STOCKS

News


అదరగొడుతున్న అదాని గ్రూప్‌ షేర్లు

Monday 20th May 2019
Markets_main1558335447.png-25837

కేంద్రంలో నరేంద్ర మోదీ మరోసారి స్పష్టమైన మెజార్టీతో ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తారని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేయడంతో సోమవారం అదాని గ్రూప్‌ కంపెనీలు షేర్లు 20 శాతం ర్యాలీ చేశాయి.  
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌:- నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.130.80ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇంట్రాడేలో 21శాతం పెరిగి రూ.144.30ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.12:00లకు షేరు గతముగింపు ధర(రూ.118.95)తో పోలిస్తే 20.55శాతం లాభంతో రూ.143.70ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. బీఎస్‌ఈలో టాప్‌-30 షేర్లలో ఈ షేరు మొదటి స్థానంలో ట్రేడ్‌ అవుతోంది. 
అదానీ గ్రీన్‌ ఎనర్జీ:- నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.41.05ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇంట్రాడేలో 17 శాతం పెరిగి రూ.144.30ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.12:00లకు షేరు గతముగింపు ధర(రూ.37.4)తో పోలిస్తే 14 శాతం లాభంతో రూ.42.70ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
అదానీ ట్రాన్స్‌మిషన్స్‌:- నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.217.40ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇంట్రాడేలో 10శాతం పెరిగి రూ.226.50ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.12:00లకు షేరు గతముగింపు ధర(రూ.205.4)తో పోలిస్తే 10శాతం లాభంతో రూ.225.95ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
అదానీ పవర్‌:- నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.44.65ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇంట్రాడేలో 16శాతం పెరిగి రూ.47.25ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం గం.12:00లకు షేరు గతముగింపు ధర(రూ. 40.6)తో పోలిస్తే 15 శాతం లాభంతో రూ.46.65 ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

తగ్గిన బంగారం

Monday 20th May 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతున్నప్పటికీ, దేశీయంగా మాత్రం భారీగా తగ్గింది. డాలర్‌ మారకంలో రూపాయి బాగా బలపడటం ఇందుకు కారణమైంది. ఎంసీఎక్స్‌లో జూన్‌ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర మధ్యాహ్నం గం.12:45ని.లకు రూ.355లు నష్టపోయి రూ.31436.00ల ట్రేడ్‌ అవుతోంది. కేంద్రంలో ఈసారి కూడా బీజేపీ పార్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే అంచనాలతో ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 86పైసలు బలపడి 2వారాల గరిష్టస్థాయి రూ. 69.40 స్థాయికి పెరిగింది. ఈ

ఒపెక్‌ నిర్ణయంతో ఎగిసిన చమురు ధర

Monday 20th May 2019

ఉత్పత్తికోతలు కొనసాగించాలని, తద్వారా చమురు ధరలు పడకుండా ఈ ఏడాది మొత్తం మద్దతు అందించాలని ఒపెక్‌ సమావేశంలో నిర్ణయించారు. దీంతో సోమవారం ముడిచమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో బహుళవారాల గరిష్ఠాలకు చేరింది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు సైతం చమురు ధరకు ఆజ్యం పోశాయి. దీంతో బ్రెంట్‌ క్రూడ్‌ దాదాపు 1.5 శాతం పెరిగి 73.40 డాలర్లను తాకింది. ఒపెక్‌ సమావేశంలో అన్ని దేశాల మధ్య ఉత్పత్తి కోతకు సంబంధించి ఏకాభిప్రాయం

Most from this category