STOCKS

News


ఎనిమిది రోజుల నష్టాలు... తర్వాత ఏంటి?

Wednesday 20th February 2019
Markets_main1550602557.png-24261

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డిసెంబర్‌ త్రైమాసికం ఫలితాలు నిరాశ కలిగించడం, రానున్న ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి ఇలా పలు కారణాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీంతో ఎనిమిది సెషన్లలోనూ మార్కెట్లు నష్టాల పాలయ్యాయి. కానీ, ఏం జరుగుతోందోనన్న ఆందోళన సాధారణ ఇన్వెస్టర్లలో నెలకొంది. రిస్క్‌ తీసుకునేందుకు కూడా ధైర్యం చేయలేని పరిస్థితి నెలకొన్నదంటున్నారు నిపుణులు. కార్పొరేట్‌ ఫలితాలు నిరాశపరచడం, బ్యాంకింగ్‌, ఎన్‌బీఎఫ్‌సీలో నెలకొన్న సంక్షోభం, బలహీన అంతర్జాతీయ సెంటిమెంట్‌ మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్నట్టు మార్కెట్‌ పరిశీలకులు సైతం పేర్కొంటున్నారు. కేంద్రంలో ఏ ఒక్క పార్టీ లేదా కూటమి స్పష్టమైన ఆధిక్యం సంపాదించబోదన్న అంచనాలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

 

ఇన్వెస్టర్ల కర్తవ్యం..?
భవిష్యత్తులో మంచి రాబడుల కోసం పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకునేందుకు ఎన్నికల ముందు కాలం అనువైనదిగా పలువురు అనలిస్టులు సూచిస్తున్నారు. ‘‘రుణ భారంతో ట్రేడింగ్‌ చేసే వారు, తక్కువ పొజిషన్లకే పరిమితం కావాలి. విడిగా స్టాక్‌ వారీ వృద్ధి అవకాశాలు, వ్యాల్యూషన్లకు మద్దతుగా నిలుస్తున్నాయా అన్నది చూడాలి’’ అని యస్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ అమర్‌అంబానీ సూచించారు. వినియోగం ఆధారిత కంపెనీల పట్ల సానుకూలంగా ఉన్నామని, 3-5 ఏళ్ల కాలం కోసం మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌తో పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకోవచ్చని తెలియజేశారు. క్యాపిటల్‌ గూడ్స్‌ ఈ సమయంలో మంచి కాంట్రాబెట్‌గా పేర్కొన్నారు. నిజానికి ఈ తరహా సంక్షోభ సమయాలు రెండు రకాల అవకాశాలను కల్పిస్తుంటాయి. ఒకటి మంచి స్టాక్స్‌ను తక్కువకే సొంతం చేసుకోవచ్చు. రెండోది... తమ పోర్ట్‌ఫోలియోలోని స్టాక్స్‌ను పునర్నిర్మాణం చేసుకోవచ్చు. పోర్ట్‌ఫోలియోలోని స్టాక్స్‌ కంటే ఎక్కువ రాబడులు, వృద్ధి అవకాశాలున్న స్టాక్స్‌ తక్కువకు లభిస్తుంటే వాటికి మారిపోవడం ఈ సమయంలో సాధ్యమవుతుంది. మంచి మూలాలు, భవిష్యత్తు వృద్ధి అవకాశాలు కలిగిన నాణ్యమైన స్టాక్స్‌తో బలమైన పోర్ట్‌ఫోలియో ఏర్పాటుకు ప్రస్తుత సమయాన్ని అవకాశంగా మలుచుకోవాలని ఎస్‌ఎంసీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ చైర్మన్‌, ఎండీ అగర్వాల్‌ సూచించారు. అధిక రుణ భారం, తక్కువ వడ్డీ కవరేజీ రేషియో ఉన్న కంపెనీలకు దూరంగా ఉండాలని, అలాగే, ప్రమోటర్లు 75 శాతానికి పైగా తమ వాటాలను తనఖా పెట్టిన ‍కంపెనీలకూ దూరంగా ఉండాలని ఏంజెల్‌ బ్రోకింగ్‌ ఫండ్‌ మేనేజర్‌ మయురేష్‌ జోషి సూచించారు. వినియోగ రంగంలోని కంపెనీలు దీర్ఘకాలంలో నిరాశపరచడం అరుదని, దీర్ఘకాలానికి వీటిల్లో పెట్టుబడులు ప్రతిఫలాన్నిస్తాయని అభిప్రాయపడ్డారు. 
 You may be interested

10650పైన ప్రారంభమైన నిఫ్టీ

Wednesday 20th February 2019

ప్రపంచమార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ స్టాక్‌మార్కెట్‌ బుధవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 213 పాయింట్ల లాభంతో 35,565 వద్ద, నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 10650 పైన 10,655 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. వరుసగా 9రోజుల పాటు నష్టాలతో అతలాకుతలమైన మార్కెట్లో ట్రేడర్లు, ఇన్వెస్టర్లు షార్ట్‌ కవరింగ్‌ చేస్తున్నారు. ఫలితంగా అన్ని ప్రధాన రంగ షేర్లలో కొనుగోళ్లు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ముఖ్యంగా మెటల్‌, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌,

ఈ కంపెనీల దిశ మారింది!

Wednesday 20th February 2019

డిసెంబర్‌ త్రైమాసికం ఫలితాల్లో 43 కంపెనీలు టర్న్‌ అరౌండ్‌ అయిన సంకేతాలు ఇచ్చాయి. అంటే ఓ కంపెనీ కొన్ని త్రైమాసికాలుగా నష్టాల్లో ఉండి అనంతరం లాభాల్లోకి అడుగుపెట్టడాన్ని టర్న్‌ అరౌండ్‌గా చెబుతారు. ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంకు, ఫ్యూచర్‌ కన్జ్యూమర్‌, సిండికేట్‌ బ్యాంకు, డిష్‌ టీవీ, ఓబీసీ, బిర్లా కార్ప్‌, ఐనాక్స్‌ విండ్‌, ఆస్ట్రా జెనెకా ఫార్మా తదితర కంపెనీలు ఇందులో ఉన్నాయి. ఈ కంపెనీల్లో చాలా వరకు గత ఏడాది కాలంలో 60

Most from this category