STOCKS

News


లాభాలతో ముగిసిన ముహూరత్‌ ట్రేడింగ్‌

Wednesday 7th November 2018
Markets_main1541596178.png-21777

సంవత్‌ 2075 ప్రారంభపు రోజు జరిగిన ముహూరత్ ట్రేడింగ్‌లో భారత్‌ స్టాక్ మార్కెట్‌ భారీ లాభంతో ముగిసింది. దీపావళి పండుగ సందర్భంగా గంటపాటు జరిగిన  ఈ ట్రేడింగ్‌లో కొనుగోళ్లు జరిగాయి. ప్రపంచమార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో నేడు సూచీలు భారీ లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 312 పాయింట్ల లాభంతో 35,302 వద్ద, నిఫ్టీ 84 పాయింట్ల లాభంతో 10600 పైన 10,614.45 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇంట్రాడేలో అటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, ఐటీ షేర్ల స్థిరమైన ర్యాలీతో సూచీలు ఆరంభలాభాలను నిలుపుకోగలిగాయి. ట్రేడింగ్‌ సమయంలో నిఫ్టీ సూచీ 10600 మార్కును కోల్పోయినప్పటికి, చివరివరకూ జరిగిన కొనుగోళ్ల కారణంగా తిరిగి 10600 స్థాయిని అందుకోగలిగింది. చివరకు సెన్సెక్స్‌ 245 పాయింట్లు లాభపడి 35,237 వద్ద ముగిసింది. నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో 10,598 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలకు చెందిన సూచీలు లాభాల్లో ముగిశాయి. అత్యధికంగా అటో ఇండెక్స్‌ 1శాతం లాభపడింది.  మరో ప్రధాన సూచీ నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 139 పాయింట్లు లాభపడి 25,737 వద్ద ముగిసింది.

ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఇన్ఫోసిస్‌, ఎంఅండ్‌ఎం షేర్లు 1.50శాతం నుంచి 2శాతం లాభపడగా, గెయిల్‌, జీలిమిటెడ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు అరశాతం నష్టపోయాయి.

 



You may be interested

స్టాక్‌ మార్కెట్‌కు సెలవు

Thursday 8th November 2018

బలి ప్రతిపాద సందర్భంగా నేడు (గురువారం) స్టాక్‌ మార్కెట్‌కు సెలవు. తిరిగి స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ శుక్రవారం ప్రారంభమౌతుంది. ఇక కమోడిటీ ఎక్స్చేంజ్‌ల విషయానికి వస్తే ట్రేడింగ్‌ గురువారం సాయంత్రం జరుగుతుంది. కాగా సంవత్‌ 2075 ప్రారంభపు రోజు జరిగిన ముహురత్ ట్రేడింగ్‌లో భారత్‌ స్టాక్ మార్కెట్‌ లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 245 పాయింట్లు లాభపడి 35,237 వద్ద, నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో 10,598 వద్ద క్లోజయ్యాయి.  

మూహూరత్‌ ట్రేడింగ్‌ ప్రారంభం అదిరింది.

Wednesday 7th November 2018

 ముంబై:- భారత్‌ స్టాక్‌ మార్కెట్‌ దీపావళి ప్రత్యేక ముహూరత్‌ ట్రేడింగ్‌ అదిరిపోయేలా ప్రారంభమైంది. మార్కెట్‌ వర్గాల అంచనాలకు అనుగుణంగా అమెరికాలో దిగువసభ మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ విజయం ఖరారు కావడంతో ప్రపంచమార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది. సంవత్‌ 2075 ప్రారంభపు రోజైన దీపావళినాడు జరిగిన ముహూరత్‌ ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు.  యూరప్‌ మార్కెట్లతో పాటు అమెరికా ఫ్యూచర్లు భారీ లాభాల్లో ట్రేడ్‌ అవుతుండటం కూడా ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఫలితంగా బీఎస్‌ఈ

Most from this category