News


అడాగ్‌ షేర్ల పతనం

Thursday 14th March 2019
Markets_main1552553964.png-24606

అనిల్‌ అంబానీ గ్రూప్‌నకు చెందిన అడాగ్‌ షేర్లు గురువారం ట్రేడింగ్‌లో నష్టాల బాట పట్టాయి. ఎరిక్సన్ బకాయిల చెల్లింపుల వ్యవహారంలో నిధుల సమీకరణకు నేషనల్ కంపెనీ లా అప్పీలెట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) తన అభిప్రాయాన్ని రిజర్వ్‌లో పెట్టడటం ఇందుకు కారణమైంది. ఎరిక్సన్‌కు రూ. 550 కోట్ల బకాయిలను నాలుగు వారాల్లో చెల్లించాలని గత నెల సుప్రీం కోర్టు ఆర్‌కామ్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రుణాల చెల్లింపునకు తమ ఖాతాల్లో ఉన్న ఐటీ రిఫండ్స్ను వినియోగించుకుటానమని ఎన్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించింది. ఆర్‌కామ్‌ పిటిషన్‌ను పరిశీలించిన ఎన్‌సీఎల్‌ఏటీ తీర్పును రిజర్వ్‌ పెడుతున్నట్లు తెలిపింది. ఈ ప్రతికూలాంశంతో  నేటి ట్రేడింగ్‌లో అడాగ్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి. రిలయన్స్‌ క్యాపిటల్‌ అత్యధికంగా 6శాతం నష్టపోయింది. అలాగే రిలయన్స్‌ పవర్‌ 5శాతం, రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌, రిలయన్స్‌ హోమ్‌, రిలయన్స్‌ నావెల్‌ ఇంజనీరింగ్‌ షేర్లు 3శాతం క్షీణించాయి. ఆర్‌కామ్ తాకట్టు పెట్టిన 12 కోట్ల షేర్లను బుధవారం బ్యాంకర్లు అమ్మేవేసిన నేపథ్యంలో ఆర్‌కామ్‌ ఇండెక్స్‌ 2.50శాతం క్షీణించి కొత్త జీవితకాల కనిష్టానికి చేరుకుంది. అలాగే రిలయన్స్‌ నిప్పన్‌ షేరు సైతం 1.50శాతం నష్టపోయింది. 



You may be interested

జర్మనీని దాటేశాం!

Thursday 14th March 2019

మార్కెట్‌ క్యాప్‌లో దూసుకుపోయిన భారత్‌ అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్‌ క్యాప్‌ ర్యాంకుల్లో భారత్‌ దూసుకుపోతోంది. తాజాగా మార్కెట్‌క్యాపిటలైజేషన్‌ లెక్కల్లో జర్మనీ మార్కెట్‌ను భారత్‌ మార్కెట్‌ దాటేసింది. ఎన్నికల్లో స్థిర ప్రభుత్వం వస్తుందన్న అంచనాలతో కొన్ని రోజులుగా దేశీయ సూచీలు ర్యాలీ జరుపుతున్నాయి. ఈ క్రమంలో దేశ ఈక్విటీ మార్కెట్‌ క్యాప్‌ 2.12 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇదే సమయంలో ఫ్రాంక్‌ఫర్ట్‌(జర్మనీ) సూచీ డాక్స్‌ మార్కెట్‌ క్యాప్‌ 2.08 లక్షల కోట్ల

రాణిస్తున్న రియల్టీ షేర్లు

Thursday 14th March 2019

లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న మార్కెట్‌లో రియల్టీ షేర్లు రాణిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ గురువారం ట్రేడింగ్‌లో 2.50శాతం ర్యాలీ చేసింది. ఇండెక్స్‌లో అత్యధికంగా ఇండియాబుల్‌ రియల్‌ ఎస్టేట్‌ లిమిటెడ్‌ షేర్లు అత్యధికంగా 7.50శాతం లాభపడింది. అలాగే డీఎల్‌ఎఫ్‌ షేరు 5శాతం, ఫోనిక్స్‌ లిమిటెడ్‌ 3శాతం, ప్రెస్టేజ్‌ ఎస్టేజ్‌ షేరు 2శాతం లాభపడ్డాయి. సన్‌ టెక్‌, ఓబెరాయ్‌ లిమిటెడ్‌ షేర్లు 1శాతం వరకు

Most from this category