STOCKS

News


మార్కెట్లపై నిపుణులు ఏమంటున్నారు?

Wednesday 12th December 2018
Markets_main1544555277.png-22832

మార్కెట్లు దేనిని అయినా ముందే డిస్కౌంట్‌ చేసుకుంటాయన్నది మరోసారి రుజువైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు ముందు రోజే సెన్సెక్స్‌ 700 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా పతనమైన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ ఈ మూడు రాష్ట్రాల్లోనూ బేజీపీ ఓటమి చెందొచ్చన్న అంచనాలే ఆ రోజు మార్కెట్‌ నష్టాలకు కారణమని విశ్లేషకుల అభివర్ణన. ఇక ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్ రాజీనామా వార్త కూడా ఆ రోజు మార్కెట్‌ ముగిసిన తర్వాత రావడంతో, మర్నాడు ఎన్నికల ఫలితాల రోజున ప్రారంభంలో సెన్సెక్స్‌ 500 పాయింట్ల వరకు నష్టపోయింది. ఆ మూడు రాష్ట్రాల్లో ప్రధానమైన రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారం కోల్పోయే అవకాశాలున్నప్పటికీ, కాంగ్రెస్‌కు గట్టి పోటీనివ్వడంతో మార్కెట్లో రికవరీ వచ్చిందని, తక్కువ స్థాయిల్లో కొనుగోళ్లు జరిగినట్టు విశ్లేషణ. మరి రాజస్థాన్‌, ఛత్తీసగఢ్‌లో స్పష్టమైన మెజారిటీని కాంగ్రెస్‌ సాధించడం, మధ్యప్రదేశ్‌లో హంగ్‌ అవకాశాల నేపథ్యంలో రానున్న రోజుల్లో మార్కెట్లపై నిపుణుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

 

2019 సాధారణ ఎన్నికల ముందు ఈ ఫలితాలను బీజేపీ ఓ మేల్కొలుపుగా తీసుకుంటుందని ఎక్కువ మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పతనంలో నాణ్యమైన స్టాక్స్‌ను క్రమం తప్పకుండా కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నారు. గత వారం మార్కెట్‌ స్పందన (సెన్సెక్స్‌ 1300 పాయింట్ల పతనం) చూస్తే ఎక్కువ శాతం ప్రభావాన్ని మార్కెట్లు పరిగణనలోకి తీసుకున్నట్టే కనిపిస్తోందని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఏఎంసీ చైర్మన్‌ రామ్‌దేవ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ‘‘బీజేపీకి ఇది మేల్కొలిపే ఫలితం. రానున్న నెలల్లో ప్రజాకర్షణ చర్యలు ఉండొచ్చు. ఇది మార్కెట్లకు వ్యతిరేకమే’’ అని శామ్కో సెక్యూరిటీస్‌ సీఈవో జిమీత్‌ మోదీ అన్నారు.

 

ముందే గ్రహించాయి
‘‘ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఓటమిపాలు కావచ్చని మార్కెట్లు డిసెంబర్‌ 10నే గ్రహించాయి. దీంతో కీలక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉండడంపై తాజాగా స్పందించలేదు. మధ్యప్రదేశ్‌లో హంగ్‌కు అవకాశం ఉన్నా, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయగలదు. సాంకేతికంగా చూస్తే నవంబర్‌లో జరిగిన ర్యాలీ కౌంటర్‌ట్రెండ్‌గా కనిపిస్తోంది. ఒక్కసారి ఇది పతాక స్థాయికి చేరితే డౌన్‌ట్రెండ్‌ మొదలవుతుంది. సాధారణ ఎన్నికల వరకు మార్కెట్‌ సైడ్‌వేస్‌లో ప్రతికూలం వైపు చలిస్తుంది. 10,000 మార్క్‌ని బ్రేక్‌ చేస్తే దీర్ఘకాలిక ట్రెండ్‌ ప్రకారం 9,963-9833 వద్ద బలమైన మద్దతు స్థాయిలు ఉన్నాయి. పై వైపు 10,750పైన ముగిస్తేనే ర్యాలీ కొనసాగుతుంది’’ అని చార్ట్‌వ్యూ ఇండియా టెక్నికల్‌ రీసెర్చ్‌ చీఫ్‌ మజర్‌ మొహమ్మద్‌ తెలిపారు.

 

‘‘స్వల్ప కాలానికి ఈ ప్రభావాలను మార్కెట్లు దాదాపు సర్దుబాటు చేసుకున్నాయి. ఇండియా వీఐఎక్స్‌ 11 శాతం పతనం కావడం అన్నది దీన్నే సూచిస్తోంది. మార్కెట్లు ముందుగానే డిస్కౌంట్‌ చేసుకుంటాయి. మధ్య కాలానికి సైడ్‌వేస్‌కు ఇది ఆరంభం. మార్కెట్‌ రేంజ్‌ 9,700-11,000 మధ్య ఉండొచ్చు. ఇది ఇన్వెస్టర్ల మార్కెట్ల కంటే ఎక్కువగా ట్రేడర్ల మార్కెట్‌ అనే చెప్పాలి’’ అని జీఈపీఎల్‌ క్యాపిటల్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ ఏవీపీ పుష్కరాజ్‌ శ్యామ్‌ కాంతికర్‌ పేర్కొన్నారు. ‘‘ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఓడిపోతుందని మార్కెట్లు ముందే అంచనా వేశాయి. అయితే, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో బీజేపీ పోరాటం అంచనాలకు మించి ఉన్నది’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ పీసీజీ అండ్‌ క్యాపిటల్‌ స్ట్రాటజీ హెడ్‌ వీకే శర్మ తెలిపారు. You may be interested

నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Wednesday 12th December 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:47 సమయంలో 25 పాయింట్ల నష్టంతో 10,574 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ మంగళవారం ముగింపు స్థాయి 10,581 పాయింట్లతో పోలిస్తే 7 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ బుధవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇక

డిసెంబర్‌ ముగిసేలోపు వీటిపై ఓ సారి లుక్కేయరూ!

Wednesday 12th December 2018

ఈ ఏడాది ముగిసేలోపు అంటే మరో 20 రోజుల్లోపు తప్పకుండా దృష్టి పెట్టాల్సిన ముఖ్యమైన ఆర్థిక అంశాలు కొన్ని ఉన్నాయి. అవి ఆదాయపన్ను రిటర్నుల దాఖలు, ఈవీఎం చిప్‌ కార్డులు, సీటీఎస్‌ చెక్‌బుక్కులు తదితరమైనవి ఉన్నాయి. వాటి గురించి వివరంగా చూస్తే...   ఆలస్యంగా ఐటీ రిటర్నులు ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసేవారు గడిచిన ఆర్థిక సంవత్సరానికి రిటర్నులు వేయడం మర్చిపోయి ఉంటే, సకాలంలో దాఖలు చేయకుంటే ఒక అవకాశం ఉంది. బీలేటెడ్‌ ఐటీఆర్‌ను

Most from this category