STOCKS

News


అడాగ్‌ షేర్లకు ఆర్‌కామ్‌ దెబ్బ..!

Monday 4th February 2019
Markets_main1549261245.png-23995

రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ షేర్ల భారీ పతనం అడాగ్‌ షేర్లను నష్టాల బాట పట్టించింది.  దివాళా పరిష్కార ప్రక్రియకు జాతీయ కంపెనీ లా ట్రెబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)ను ఆశ్రయించడంతో నేడు ఆర్‌కామ్‌ షేరు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే ఏకంగా 48శాతం నష్టపోయిన సంగతి తెలిసిందే. ఆర్‌కామ్‌ పతనం దెబ్బకు అడాగ్‌ కంపెనీలో దాదాపు షేర్లనీ 52-వారాల కనిష్టానికి చేరుకున్నాయి. ఈ గ్రూప్‌ కంపెనీలోని రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ నావెల్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ పవర్‌, రిలయన్స్‌ నిప్పాన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ షేర్లు 20శాతం నుంచి 10శాతం నష్టపోయాయి.


రిలయన్స్‌ క్యాపిటల్‌:- నేడు బీఎస్‌ఈలో రూ.179.15ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 19శాతానికి పైగా పతనమైన రూ.152.50ల కనిష్టానికి చేరుకుంది. ఈ ధర షేరుకు ఏడాది కనిష్టస్థాయి కావడం గమనార్హం. ఉదయం గం.11:00లకు షేరు గతముగింపు ధర(రూ.189.15)తో పోలిస్తే దాదాపు 17శాతానికి పైగా నష్టపోయి రూ. 155.60ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.152.50 రూ.521.00లుగా ఉన్నాయి.


రిలయన్స్‌ నావెల్‌ అండ్‌ ఇంజనీరింగ్స్‌:- నేడు బీఎస్‌ఈలో రూ.11.47ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 14శాతానికి పైగా పతనమైన రూ.10.20ల కనిష్టానికి చేరుకుంది. ఈ ధర షేరుకు ఏడాది కనిష్టస్థాయి కావడం గమనార్హం. ఉదయం గం.11:00లకు షేరు గతముగింపు ధర(రూ.11.82)తో పోలిస్తే దాదాపు 14శాతానికి పైగా నష్టపోయి రూ.10.33ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.10.20లు, రూ.44.10లుగా ఉన్నాయి.


రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌:- నేడు బీఎస్‌ఈలో రూ.251.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 16శాతానికి పైగా పతనమైన రూ. 222.85ల కనిష్టానికి చేరుకుంది. ఈ ధర షేరుకు ఏడాది కనిష్టస్థాయి కావడం గమనార్హం. ఉదయం గం.11:00లకు షేరు గతముగింపు ధర(రూ.266.95)తో పోలిస్తే దాదాపు 14శాతం నష్టపోయి రూ.266.95ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.222.85లు, రూ.488.50లుగా ఉన్నాయి.


రిలయన్స్ హోమ్‌ ఫైనాన్స్‌:- నేడు బీఎస్‌ఈలో రూ.33.10ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 14శాతానికి పైగా పతనమైన రూ.29.50ల కనిష్టానికి చేరుకుంది. ఈ ధర షేరుకు ఏడాది కనిష్టస్థాయి కావడం గమనార్హం. ఉదయం గం.11:00లకు షేరు గతముగింపు ధర(రూ.34.55)తో పోలిస్తే దాదాపు 10శాతం నష్టపోయి రూ.31.10ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.29.50లు, రూ.81.80లుగా ఉన్నాయి.

 



You may be interested

ఆర్‌బీఐ సమీక్ష, క్యూ3 ఫలితాలే కీలకం..!

Monday 4th February 2019

- గురువారం ఆర్‌బీఐ పాలసీ నిర్ణయం... - నికాయ్‌ సర్వీసెస్‌ పీఎంఐ డేటా ఈవారంలోనే.. - టాటా మోటార్స్‌, కోల్‌ ఇండియా, లుపిన్‌, సిప్లా క్యూ3 ఫలితాలు - అమెరికా ఉద్యోగల గణంకాలు, జీడీపీపై దృష్టి న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గత శుక్రవారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ప్రభావం ఈవారంలో కూడా మార్కెట్‌పై ఉండనుందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రభావం కొనసాగనున్నప్పటికీ.. ఫిబ్రవరి 7న వెల్లడికానున్న ఆర్‌బీఐ ఆరవ ద్వైమాసిక పాలసీ సమీక్ష

ఆర్‌కామ్‌ 48 శాతం క్రాష్‌

Monday 4th February 2019

అనిల్‌ అంబానీ నేతృత్వంలోని టెలికాం సంస్థ రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ సోమవారం ట్రేడింగ్‌ ప్రారభంలోనే ఏకంగా 48శాతం నష్టపోయింది. దివాళా పరిష్కార ప్రక్రియకు జాతీయ కంపెనీ లా ట్రెబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ)ను ఆశ్రయించడం ఇందుకు కారణం. ఆస్తులను విక్రయించేందుకు రుణదాతల నుంచి 100శాతం అనుమతులు రాకపోవడంతో  దివాలా పిటిషన్‌ ద్వారా ఎన్‌సీఎల్‌టీ మార్గంలోనైనా రుణ పరిష్కార ప్రక్రియకు ఆమోదం తీసుకోవాలని ఆర్‌కామ్ భావిస్తున్నట్లు శుక్రవారం వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో నేడు బీఎస్‌ఈలో కంపెనీ

Most from this category