STOCKS

News


ఆనంద్‌రాఠీ నుంచి మూడు సిఫార్సులు

Thursday 11th July 2019
Markets_main1562839514.png-26991

ప్రస్తుత పతనంలో క్రమానుగత ధోరణిలో కొనుగోలు చేసి అట్టిపెట్టుకోవాల్సిన మూడు షేర్లను ఆనంద్‌ రాఠీ బ్రోకరేజ్‌ సంస్థ రికమండ్‌ చేసింది.
1. సిటీయూనియన్‌బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 228. స్థిరమైన ఆస్తుల నాణ్యత, బలమైన క్యాపిటలైజేషన్‌, రిటైల్‌, ఎస్‌ఎంఈ రంగాలపై ఎక్కువ ఫోకస్‌... అనే లక్షణాలు బ్యాంకును ముందుకు నడిపిస్తాయి. వీటి కారణంగా మిడ్‌టర్మ్‌లో బ్యాంకు లాభాలు, మార్జిన్లు బలంగా మారతాయి. గతేడాదితో పోలిస్తే లోన్‌బుక్‌లో 17 శాతం వృద్ది నమోదయింది. అన్ని పోర్టుఫోలియోల్లో మంచి మెరుగుదల కనిపించింది. ఈ తరహా రెండంకెల వృద్ది ఇకపై కూడా కొనసాగుతుంది. ఎస్‌ఎంఈ, రిటైల్‌ విభాగాలు ఇందుకు అండగా నిలుస్తాయి. దీనికితోడు సీఏఆర్‌ 15.6 శాతం ఉండడం పాజిటివ్‌ అంశః.
2. హెచ్‌యూఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2250. గత త్రైమాసికంలో అన్ని విభాగాలు మంచి వృద్ధి సాధించాయి. వచ్చే రెండేళ్లు కంపెనీ 13.5 శాతం చక్రీయ వార్షిక వృద్ధి నమోదు చేస్తుందని అంచనా. కంపెనీ తాజా ఆర్థిక సంవత్సరంలో రూ. 46వేల కోట్ల రెవెన్యూ నమోదు చేయవచ్చు. 
3. సీమెన్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1644. బలమైన ఆర్డర్‌ బుక్‌ అండతో మంచి విక్రయాలు నమోదు చేసింది. రైల్వే క్యాపెక్స్‌లో అనూహ్య పెరుగుదల కొనసాగవచ్చు. ఇందువల్ల సీమెన్స్‌ లాంటి కంపెనీలు ప్రయోజనం పొందుతాయి. కొత్త ఆర్డర్ల ప్రవాహం కారణంగా మార్జిన్లు మరింత విస్తరిస్తాయి. 



You may be interested

లాభాల్లో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌

Thursday 11th July 2019

 సానుకూలంగా దేశియ మార్కెట్లు ట్రేడవుతుండడంతో పాటు కంపెనీ వ్యూహాత్మక పెట్టుబడులు పెరిగే అవకాశం ఉండడంతో జీ ఎంటర్‌టైన్మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు విలువ గురువారం 7.14 శాతం లేదా రూ. 23.75 లాభపడి రూ. 356.50 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ.332.75 వద్ద ముగిసింది. జీ ఎంటర్‌ప్రైజెస్‌ కోసం బిడ్‌ దాఖలుచేయడానికి కామ్‌కాస్ట్‌ నాయకత్వంలోని కన్సార్టియం ప్రయత్నిస్తుండడం తెలిసిందే. ఈ కన్సార్టియంలో కామ్‌కాస్ట్‌తో పాటు ప్రైవేట్‌ ఈక్వీటీ సంస్థ బ్లాక్‌

ఆటో షేర్ల పరుగు

Thursday 11th July 2019

ఫెడ్‌ వడ్డి రేట్ల కోత ఉంటుందనే వార్తల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతుండడంతో దేశియ మార్కెట్లు కూడా పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ 1.63 శాతం లాభపడి 7,633.80 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. భారత్‌ ఫోర్జ్‌ 4.63 శాతం, హీరో మోటర్‌ కార్ప్‌ 4.29 శాతం, టాటా మోటర్స్‌ 3.63 శాతం, టీవీఎస్‌ మోటర్స్‌ 3.06 శాతం, ఎక్సైడ్‌ ఇండియా 2.03 శాతం లాభపడి ట్రేడవుతున్నాయి. వీటితో

Most from this category