STOCKS

News


10300 పాయింట్లే కీలకం!

Tuesday 11th December 2018
Markets_main1544517185.png-22824

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మార్కెట్లు అటుఇటు ఊగిసలాడుతున్నాయి. మరోపక్క అంతర్జాతీయ మార్కెట్లు సైతం బలహీనంగా ఉన్నాయి. ఇటు చూస్తే ఆర్‌బీఐ గవర్నర్‌ అనూహ్య రాజీనామా నిర్ణయం వచ్చింది. ఇవన్నీ మదుపరులను అయోమయంలో, ఆందోళనలో పడేస్తున్నాయి. అయితే టెక్నికల్స్‌ ఆధారంగా ట్రేడింగ్‌ చేయాలని, ఆచితూచి వ్యవహరించాలని, తాజా పరిస్థితులకు బెంబేలెత్తవద్దని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సూచిస్తోంది. గత ఐదు సెషన్లలో నిఫ్టీ దాదాపు 500 పాయింట్లు నష్టపోయింది. దీంతో గత అప్‌స్వింగ్‌(10004 పాయింట్ల నుంచి 10941 పాయింట్ల వరకు)లో సాధించిన 940 పాయింట్లకు సుమారు 50 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయిని చేరినట్లయింది. ఇకపై  61.8 శాతం రిట్రేస్‌మెంట్‌స్థాయి 10360 పాయింట్లు కీలకంగా మారనుంది. ఇందుకు తగ్గట్లే 10300 పాయింట్ల వద్ద పుట్‌ రైటింగ్‌ జరుగుతోంది. అందువల్ల ఈ స్థాయిని కీలకంగా పరిగణించాలని బ్రోకరేజ్‌సంస్థ సూచించింది. 
10880 వద్ద నిరోధం
నిఫ్టీ కోలుకొని అప్‌మూవ్‌ ఆరంభిస్తే 10880 వద్ద కీలక నిరోధం ఎదురవుతుందని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. లాంగ్‌టర్మ్‌ కరెక‌్షన్‌(11760 పాయింట్ల నుంచి 10004 పాయింట్ల వరకు)కు ఇది 50 శాతం రిట్రేస్‌మెంట్‌స్థాయని తెలిపింది. దీన్ని దాటగలిగితే 10950 పాయింట్ల వద్ద మరో నిరోధం ఉందని తెలిపింది. లాంగ్‌టర్మ్‌ పొజిషన్లు తీసుకున్న వాళ్లు 10300 పాయింట్ల స్టాప్‌లాస్‌తో పొజిషన్లు కొనసాగించవచ్చని, పైస్థాయిలో 10700, 10880 పాయింట్ల వద్ద ఎగ్జిట్‌ కావచ్చని సూచించింది. నిఫ్టీ మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు సైతం ప్రస్తుతం కరెక‌్షన్‌ మూడ్‌లో ఉన్నాయి. టెక్నికల్స్‌ను బట్టి చూస్తే ఇప్పుడున్న స్థాయిల నుంచి కొంత పుల్‌బ్యాక్‌ ఉండొచ్చు. ఎన్నికల ఫలితాలను కొంతమేర సూచీలు ప్రైస్‌ఇన్‌ చేసినందున భారీ పతనం వెనువెంటనే ఉండకపోవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అభిప్రాయపడింది.



You may be interested

ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ నుంచి సరళ విధానాలు-మార్కెట్‌ అంచనా

Tuesday 11th December 2018

కేంద్ర ప్రభుత్వపు వృద్ధి లక్ష్యాలు.. ఆర్‌బీఐ ఆర్థిక నిర్వహణ అంశాలు రెండూ కలిస్తే బాగుంటుందని కేఆర్‌ చోక్సీ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ ఎండీ దెవేన్‌ చోక్సీ తెలిపారు. వచ్చే కొత్త గవర్నర్‌ ఇదే విధానాన్ని అనుసరిస్తారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. మార్కెట్‌ వర్గాలు చాలా అంశాలను గమనిస్తూ ఉంటుందని, అందులో ఒకటి ఆర్‌బీఐ గవర్నర్‌ అంశమని తెలిపారు. కొత్త

షార్ట్‌ కవరింగ్‌తో నష్టాల నుంచి రికవరీ

Tuesday 11th December 2018

సెన్సెక్స్‌ 186 పాయింట్లు అప్‌ 10,500పైన నిఫ్టీ గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైన ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు మధ్యాహ్నం కల్లా రికవరీ అయ్యాయి. ఎన్నికల ఫలితాలు, ఆర్‌బీఐ గవర్నర్‌ రాజీనామా వంటి అంశాలతో గ్యాప్‌డౌన్‌తో మార్కెట్‌ ప్రారంభమైనా, మిడ్‌సెషన్‌లో జరిగిన షార్ట్‌ కవరింగ్‌తో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు లాభాల్లోకి మళ్లాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 186 పాయింట్ల లాభంతో 35,146 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 10,548 వద్ద ఉన్నాయి. మార్కెట్‌ వర్గాలు ఇప్పటికే ఎన్నికల ఫలితాలపై

Most from this category