STOCKS

News


కొనసాగుతున్న అనిల్‌ అంబానీ షేర్ల పతనం

Friday 7th June 2019
Markets_main1559899193.png-26159

అనిల్‌ అంబానికి చెందిన అడాగ్‌ షేర్ల పతనం శుక్రవారం  కొనసాగుతుంది. ఈ గ్రూప్‌నకు చెందిన షేర్లు దాదాపు 15శాతం క్షీణించాయి. అత్యధికంగా రిలయన్స్‌ ఇన్ప్రాస్ట్రక్చర్స్‌ షేర్లు 14శాతం నష్టపోయాయి. వాటితో పాటు రిలయన్‌ క్యాపిటల్‌ 12శాతం, రిలయన్స్‌ హోమ్స్‌ 10శాతం, రిలయన్స్‌ పవర్‌ 10శాతం, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌4శాతం, రిలయన్స్‌ నావెల్‌ అండ్‌ ఇంజనీరింగ్స్‌ షేర్లు 3శాతం క్షీణించాయి. 
15ఏళ్ల కనిష్టానికి రిలయన్స్‌ ఇన్ప్రాస్ట్రక్చర్స్‌:-
నేడు ఈ కంపెనీ షేరు బీఎస్‌ఈలో రూ.83.60ల వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి అడాగ్‌ గ్రూప్‌ షేర్లలో వెల్లువెత్తుతున్న అమ్మకాల్లో భాగంగా ఈ షేరు ఇంట్రాడేలో 14శాతం నష్టపోయి రూ.72.80ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. ఈ ధర షేరుకు 15ఏళ్ల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ఈ రెండు రోజుల్లో ఈ షేరు 25శాతం క్షీణించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఈ షేర్లు 34శాతం నష్టపోయాయి. నేడు మార్కెట్‌ ముగింపు అనంతరం కంపెనీ త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనుంది. వాస్తవానికి మే 30వ తేదిన కంపెనీల క్వార్టర్‌ ఫలితాలను విడుదల చేయాలి. అయితే కొన్ని కారణాలతో ఫలితాలను జూన్‌ 07నాటికి వాయిదా వేస్తున్నట్లు కంపెనీ మే 29న ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. మధ్యాహ్నం గం.2:30ని.లకు 11.50శాతం నష్టంతో రూ.75.20ల వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. 
ఇదే సమయానికి సెన్సెక్స్‌ 50.18 పాయింట్ల లాభంతో 39569.89 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల స్వల్పలాభంతో 11859.65 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ మరో 14 శాతం క్రాష్‌

Friday 7th June 2019

మూడోరోజూ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్ల పతనం కొనసాగుతుంది. గత ట్రేడింగ్‌లో 15శాతం క్షీణించిన ఈ షేర్లు నేడు తాజాగా మరో 14శాతం నష్టపోయాయి. డిబెంచర్లపై రుణాలను చెల్లించడంలో విఫలం అవుతుండటం, ద్రవ్య నిల్వలు రోజురోజూకు అడుగంటిపోతున్న తరణంలో ఇక్రా, క్రిసెల్‌ రేటింగ్‌ సంస్థలు కంపెనీ విడుదల చేసిన రూ.850 కోట్ల విలువైన కమర్షియల్‌  పేపర్లపై ఇక్రా, క్రిసెల్‌ రేటింగ్‌ సంస్థలు రేటింగ్‌ ‘‘ఎ4’’ నుంచి ‘‘డిఫాల్ట్‌’’కు డౌన్‌గ్రేడ్‌ చేశాయి. ఫలితంగా షేరు

క్యాలెండర్‌ స్ప్రెడ్‌ వ్యూహంపై కన్నేయండి!

Friday 7th June 2019

నిఫ్టీ ఆప్షన్స్‌పై నిపుణుల సూచన మార్కెట్లో అనిశ్చితి నెలకొన్న వేళ ట్రేడర్లు కాలెండర్‌ స్ప్రెడ్‌ వ్యూహాన్ని అవలంబించడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ వ్యూహంలో దిగువ స్థాయికి చెందిన అదే నెల పుట్‌ను విక్రయించి, తదుపరినెలకు చెందిన అంతకన్నా తక్కువ పుట్‌ను కొనుగోలు చేస్తారు. దీనివల్ల అనుకున్నదాని కన్నా డౌన్‌సైడ్‌ రిస్కులు పెరిగితే హెడ్జ్‌కు పనికివస్తుంది. ఉదాహరణకు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యూహం ప్రకారం 11400 పుట్‌ను విక్రయించి, 11200

Most from this category