STOCKS

News


ఆగని అడాగ్‌ పతనం

Thursday 7th February 2019
Markets_main1549527740.png-24071

అనిల్‌ అంబానీ గ్రూప్‌ అడాగ్‌ షేర్ల పతనం ఆగట్లేదు. వరుసగా నాలుగో రోజూ నష్టాల బాట పట్టాయి. ఆస్తుల అమ్మకానికి చట్టపరమైన సమస్యలు తలెత్తడంతో అడాగ్‌ గ్రూప్‌ దివాళా పరిష్కారానికి ఎన్‌సీఎటీకి వెళ్లనుండటం ఇందుకు నేపథ్యం. తాజాగా నేటి ట్రేడింగ్‌లో రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌ 20శాతం, రిలయన్స్‌ పవర్‌  14శాతం, రిలయన్స్‌ క్యాపిటల్‌ 12శాతం, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ 6శాతం, రిలయన్స్‌ నావెల్‌ అండ్‌ ఇంజనీరింగ్ష్‌ 3శాతం నష్టపోయాయి.
1.రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌:- నేటి ఇంట్రాడే షేరు 29శాతం నష్టపోయింది. ఈ 4రోజుల్లో కంపెనీ షేరు 56శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.1:00లకు షేరు గత ముగింపు(రూ.154) ధరతో పోలిస్తే దాదాపు 26శాతం నష్టంతో రూ.114.40ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
2.రిలయన్స్‌ పవర్‌:- నేటి ఇంట్రాడే షేరు 28శాతం నష్టపోయింది. ఈ 4రోజుల్లో కంపెనీ షేరు 60శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.1:00లకు షేరు గత ముగింపు(రూ.12.75) ధరతో పోలిస్తే దాదాపు 22శాతం నష్టంతో రూ.9.90ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
3. రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌:- నేటి ఇంట్రాడే షేరు 10.50శాతం నష్టపోయింది. ఈ 4రోజుల్లో కంపెనీ షేరు 58శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.1:00లకు షేరు గత ముగింపు(రూ.5.48) ధరతో పోలిస్తే దాదాపు 5 శాతం నష్టంతో రూ.5.22ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
4.రిలయన్స్‌ క్యాపిటల్‌:- నేటి ఇంట్రాడే షేరు 25శాతం నష్టపోయింది. ఈ 4రోజుల్లో కంపెనీ షేరు 34శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.1:00లకు షేరు గత ముగింపు(రూ.143.75) ధరతో పోలిస్తే దాదాపు 19శాతం నష్టంతో రూ.116ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
 5.రిలయన్స్‌ నావెల్‌ అండ్‌ ఇంజనీరింగ్స్‌:- నేటి ఇంట్రాడే షేరు 5శాతం నష్టపోయింది. ఈ 4రోజుల్లో కంపెనీ షేరు 34శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.1:00లకు షేరు గత ముగింపు(రూ.8.23) ధరతో పోలిస్తే దాదాపు 1శాతం నష్టంతో రూ.8.12ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

రెపోరేటు కోత : అటో షేర్ల ర్యాలీ

Thursday 7th February 2019

బ్యాంకులు ఆర్‌బీఐ నుంచి తీసుకునే స్వల్పకాలిక రుణాలపై చెల్లించే వడ్డీ రేట్ల(రెపో రేటు)ను తగ్గించడంతో గురువారం మిడ్‌సెషన్‌ అనంతరం అటో షేర్లు లాభాల బాట పట్టాయి. రెపో రేట్ల తగ్గింపుతో వాహన రుణాలపై బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గవచ్చనే అంచనాలు అటో షేర్ల కొనుగోళ్లకు కారణమవుతున్నాయి.  ఎన్‌ఎస్‌ఈలో అటో షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ 2శాతానికి పైగా ర్యాలీ చేసింది. ఇండెక్స్‌లో అత్యధిక అశోక్‌లేలాండ్‌ 6శాతానికి పైగా ర్యాలీ

అక్టోబర్‌ - డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాలు

Thursday 7th February 2019

బెర్జర్‌ పెయింట్స్‌ నికర లాభం రూ.140 కోట్లు కోల్‌కత్తా: బెర్జర్‌ పెయింట్స్‌ కన్సాలిడేటెడ్‌ లాభం డిసెంబర్‌ క్వార్టర్లో 2.7 శాతం వృద్ధితో రూ.133.9 కోట్లుగా నమోదైంది. ఆదాయం రూ.1,616.7 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ.130.4 కోట్లు, ఆదాయం రూ.1338.6 కోట్లుగా ఉంది. స్టాండలోన్ నికర లాభం 7.4 శాతం వృద్ధిచెంది రూ.119.5 కోట్లకు చేరుకుంది. ఆదాయం 21 శాతం వృద్ధితో రూ.1,460 కోట్లకు

Most from this category