STOCKS

News


షేర్‌ ట్రేడింగ్‌లోకి పేటీఎమ్‌ మనీ !

Thursday 27th September 2018
Markets_main1538024636.png-20632

ముంబై: ఆర్థిక సేవల పంపిణీ రంగంలోకి ఇటీవలే ప్రవేశించిన పేటీఎమ్‌ మనీ త్వరలో స్టాక్‌ మార్కెట్‌ బ్రోకింగ్‌లోకి కూడా ప్రవేశించనున్నదని సమాచారం. స్టాక్‌ బ్రోకింగ్‌ లైసెన్స్‌ లభిస్తే,  పేటీఎమ్‌ మనీ సంస్థ ఈక్విటీ, కమోడిటీ, డెరివేటివ్‌ ట్రేడింగ్‌ను ఆఫర్‌ చేస్తుంది. స్టాక్‌ మార్కెట్‌ బ్రోకింగ్‌ లైసెన్స్‌ కోసం మరో రెండు వారాల్లో ఈ  కంపెనీ బీఎస్‌ఈకి గానీ, ఎన్‌ఎస్‌ఈకి గానీ దరఖాస్తు చేయనున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.. అయితే ఈ విషయమై వ్యాఖ్యానించడానికి పేటీఎమ్‌ మనీ హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ జాదవ్‌ నిరాకరించారు. కాగా పేటీఎమ్‌ షేర్‌ ట్రేడింగ్‌లోకి వస్తే, స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేసే ఇన్వెస్టర్ల సంఖ్య మరింతగా పెరుగుతుందని నిపుణులంటున్నారు. 

ఒకవేళ స్టాక్‌ బ్రోకర్‌ లైసెన్స్‌ కోసం పేటీఎమ్‌ మనీ దరఖాస్తు చేస్తే, సంతోషంగా స్వాగతిస్తామని బీఎస్‌ఈ సీఈఓ అశీష్‌కుమార్‌ చౌహాన్‌ చెప్పారు. 
 మ్యూచువల్‌ ఫండ్‌ ప్రొడక్ట్‌ల కోసం ఈ నెల 4న పేటీఎమ్‌ మనీ ఒక మొబైల్‌ యాప్‌ను ఆరంభించింది. ఈ సర్వీస్‌ కోసం ఇప్పటికే 10.7 లక్షల మంది వినియోగదారులు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం రోజుకు 10,000 మంది వినియోగదారులు ఈ యాప్‌ ద్వారా మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్ల అమ్మకం, కొనుగోళ్ల లావాదేవీలు నిర్వహిస్తున్నారు. పేటీఎమ్‌ మనీ తన సర్వీసులను చౌక ధరలకే అందిస్తోంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ డైరెక్ట్‌ ప్లాన్‌లను తక్కువ చార్జీలతో  ఆఫర్‌ చేస్తోంది. ఎలాంటి సలహా ఫీజులను వసూలు చేయడం లేదు. పేటీఎమ్‌కు 35 కోట్ల మంది యూజర్లున్నారని అంచనా. 


 



You may be interested

రెండేళ్లలో రూ.6,500 కోట్ల పెట్టుబడులు

Thursday 27th September 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీసీ) వరుసగా వచ్చే రెండు ఆర్ధిక సంవత్సరాల్లో రూ.6,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇనుము ఖనిజ నిక్షేపాలు, ఉత్పాదనపై గత ఆర్ధిక సంవత్సంరంలో రూ.2,800 కోట్లు మూలధన వ్యయం వెచ్చించామని.. ఈ ఆర్ధిక సంవత్సరంలో (2019) రూ.3,185 కోట్లు, వచ్చే ఆర్ధిక సంవత్సరంలో (2020) రూ.3,290 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఎన్‌ఎండీసీ సీఎండీ భజేంద్ర కుమార్‌ తెలిపారు. బుధవారమిక్కడ జరిగిన ఏజీఎం

గంటలో రూ. 1 కోటి రుణం..

Thursday 27th September 2018

న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ) రుణ అవసరాలు తీర్చే దిశగా కేంద్రం ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించింది. www.psbloansin59minutes.com పేరిట ఏర్పాటు చేసిన ఈ పోర్టల్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆవిష్కరించారు. ఈ పోర్టల్‌ ద్వారా ఎంఎస్‌ఎంఈలు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బి)తో పాటు అయిదు ప్రభుత్వ రంగ బ్యాంకులకు  రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.  రూ. 1 కోటి

Most from this category