STOCKS

News


అలాగైతే సెన్సెక్స్‌@ 47,000!

Wednesday 12th December 2018
Markets_main1544610574.png-22867

సుస్థిర ప్రభుత్వ ఏర్పాటే కీలకం
మోర్గాన్‌స్టాన్లీ అంచనా
సార్వత్రిక ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు వస్తే వచ్చే ఏడాది చివరి నాటికి సెన్సెక్స్‌ 47వేల పాయింట్లను తాకుతుందని అంతర్జాతీయ బ్రోకింగ్‌ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ అంచనా వేసింది. ప్రస్తుతానికి మార్కెట్లో సెంటిమెంట్‌ నిరుత్సాహంగా ఉందని తెలిపింది. వాల్యూషన్లు పర్వాలేదని, స్వల్పకాలంలో స్థూల ఆర్థిక పరిస్థితులను బట్టి ఎర్నింగ్స్‌ మెరుగుపడడం లేదా పతనమవడం సంభవిస్తుందని తెలిపింది. ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన తీర్పు రాకుండా అతుకుల బొంత ప్రభుత్వం ఏర్పడితే సూచీల్లో భారీ పతనం తప్పకపోవచ్చని అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల్లో నిఫ్టీ 33వేల పాయింట్లకు పడిపోవచ్చని పేర్కొంది. బుల్‌కేస్‌కు 30 శాతం, బేర్‌ కేస్‌కు 20 శాతం అవకాశం ఉందని తెలిపింది. బేస్‌కేస్‌లో సెన్సెక్స్‌ 42వేల పాయింట్లను చేరుతుందని, ఇందుకు 50 శాతం ఛాన్స్‌ ఉందని అంచనా వేసింది. 2011 తర్వాత ఎఫ్‌పీఐలు ఈ ఏడాదే అమ్మకాలకు దిగారు. ఇప్పటివరకు 2018లో ఎఫ్‌పీఐలు దాదాపు 32 వేల కోట్ల రూపాయలు ఉపసంహరించుకున్నాయి. అయితే ప్రస్తుతం ఎమర్జింగ్‌ మార్కెట్లలో ఇండియా ఆకర్షణీయంగా ఉందని, అందువల్ల కొత్త ఏడాది ఎఫ్‌పీఐల ప్రవాహం ఆరంభం కావచ్చని మోర్గాన్‌స్టాన్లీ అంచనా వేసింది.
నిఫ్టీ@14000
విస్తృతమైన ఆర్థిక రికవరీ జరుగుతోందని, ముఖ్యంగా మూలధన వ్యయాలు పెరుగుతున్నాయని, ఇదే జోరు కొనసాగితే వచ్చే ఏడాది చివరకు నిఫ్టీ 14,000 పాయింట్లను చేరుతుందని కార్వీ అంచనా వేసింది. ఎకనమిక్‌ రికవరీతో కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ మెరుగుపడతాయని, తద్వారా ఈక్విటీలు మరింత బలంగా సాగుతాయని తెలిపింది. రాబోయే రోజుల్లో ఎన్నికల అనంతరం వ్యాపారానుకూల ప్రభుత్వం వస్తే ఈక్విటీల్లో మరోదఫా ర్యాలీ ఆరంభం అవుతుందన్నారు. ఈ ఏడాది చివరకు నిఫ్టీ 10600-11200 పాయింట్ల రేంజ్‌లో కదలాడుతుందని అంచనా వేసింది. స్వల్పకాలానికి రూపాయి 72 స్థాయిల వద్ద తిరుగుతుందని, క్రూడాయిల్‌ ధర 65 డాలర్ల వరకు చేరవచ్చని తెలిపింది. చిన్న స్టాకుల కన్నా నాణ్యమైన లార్జ్‌ క్యాప్స్‌ను నమ్ముకోవాలని సలహా ఇచ్చింది. 



You may be interested

మెటల్‌ షేర్ల మెరుపులు

Wednesday 12th December 2018

మార్కెట్లో బుధవారం మెటల్‌ షేర్లు మెరుస్తున్నాయి.  ప్రపంచమార్కెట్లో బేస్‌ మెటల్స్‌ ధరలు పెరగడంతో  దేశీయ మెటల్‌ షేర్లకు డిమాండ్‌ పెంచింది. ఫలితంగా నేడు నిఫ్టీ మెటల్‌ ఎన్‌ఎస్‌ఈలో అత్యధికంగా లాభపడింది. మధ్యాహ్నం గం.12:20.లకు నిప్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2.50శాతం లాభంతో 3,116.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది. సూచీలో అత్యధికంగా జేఎస్‌ఎల్‌హిస్సార్‌ స్టీల్‌ 7శాతం, జిందాల్‌ స్టీల్‌ 6శాతం ర్యాలీ చేశాయి. వెల్‌స్పన్‌ కార్ప్‌, టాటాస్టీల్‌, సెయిల్‌, నాల్కో షేర్లు 3శాతం లాభపడ్డాయి.

10,700పైన నిఫ్టీ ముగింపు

Wednesday 12th December 2018

629 పాయింట్ల లాభపడి సెనెక్స్‌ ఆర్‌బీఐ నూతన ఛైర్మన్‌గా శక్తికాంత్‌ నియామకానికి మార్కెట్‌ వర్గాలు సానుకూలంగా స్పందించడంతో పాటు అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా వుండటంతో  సూచీలు బుధవారం భారీగా లాభపడ్డాయి. అటో, మెటల్‌, బ్యాంకింగ్‌ రంగ షేర్ల లాభాల ట్రేడింగ్‌ సూచీల ర్యాలీకి నేతృత్వం వహించాయి. నిఫ్టీ సూచీ 10700 మార్కును అందుకోగా, సెన్సెక్స్‌ 629 పాయింట్లను ఆర్జించింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు, ట్రేడర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు గంటకు

Most from this category