STOCKS

News


మూడోరోజూ కొనసాగుతున్న అడాగ్‌ షేర్ల పతనం

Wednesday 6th February 2019
Markets_main1549440803.png-24048

అనిల్‌ అంబానీ గ్రూప్‌ అడాగ్‌ షేర్ల పతనం ఆగట్లేదు. దివాళా పరిష్కారానికి ఎన్‌సీఎటీకి వెళ్లనున్న నేపథ్యంలో ఈ కంపెనీ షేర్లు వరుసగా మూడో రోజూ నష్టాల బాట పట్టాయి. ఇంట్రాడేలో రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌, రిలయన్స్‌ పవర్‌, రిలయన్స్‌ హోమ్స్‌, రిలయన్స్‌ నావెల్‌ ఇంజనీరింగ్స్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ నిప్పాన్‌ లైవ్‌ షేర్లు 28శాతం నుంచి 11శాతం క్షీణించాయి. అయితే ఇదే అడాగ్‌ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్‌ పవర్‌ షేరు మాత్రం 3శాతం లాభపడింది.
1. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌:- నేటి ఇంట్రాడే షేరు 11శాతం నష్టపోయింది. ఈ 3రోజుల్లో కంపెనీ షేరు 58శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.1:00లకు షేరు గత ముగింపు(రూ.5.44) ధరతో పోలిస్తే దాదాపు 5.16శాతం నష్టంతో రూ.5.20ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
2. రిలయన్స్‌ పవర్‌:-  నేటి ఇంట్రాడే షేరు 14శాతం నష్టపోయింది. ఈ 3రోజుల్లో కంపెనీ షేరు 61శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.1:00లకు షేరు గత ముగింపు(రూ.11.95) ధరతో పోలిస్తే దాదాపు 0.10శాతం నష్టంతో రూ.12.05ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
3. రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌:- నేటి ఇంట్రాడే షేరు 29శాతం నష్టపోయింది. ఈ 3రోజుల్లో కంపెనీ షేరు 39శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.1:00లకు షేరు గత ముగింపు(రూ.227.2) ధరతో పోలిస్తే దాదాపు 31.78శాతం నష్టంతో రూ.72.20ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  
4.రిలయన్స్‌ నావెల్‌ అండ్‌ ఇంజనీరింగ్స్‌:- నేటి ఇంట్రాడే షేరు 11శాతం నష్టపోయింది. ఈ 3రోజుల్లో కంపెనీ షేరు 34శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.1:00లకు షేరు గత ముగింపు(రూ.8.73) ధరతో పోలిస్తే దాదాపు 7శాతం నష్టంతో రూ.8.15ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
5.రిలయన్స్‌ క్యాపిటల్‌:- నేటి ఇంట్రాడే షేరు 10శాతం నష్టపోయింది. ఈ 3రోజుల్లో కంపెనీ షేరు 28శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.1:00లకు షేరు గత ముగింపు(రూ.152.15) ధరతో పోలిస్తే దాదాపు 9శాతం నష్టంతో రూ.152.15ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 8 శాతం అప్‌

Wednesday 6th February 2019

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు వరుసగా రెండోరోజూ లాభపడ్డాయి. బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో బుధవారం 8శాతం ర్యాలీ చేశాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.365.55ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారభించింది. ఎస్సాల్‌ గ్రూప్‌ ప్రమోటర్లు ఈ గ్రూప్‌నకు చెందిన ఆరు లిస్టెడ్‌ కంపెనీల్లో తమ వాటాల నుంచి కొంత మేర ఓపెన్‌ మార్కెట్లో విక్రయించారు. తద్వారా రూ.1050 కోట్లను ప్రమోటర్లు సమకూర్చుకున్నారు. జవనరి 25 నుంచి ఫిబ్రవరి 1 మధ్య

ఐటీ షేర్ల ర్యాలీ

Wednesday 6th February 2019

డాలర్‌ మారకంలో రూపాయి బలపడుతున్నప్పటికీ.., ఐటీ షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో 2శాతం లాభపడింది.  ఉదయం గం.11.30ని.లకు నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 1.56 శాతం పెరిగి 15,989.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ రంగానికి చెందిన టెక్‌ మహీంద్రా షేరు 6శాతం లాభపడింది. ఈ క్యూ3లో కంపెనీ ఆశాజనకమైన ఫలితాల ప్రకటన ఇందుకు నేపథ్యం. అలాగే హెవీవెయిట్‌

Most from this category