STOCKS

News


సాఫ్ట్‌బ్యాంక్ ‘రికార్డు’ ఐపీవో

Thursday 20th December 2018
Markets_main1545283170.png-23097

టోక్యో: జపాన్ టెక్నాలజీ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ భారీ పబ్లిక్ ఇష్యూతో (ఐపీవో) రికార్డు సృష్టించింది. ఐపీవో ద్వారా 2.65 లక్షల కోట్ల యెన్‌లు (సుమారు 23.5 బిలియన్ డాలర్లు) సమీకరించింది. జపాన్‌లో ఇది అతి పెద్ద ఐపీవో కాగా.. అంతర్జాతీయంగా భారీ పబ్లిక్ ఇష్యూల్లో రెండోది. 2014 నాటి చైనీస్ ఈకామర్స్ దిగ్గజం ఆలీబాబా ఐపీవో తర్వాత అంతటి భారీ పబ్లిక్ ఇష్యూ ఇదే. అప్పట్లో ఆలీబాబా సుమారు 25 బిలియన్ డాలర్లు సమీకరించింది. మరోవైపు, రికార్డు ఐపీవో అయినప్పటికీ.. లిస్టింగ్‌లో మాత్రం సాఫ్ట్‌బ్యాంక్ షేర్లు భారీగానే క్షీణించాయి. ఇష్యూ ధర షేరు ఒక్కింటికి 1,500 యెన్‌లు కాగా.. ఓపెనింగ్‌లోనే 1,463 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత అమ్మకాలు మరింత వెల్లువెత్తడంతో 14.5 శాతం క్షీణించి 1,282 యెన్‌ల వద్ద క్లోజయ్యింది. షేరు ధర గణనీయంగా పడిపోవడం దురదృష్టకరమని సాఫ్ట్‌బ్యాంక్ కార్పొరేషన్ సీఈవో కెన్ మియోచి వ్యాఖ్యానించారు. అయితే, ఇది ఆరంభం మాత్రమేనని, క్రమంగా పరిస్థితులు మెరుగుపడగలవని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మార్కెట్లు అస్తవ్యస్తంగా మారటం, మొబైల్ సంస్థల భారీ చార్జీలపై జపాన్‌లో విధాననిర్ణేతలు గుర్రుగా ఉండటం తదితర అంశాలు సాఫ్ట్‌బ్యాంక్ లిస్టింగ్‌పై ప్రతికూల ప్రభావం చూపి ఉంటాయని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. 



You may be interested

పసిడి 6నెలల గరిష్టం నుంచి పతనం

Thursday 20th December 2018

ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక వడ్డీరేట్లను పావుశాతం పెంచడంతో పసిడి ధర తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. నిన్నటి ట్రేడింగ్‌లో మొదట ఫెడ్‌ వడ్డీ రేట్ల నిర్ణయం కోసం ఎదురుచూస్తూ 8.50డాలర్ల పెరిగి 1,262.10 డాలర్ల వద్ద 6నెలల గరిష్టానికి తాకింది. అయితే రాత్రి  ఫెడ్‌ వడ్డీరేట్లను పావుశాతం పెంచడంతో పసిడి ధర 6నెలల గరిష్టస్థాయి(1,262.10 డాలర్లు) నుంచి దిగివచ్చింది. కీలక వడ్డీరేట్ల పెంపుతో డాలర్‌ పుంజుకోవడంతో పాటు ఆరునెలల గరిష్టం

వాహనాలకు ‘ఎలక్ట్రిక్‌’ షాక్‌!!

Thursday 20th December 2018

న్యూఢిల్లీ: ఇప్పటికే అధిక ధరలతో బెంబేలెత్తుతున్న వాహన కొనుగోలుదారుల నెత్తిన త్వరలో మరింత పన్ను పోటుకు రంగం సిద్ధమవుతోంది. దేశీయంగా పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా.. సాంప్రదాయ ఇంధనాలతో నడిచే వాహనాలపై ప్రత్యేక సెస్సు విధించాలని కేంద్రం యోచిస్తోంది. ద్విచక్రవాహనాలు మొదలుకుని కార్లు, బస్సులు, ట్రక్కుల్లాంటి వాణిజ్య వాహనాల దాకా అన్నింటిపై సుమారు రూ. 500- రూ. 25,000 దాకా ఈ సెస్సు భారం పడనుంది.

Most from this category