News


వర్ధమానదేశ మార్కెట్లపై విదేశీ ఇన్వెస్టర్లు శీతకన్ను

Saturday 15th December 2018
Markets_main1544859959.png-22968

విదేశీ ఇన్వెస్టర్లు వర్ధమానదేశ మార్కెట్లలో పెట్టుబడుల విషయంలో శీతకన్ను వేస్తున్నారు. ఈ డిసెంబర్‌ ప్రారంభం నుంచి వర్ధమాన దేశ మార్కెట్ల నుంచి 600 మిలియన్‌ డాలర్ల విలువైన పెట్టుబడులను వెనక్కితీసుకున్నారు. ఎఫ్ఐఐలు వెనక్కి తీసుకున్న మొత్తం పెట్టుబడుల్లో 500 మిలియన్‌ డాలర్లు భారత్‌, తైవాన్‌ దేశాల నుంచే కావడం విశేషం. అలాగే మలేషియా, సౌత్‌కొరియా, థాయిలాండ్‌ దేశాల నుంచి రూ.100 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. యూరప్‌ దేశాల్లో నెలకొన్న రాజకీయ అస్థిరత, వడ్డీరేట్లపై ఈసీబీ మెతకవైఖరితో ఆరు కరెన్సీ విలువల్లో యూరో బలహీనత డాలర్‌కు కలిసొస్తుంది. డాలర్‌ బలపడటం వర్ధమాన దేశాల మార్కెట్లకు ప్రతికూలాంశంగా మారుతుంది. అందుకు అనుగుణంగా ఈ వారంలో ఒక్క భారత్‌ తప్ప, మిగిలిన అన్ని వర్ధమాన దేశాల ఈక్విటీ&ఫారెక్స్‌ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. వచ్చే వారంలో గురువారం(డిసెంబర్‌ 20న) జరిగే ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ సమావేశం విదేశీ ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తున్నారు.



You may be interested

క్రాష్‌ టెస్ట్‌: ఈ కారుకు 5 స్టార్

Saturday 15th December 2018

టాటా నెక్సన్‌ ఘనత  రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతో మంచి చనిపోతున్నారు. దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా రోడ్డు భద్రత ప్రధాన సమస్యగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో సురక్షితమైన కార్ల తయారీ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. భారతీయ కార్ల తయారీ కంపెనీలు ఇప్పుడిప్పుడే ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో టాటా మోటార్స్‌ ఇతర కంపెనీలకు ఆదర్శంగా నిలిచింది. కంపెనీ సబ్‌కాంపాక్ట్‌ ఎస్‌యూవీ కారు ‘టాటా నెక్సన్‌’

పీఐ ఇండస్ట్రీస్‌పై జియోజిత్‌ ఏమంటోంది?

Saturday 15th December 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ జియోజిత్‌ ఫైనాన్షియల సర్వీసెస్‌ తాజాగా పీఐ ఇండస్ట్రీస్‌ షేరును కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం..  బ్రోకరేజ్‌: జియోజిత్‌ స్టాక్‌: పీఐ ఇండస్ట్రీస్‌ రేటింగ్‌: కొనొచ్చు టార్గెట్‌ ప్రైస్‌: రూ.873 జియోజిత్‌.. పీఐ ఇండస్ట్రీస్‌ షేరుపై పాజిటివ్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.873గా నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పీఐ ఇండస్ట్రీస్‌ అమ్మకాలు వార్షికంగా చూస్తే 29 శాతం మేర పెరిగాయని పేర్కొంది.

Most from this category