STOCKS

News


ఎలక‌్షన్‌ ఫలితాల టెన్షన్‌ : అదానీ గ్రూప్‌ షేర్లు డౌన్‌

Monday 10th December 2018
Markets_main1544422984.png-22801

సాధారణ ఎన్నికలకు సెమిఫైనల్‌ భావించే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్న నేపథ్యంలో సోమవారం మార్కెట్లో ఇన్వెస్టర్ల అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు. ఈ ఎన్నికల్లో కేంద్రం ప్రభుత్వమైన భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఫలితాలు వెలువడతాయేమోనన్న భయాలతో బీజేపీకి సన్నిహిత గ్రూప్‌గా  పేరొందిన అదానీ గ్రూప్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి. ఈ గ్రూప్‌లోని అదానీ పవర్‌, అదానీ పోర్ట్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ ట్రాన్స్‌మిషన్స్‌ షేర్లు 7నుంచి 4శాతం నష్టపోయాయి.
అదానీ పోర్ట్స్‌:- నేడు బీఎస్‌ఈలో రూ.49.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 8శాతం నష్టపోయి రూ.48.15ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. ఉదయం గం.11:30ని.లకు షేరు గతముగింపు(రూ.48.15) ధరతో పోలిస్తే 6శాతం నష్టంతో రూ.48.90ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌:- నేడు బీఎస్‌ఈలో రూ.147.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 7శాతం నష్టపోయి రూ.141.85ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. ఉదయం గం.11:30ని.లకు షేరు గతముగింపు(రూ.152.8) ధరతో పోలిస్తే 5శాతం నష్టంతో రూ.144.90ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
అదానీ ట్రాన్‌‍్స మిషన్‌:- నేడు బీఎస్‌ఈలో రూ.207.60ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 7.28శాతం నష్టపోయి రూ.201.80ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. ఉదయం గం.11:30ని.లకు షేరు గతముగింపు(రూ.217.65) ధరతో పోలిస్తే 4.87శాతం నష్టంతో రూ.207.05ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

తగ్గితే.. కొనండి..

Monday 10th December 2018

నిఫ్టీ 10,960 మార్క్‌ను అధిగమించడంలో విఫలమైందని రుద్రా షేర్స్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ సీనియర్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ మనాలి భాటియా తెలిపారు. గత వారంలో 1.68 శాతం మేర పతనమైందని, 10,693 వద్ద ముగిసిందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఎన్నికల ఫలితాల వెల్లడి నేపథ్యంలో మార్కెట్‌లో తీవ్ర ఒడిదుడుకులు ఉండొచ్చని అంచనా వేశారు. రాజస్తాన్‌లో బీజేపీ ఓడిపోతుందని మార్కెట్‌ వర్గాలు ఇప్పటికే అంచనాకు వచ్చేశాయని తెలిపారు. అయితే మధ్యప్రదేశ్‌, ఛత్తీశ్‌గఢ్‌లలో

భారీ నష్టాల్లో బ్యాంక్‌ నిఫ్టీ

Monday 10th December 2018

మార్కెట్‌లో నెలకొన్న అమ్మకాల సునామిలో భాగంగా బ్యాంకింగ్‌ షేర్లు భారీ నష్టపోయితున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ నేటి ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 2శాతం క్షీణించి 26073.30 స్థాయికి పడిపోయింది. ఉదయం గం.11:00లకు ఇండెక్స్‌ గతముగింపు (26594.30)తో పోలిస్తే దాదాపు 361.45 పాయింట్లు నష్టపోయి 26,238.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో భాగమైన మొత్తం 12 షేర్లలో 10

Most from this category