‌ను భరించగలిగే వ్యక్తి తన పోర్ట్‌ఫోలియోలో 50 శాతం ఈక్విటీకి, 35 శాతం డెట్‌కు, 15 శాతం బంగారానికి కేటాయించొచ్చని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. 
ఆర్‌బీఐ గత పాలసీ సమావేశంలో ద్రవ్యోల్బణ అంచనాలను 3.9- 4.5 శాతం నుంచి 2.7- 3.2 శాతానికి తగ్గించినప్పుడే భవిష్యత్‌లో సరళ పాలసీ విధానాలు ఉంటాయనే అంచనాకు రావొచ్చన్నారు. ద్రవ్యోల్బణ గణాంకాల గమనిస్తే.. ఆర్‌బీఐ నుంచి లిక్విడిటీ పెరుగుదలకు దోహదపడే చర్యలు ఉంటాయని తెలిపారు.  
ప్రస్తుత ఏడాది ఇప్పటి దాకా చూస్తే స్మాల్‌ క్యాప్స్‌, మిడ్‌ క్యాప్స్‌ వరుసగా 35 శాతం (నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 50), 13 శాతం (నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 50) పతనమయ్యాయని అభిమన్యు సోఫత్‌ తెలిపారు. అందువల్ల వీటిల్లో నాణ్యమైన స్టాక్స్‌ను ఆకర్షణీయమైన వ్యాల్యుయేషన్స్‌ వద్ద కొనుగోలు చేయడానికి మంచి అవకాశం అందుబాటులో ఉందన్నారు. ఫండమెంటల్స్‌ బలహీనంగా ఉన్న స్టాక్స్‌ జోలికి వెళ్లకపోవడం మంచిదని సూచించారు. స్టాక్‌ మార్కెట్‌ 2018లో ఇన్వెస్టర్లకు చెప్పుకోదగ్గ రాబడులను అందించలేదని తెలిపారు. నిఫ్టీ 50 ఈ ఏడాది ఇప్పటి దాకా చూస్తే 4 శాతం రాబడి అందించిందని పేర్కొన్నారు. క్రూడ్‌ ధరల పెరుగుదల, రూపాయి పతనం, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపాయని తెలిపారు. క్రూడ్‌ ధరల తగ్గుదల వల్ల 2019లో రూపాయి పతనం, క్యాడ్‌ పెరుగుదల, అధిక ద్రవ్యోల్బణం వంటి సమస్యలు పరిష్కారమౌతాయని పేర్కొన్నారు. 
ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్చేంజ్‌, ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, లార్సెన్‌ అండ్‌ టుబ్రో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ వంటి స్టాక్స్‌ను ఏడాది లక్ష్యంతో ప్రస్తుత స్థాయిల్లో కొనుగోలు చేయవచ్చని అభిమన్యు సోఫత్‌ సిఫార్సు చేశారు. క్యాపిటల్‌ గూడ్స్‌, ఐటీ రంగాలపై పాజిటివ్‌గా ఉన్నామని తెలిపారు. ఇకపోతే క్రూడ్‌ ధరల కదలికలు, బ్రెగ్జిట్‌ అంశం, వాణిజ్య ఉద్రిక్తతల రూపంలో సవాళ్లు ఇంకా ఉన్నాయని పేర్కొన్నారు. You may be interested

నిఫ్టీ ఫ్యూచర్లపై ఎంఎఫ్‌ల కన్ను

Friday 14th December 2018

ఏడాది చివరకు రిటర్న్‌ను పెంచుకునే నిమిత్తం పలు మ్యూచువల్‌ ఫండ్స్‌ నిఫ్టీ ప్యూచర్స్‌ను తెగ కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని లార్జ్‌ క్యాప్‌ ఫండ్‌ హౌసులు తమ పోర్టుఫోలియోలో దాదాపు 9 శాతం నిఫ్టీ ఫ్యూచర్స్‌ను చేర్చుకున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ వాల్యూ డిస్కవరీ, యాక్సిస్‌ మల్టిక్యాప్‌, యాక్సిస్‌ బ్లూచిప్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ బ్లుచిప్‌ ఫండ్‌, కోటక్‌ స్టాండర్డ్‌ మల్టిక్యాప్‌, కోటక్‌ ఇండియా కాంట్రా ఫండ్‌ తదితరాలు పోర్టుఫోలియోల్లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ను

జపాన్‌ కంపెనీలతో జేవీ.... ఇన్ఫోసిస్‌ ర్యాలీ

Friday 14th December 2018

2శాతం లాభపడిన షేర్లు జపాన్‌ సాంకేతిక మార్కెట్లో అడుగుపెట్టేందుకు దేశీయ సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ రంగం సిద్ధం చేసుకుంది. అందులో భాగంగా జపాన్‌కు చెందిన హిటాచీ, పానాసోనిక్‌, పానా సంస్థలతో ఒక జాయింట్‌ వెంచర్‌ కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్లు శుక్రవారం ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. ఈ భాగస్వామ్య కంపెనీ మొత్తం వాటాలో ఒక్క ఇన్ఫోసిస్‌ వాటానే 81శాతం వాటా ఉంటుంది. ఈ మెజార్టీ వాటా కొనుగోలు ఇన్ఫోసిస్‌ 174.58 కోట్లను వ్యయాన్ని

Most from this category