STOCKS

News


అడాగ్‌ షేర్లు...నిలువునా పతనం

Thursday 18th April 2019
Markets_main1555584658.png-25211

మార్కెట్‌ లాభాల స్వీకరణలో భాగంగా అనిల్‌ ధీరూభాయ్‌ అంబానీ గ్రూప్‌(అడాగ్‌) గురువారం ట్రేడింగ్లో భారీగా పతనమయ్యాయి. గత రెండు రోజుల్లో 15 శాతం నష్టపోయిన రిలయన్స్‌ క్యాపిటల్‌ షేరు నేటి ట్రేడింగ్‌లో మరో 13శాతం కోల్పోయి రూ.149.65 వద్ద స్థిరపడింది. ఇదే గ్రూప్‌లోని రిలయన్స్‌ పవర్‌ 14శాతం నష్టపోయి 8.10 వద్ద, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ 4శాతం నష్టపోయి 2.40శాతం వద్ద ముగిశాయి. అలాగే రిలయన్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌ 8.80శాతం, రిలయన్స్ హోమ్‌ ఫైనాన్స్‌  6.35 శాతం చొప్పున క్షీణించాయి.



You may be interested

187 కంపెనీల్లో పెరిగిన ఎఫ్‌ఐఐల వాటా

Thursday 18th April 2019

ఫిబ్రవరి నుంచి మార్చి చివరికి రూ.40,000 కోట్లను మన మార్కెట్లలోకి పంప్‌ చేసిన విదేశీ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు... మొత్తం మీద మార్చి త్రైమాసికంలో 187 కంపెనీల్లో వాటాలను పెంచుకున్నారు. అదే సమయంలో 200 కంపెనీల్లో లాభాలు తీసుకుని వాటాలు తగ్గించుకున్నట్టు గణాంకాల ఆధారంగా తెలుస్తోంది.   ఏప్రిల్‌ 12 నాటికి వెలుగు చూసిన కంపెనీల వాటాదారుల వివరాలను పరిశీలించగా... యాక్సిస్‌ బ్యాంకు, యూపీఎల్‌, పీఎన్‌బీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, విప్రో, బజాజ్‌ ఫైనాన్స్‌, ఏసీసీ,

ఫెడరల్‌ బ్యాంక్‌ నుంచి పేలవ ఫలితాలు?!

Thursday 18th April 2019

నిపుణుల అంచనా పేరొందిన ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా తాజాగా ఫెడరల్‌ బ్యాంకులో వాటాను తగ్గించుకుంటూ వస్తున్నారు. మార్చిచివరి నాటికి రాకేశ్‌ దాదాపు 12.5 లక్షల ఫెడరల్‌ బ్యాంకు షేర్లను తన రేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ద్వారా విక్రయించారు. దీంతో బ్యాంకులో ఆయన వాటా 1.16 నుంచి 1.1 శాతానికి దిగివచ్చింది. క్యు3లో స్థిరమైన ఫలితాలు ప్రకటించినా బ్యాంకు షేరు ఈ మధ్యకాలంలో పెద్దగా పెరగలేదు. దీంతో క్యు4లో బ్యాంకు ఫలితాలు పేలవంగా

Most from this category