STOCKS

News


నష్టాల బాటలో అదానీ షేర్లు

Tuesday 7th August 2018
Markets_main1533626728.png-19010

ముంబై:- తొలి త్రైమాసిక ఫలితాలు అంతంత మాత్రం నమోదు కావడంతో మంగళవారం అదానీ గ్రూప్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి. త్రైమాసిక ఫలితాలు ఇన్వెస్టర్లను మెప్పించకపోవడంతో ఈ గ్రూప్‌ షేర్లలో అమ్మకాలకు తెరలేచింది. ఫలితంగా ఈ గ్రూప్‌నకు చెందిన అదానీ పోర్ట్స్‌, అదానీ పవర్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు 6 నుంచి 12శాతం నష్టపోయాయి.
అదానీ పోర్ట్స్‌:- ఎన్‌ఎస్‌ఈలో 6.50శాతం నష్టపోయింది. తొలి త్రైమాసికంలో నికర లాభం 9శాతం క్షీణించింది. ఈ క్యూ1లో నికరలాభం రూ.697 కోట్లు నమోదు కాగా, గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.768 కోట్లుగా నమోదైంది. మొత్తం ఆదాయం రూ.2960 కోట్ల నుంచి రూ.2,704 కోట్లకు పరిమితమైంది. త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవడంతో  ఇన్వెస్టర్లు షేర్ల అమ్మకాలు మొగ్గుచూపారు. ఫలితంగా షేరు ఎన్‌ఎస్‌ఈలో 6.50శాతం నష్టపోయి రూ.371.00 స్థాయికి చేరుకుంది. మధ్యాహ్నం గం.12:20లకు షేరు గత ముగింపు ధర రూ.397.35తో పోలిస్తే 6శాతం నష్టంతో రూ.372.65ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
అదానీ పవర్‌:- ఎన్‌ఎస్‌ఈలో 12.12 శాతం నష్టపోయింది. ఈ క్యూ1లో నికర నష్టం రూ.రూ.825 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో  రూ.453 కోట్లుగా మాత్రమే ఉంది. గత క్యూ1లో రూ.5,601 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.3,959 కోట్లకు చేరింది. ఈ క్వార్టర్‌లో నష్టాలు మరింత పెరగడంతో షేరు ఇంట్రాడేలో 12 శాతానికి పైగా నష్టపోయి 29.00 కనిష్ట స్థాయికి చేరుకుంది. మధ్యాహ్నం గం.12:20లకు షేరు గత ముగింపు ధర రూ.33.00తో పోలిస్తే 9శాతం నష్టంతో రూ.30.10 ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.197.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. తన సహచర కంపెనీ షేర్ల నష్టాల ట్రేడింగ్‌ ప్రభావం ఈ షేరుపై పడింది. ఫలితంగా షేరు ఇంట్రాడేలో 6శాతం నష్టపోయి రూ.186.65 స్థాయికి పతనమైతంది. మధ్యాహ్నం గం.12:20లకు షేరు గత ముగింపు ధర రూ.198.20తో పోలిస్తే 4శాతం నష్టంతో రూ.190.00 ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

30 స్టాకుల్లో ఎంఎసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌!

Tuesday 7th August 2018

దేశీయ సూచీలు ర్యాలీ మూడ్‌లో ఉన్నాయి. బుల్స్‌ పట్టు పెరగడంతో పలు షేర్లలో బుల్లిష్‌ సంకేతాలు కన్పిస్తున్నాయంటున్నారు నిపుణులు. సోమవారం ముగింపు ప్రకారం 30 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారినకంపెనీల్లో ఎక్సైడ్‌ బ్యాటరీస్‌, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, జుబిలాంట్‌ ఫుడ్‌వర్క్స్‌, ఎంఅండ్‌ఎం, తల్వాకర్స్‌, జుబిలాంట్‌ ఫుడ్‌సైన్సెస్‌, గృహ్‌ ఫైనాన్స్‌,

రూపాయి ఉండాల్సింది 71 స్థాయి వద్ద!

Tuesday 7th August 2018

కౌశిక్‌ బసు రూపాయి ఇప్పటికీ ఓవర్‌ వాల్యూడ్‌గా ఉందని, డాలర్‌తో పోలిస్తే 70- 71 స్థాయి వద్ద రూపాయికి ఫెయిర్‌వాల్యూ అని ప్రముఖ ఎకనమిస్టు, ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు కౌశిక్‌ బసు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది వర్ధమాన ఆసియా దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి అధ్వాన్న ప్రదర్శన చూపిన సంగతి తెలిసిందే. ఆర్‌బీఐ రేట్లు పెంచడం, క్యాడ్‌ విస్తరించడం... రూపాయిని కుంగదీశాయి. ప్రస్తుతం రూపాయి 68- 69 స్థాయిల వద్ద

Most from this category