STOCKS

News


బ్యాంకింగ్‌ షేర్లే బెటర్‌!

Friday 12th October 2018
Markets_main1539339005.png-21093

ప్రస్తుత సంక్షోభ సమయంలో ఎన్‌బీఎఫ్‌సీల కన్నా బ్యాంకు స్టాకులను నమ్ముకోవడం మంచిదని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం బయటకు రావడంతో విత్త రంగ షేర్లు భారీగా కుదేలయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్‌బీఎఫ్‌సీలు కోలుకునేందుకు ఎక్కువ సమయం పట్టవచ్చని అందువల్ల వీటి కన్నా బ్యాకింగ్‌ షేర్లను ఆశ్రయించడం బెటరని డైమెన్షన్స్‌ కన్సల్టింగ్‌ ఎండీ అజయ్‌ శ్రీవాస్తవ చెప్పారు. ఇప్పటికే బ్యాంకు షేర్లున్న వాళ్లు స్వల్ప మొత్తాలతో పుట్స్‌ కొని హెడ్జ్‌ చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్‌ నుంచి అక్టోబర్‌ కాలంలో బ్యాంకు సూచీలు దాదాపు 13 శాతం పతనమయ్యాయి. నాణ్యమైన బ్యాంకు షేర్లను పొందేందుకు ఇదే సమయమని అజయ్‌ చెప్పారు. 
ఎందుకు మంచివి?
వాల్యూషన్లు: పలు ప్రైవేట్‌ బ్యాంకుల షేర్లు వాటి సరాసరి వాల్యూషన్‌ స్థాయిల కన్నా దిగువన ట్రేడవుతున్నాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ చెబుతోంది. క్రమంగా బ్యాంకింగ్‌ రంగంలో రికవరీ కనిపిస్తుందని అంచనా వేసింది. స్లిపేజ్‌లు క్రమంగా తగ్గుతున్నాయని అందువల్ల బ్యాంకింగ్‌ రంగం మరింత పుంజుకుంటుందని చెప్పారు. 
వలసలు: ఎన్‌బీఎఫ్‌సీలో భారీ పతనం తర్వాత ఈ కంపెనీలపై ఇన్వెస్టర్లకు నమ్మకాలు సడలుతున్నాయని, పలువురు కస్టమర్లు ఎన్‌బీఎఫ్‌సీలను వదిలి బ్యాంకుల్లో ఖాతాలకు వస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు ఇటీవల ఆర్‌బీఐ రేట్లు పెంచకపోవడం కూడా బ్యాంకులకు కలిసివచ్చే అంశమన్నారు. 
తీరుతున్న సమస్యలు: ఇంతవరకు బ్యాంకులు ఎదుర్కొన్న ఎన్‌పీఏలు, స్లిపేజ్‌లు లాంటి సమస్యలు క్రమంగా తీరుతున్నాయని, ఇవన్నీ పూర్తిగా కనుమరుగైతే బ్యాంకుల షేర్లు భారీగా పరుగు తీస్తాయని ఆనంద్‌ రాఠీ చెబుతోంది. ఈ దఫా ఫలితాల్లో ఇందుకు సంబంధించిన పాజిటివ్‌ సంకేతాలు కనిపిస్తాయని అంచనా వేస్తోంది.
రికమండేషన్లు: ప్రభుత్వ బ్యాంకుల్లో ఎస్‌బీఐని, ప్రైవేట్‌ బ్యాంకుల్లో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ను ఎక్కువమంది సిఫార్సు చేస్తున్నారు. 



You may be interested

732 = 237.. ఎలా?

Friday 12th October 2018

732 = 237  .. ఇదేంటి అని ఆలోచిస్తున్నారా?  ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లో శుక్రవారం ఒక విచిత్రం చోటు చేసుకుంది. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు రెండూ భారీ లాభాల్లోనే ముగిశాయి. అయితే ఇక్కడే ఆ గమత్తు దాగుంది. సెన్సెక్స్‌ లాభాన్ని తిరగేసి రాస్తే నిఫ్టీ లాభం వస్తుంది. అందేంటని ఆలోచిస్తున్నారా? అయితే ఇది చూడండి.. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ శుక్రవారం 732 పాయింట్ల (2.15 శాతం) లాభంతో 34,733 వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ

వెలుగులోకి విద్యుత్‌ షేర్లు

Friday 12th October 2018

విద్యుత్‌ టారీఫ్‌లను పెంచుకునేందుకు ధాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు స్వీకరించడంతో విద్యుత్‌  షేర్లు శుక్రవారం వెలుగులోకొచ్చాయి. బీఎస్‌ఈలో పవర్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించిన ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ పవర్‌ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో 3శాతం లాభపడింది. విద్యుత్‌ టారీఫ్‌లను పెంచుకోనేందుకు తమ అనుమతినివ్వాలంటూ టాటా, అదానీ పవర్‌ కంపెనీలు గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్‌ను ధాఖలు చేశాయి. నేడు విచారణకు వచ్చిన ఈ పిటిషన్‌పై రెండు వారాల తర్వాత తీర్పున

Most from this category