News


బ్యాంకులే బెటర్‌!

Friday 7th June 2019
Markets_main1559904465.png-26163

అజయ్‌ శ్రీవాస్తవ అభిప్రాయం
దేశీయ ఎకానమీ నిజంగా వృద్ధి సాధించాలనుకుంటే అన్ని రకాల రుణాలను ఆర్‌బీఐ రెపోరేట్‌కు అనుసంధానిస్తే చాలని డైమెన్షన్స్‌ కార్పొరేట్‌ ఫైనాన్స్‌ సీఈఓ అజయ్‌ శ్రీవాస్తవ చెప్పారు.  ప్రస్తుతం ఎకానమీలో పీఎస్‌యూలు, బ్యాంకులే బాగున్నాయని, వీటిలో పెట్టుబడులను పరిశీలించవచ్చని సూచించారు. షైలాక్‌(షేక్స్సియర్‌ నాటకంలో పాత్ర)లాగా బ్యాంకులు సంపద సృష్టిస్తూనే ఉంటాయని, అందువల్ల వీటిలో పెట్టుబడులే మంచివని చెప్పారు. లిక్విడిటీతో కదిలే ఇలాంటి మార్కెట్లు పలు అవకాశాలను ఇస్తాయని, వాటిని ఒడిసిపట్టాలని సూచించారు. ప్రస్తుత స్థితిలో కొత్త పెట్టుబడులు అనవసరమని, అలాగే ఎగ్జిట్‌ కావాల్సిన పనికూడా లేదని చెప్పారు. త్వరలో మంచి ఛాన్సు చూసి ఎంటర్‌కావాలన్నారు. ఇప్పటికైతే ఉన్న లాంగ్స్‌ను జాగ్రత్తగా హోల్డ్‌ చేయాలన్నారు. ఎకానమీ సైకిల్‌లో డౌన్‌ట్రెండ్‌ ఇంకా ముగింపునకు రాలేదని, జూన్‌ త్రైమాసికానికి ఈ డౌన్‌ట్రెండ్‌ ముగింపునకు రావచ్చని చెప్పారు. బ్రోకరేజ్‌లు చెప్పినట్లు 25 శాతం వృద్ది ఎక్కడా సాధ్యం కాదని, ఏ కంపెనీ కూడా ఇలాంటి టార్గెట్స్‌ ప్రకటించదని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యాంకుల షేర్లను నమ్ముకోవచ్చన్నారు. 
అతి రక్షణ, అధిక లాభాలు
ఎకానమీలో సగానికిపైగా సమస్యలు బ్యాంకింగ్‌ రంగంలో ఆర్‌బీఐ రక్షణాత్మక వలయంలో దాగుండే కొన్ని బ్యాంకులు పొందే భారీ అసంబద్ధ లాభాల వల్లనే వస్తాయని అజయ్‌ చెప్పారు. చరిత్ర పరిశీలిస్తే బ్యాంకులు ఎకానమీలో లాభాల్లో సింహభాగం తినేస్తాయని, దీనికితోడు వీటి చుట్టూ పటిష్టమైన రక్షణ కవచం ఉంటుందని చెప్పారు. బ్యాంకుల కారణంగానే ఎకానమీ వెనకపడిందని విమర్శించారు. రెపోరేటుతో బ్యాంకు రుణాలను లింక్‌చేస్తే చాలా సమస్యలు చక్కబడతాయని, వృద్ధి ఉరకలెత్తుతుందని తెలిపారు. ఇంత రక్షణ, లాభాలు ఉన్నాయి కనుకే బ్యాంకు షేర్లపై పెట్టుబడులు పెట్టవచ్చని సలహా ఇస్తునానన్నారు. దీనికితోడు ప్రసుత్తం ఎన్‌బీఎఫ్‌సీ సమస్య తలెత్తిన నేపథ్యంలో బ్యాంకు షేర్లు మరింతమందికి ఫేవరెట్లుగా మారతాయన్నారు. బ్యాంకులతో పాటు పీఎస్‌యూ స్టాకులను కూడా పరిశీలించవచ్చని చెప్పారు. You may be interested

క్రిప్టోకరెన్సీ లావాదేవీ జరిపితే జైలుకే!?

Friday 7th June 2019

క్రిప్టోనిషేధ బిల్లు ముసాయిదా ప్రతిపాదన భారత్‌లో క్రిప్టోకరెన్సీ లావాదేవీలు జరిపితే పదేళ్లు జైలు శిక్ష విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. క్రిప్టోకరెన్సీ అమ్మినా, కొన్నా జైలుకు పంపాలని క్రిప్టోకరెన్సీ నిషేధ బిల్లు 2019 ముసాయిదా ప్రతి పేర్కొంది. ముసాయిదా ప్రకారం ‘ప్రత్యక్షంగా, పరోక్షంగా క్రిప్టోలను మైన్‌ చేసిన, ఉత్పత్తి చేసిన, నిల్వ ఉంచుకున, అమ్మిన, బదిలీ చేసిన, వదిలించుకున, జారీ చేసిన, ఇక ఇతర ఏ లావాదేవీ జరిపిన’వాళ్లు ఈ నిషేధ కేటగిరీలోకి

స్వల్ప లాభాలతో గట్టెక్కిన సూచీలు

Friday 7th June 2019

ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరి అరగంట కొనుగోళ్లతో గట్టెక్కాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 39,615.90 వద్ద, నిఫ్టీ 26.90 పాయింట్లు పెరిగి 11,870.65 వద్ద ముగిశాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక వడ్డీరేట్లను పావుశాతం మేర తగ్గించినప్పటికీ.., నిన్న మార్కెట్‌ భారీ నష్టాలపాలైన నేపథ్యంలో నేటి ఇంట్రాడేలో ఆద్యంతం సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి 19

Most from this category