STOCKS

News


పేలవంగా అవాస్‌ ఫైనాన్షియర్స్‌ లిస్టింగ్‌

Tuesday 9th October 2018
Markets_main1539059018.png-20950

న్యూఢిల్లీ: హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌ కంపెనీ షేర్లు స్టాక్‌ మార్కెట్లో సోమవారం పేలవంగా లిస్టయ్యాయి. ఈ షేర్‌ బీఎస్‌ఈలో ఇష్యూ ధర, రూ.821తో పోలిస్తే 8 శాతం నష్టంతో రూ.758 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 14 శాతం నష్టంతో రూ.710కు పడిపోయింది. చివరకు 6 శాతం నష్టంతో రూ.773 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో 4.96 లక్షల షేర్లు, ఎన్‌ఎస్‌ఈలో 35 లక్షల ఈక్విటీ షేర్లు ట్రేడయ్యాయి. సోమవారం మార్కెట్‌ ముగిసేనాటికి కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.6,039 కోట్లుగా నమోదైంది. గత నెల 25-27 మధ్య ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) వచ్చిన ఈ కంపెనీ రూ.1,734 కోట్లు సమీకరించింది. ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, సిటీగ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎడిల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, స్పార్క్‌ క్యాపిటల్‌ అడ్వైజర్స్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు వ్యవహరించాయి. ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌ కంపెనీ గ్రామీణ, చిన్న నగరాల్లోని అల్ప, మధ్య ఆదాయ వర్గాల వారికి గృహరుణాలందిస్తోంది. 
 



You may be interested

ఫ్లిప్‌కార్ట్‌లో 30,000 నియామకాలు

Tuesday 9th October 2018

 పండుగల అమ్మకాల కోసం 30,000 మంది సీజనల్‌ ఉద్యోగులను నియమించుకున్నట్లు ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. అక్టోబర్‌ 10-14 సమయంలో జరుగనున్న ఐదవ ఎడిషన్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ ఆఫర్‌ ద్వారా పరోక్షంగా 5 లక్షల మందికి ఉపాధి లభిస్తున్నట్లు వెల్లడించింది. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు ఉద్యోగ కల్పనలో భాగంగా ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. మరోవైపు పోటీసంస్థ అమేజాన్‌ పండుగల

ఎంఎఫ్ నిర్వహణ ఆస్తుల్లో 12.5% క్షీణత

Tuesday 9th October 2018

న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) పరిశ్రమ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ (ఏయూఎం) విలువ గత నెలలో తగ్గుదలను నమోదుచేసింది. ఈ ఏడాది సెప్టెంబరులో దేశీ 41 ఎంఎఫ్‌ల ఏయూఎం 12.5 శాతం క్షీణించి రూ.22 లక్షల కోట్లకు తగ్గినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) నివేదిక ద్వారా వెల్లడైంది. ఆగస్టు చివరినాటికి ఈ మొత్తం రూ.25.20 లక్షల కోట్లకు చేరుకుని రికార్డును నెలకొల్పగా... ఆ

Most from this category