STOCKS

News


టాప్‌ కంపెనీల్లో 95 శాతం రేపు కనుమరుగే!

Sunday 2nd December 2018
Markets_main1543775166.png-22576

ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ (ఏఐఎఫ్‌) ఇక ఎంత మాత్రం ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలు కానే కావని, అవి ప్రధాన పెట్టుబడి సాధనాలుగా అవతరిస్తున్నాయని, అధిక ధనవంతులు (హెచ్‌ఎన్‌ఐలు) మార్కెట్‌ను మించిన రాబడుల (ఆల్ఫా) కోసం వీటిని ఆశ్రయిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. 2012 నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ రూ.9 లక్షల కోట్ల నిధులను ఆకర్షిస్తే... ఏఐఎఫ్‌ల్లోకి వచ్చింది రూ.లక్ష కోట్లుగా ఉన్నట్టు ప్రముఖ వెల్త్‌, హెడ్జ్‌ ఫండ్‌ మేనేజర్లు ఈటీమార్కెట్స్‌ సదస్సులో భాగంగా వెల్లడించారు. ఈక్విటీలు, బాండ్ల వంటి సంప్రదాయ పెట్టబడి సాధనాలకు భిన్నంగా... వెంచర్‌ క్యాపిటల్‌, ప్రైవేటు ఈక్విటీ, రియల్‌ ఎస్టేట్‌, కమోడిటీ వంటి విభాగాల్లో ఏఐఎఫ్‌లు ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమతో సమానంగా వృద్ధి చెందేందుకు హెడ్జ్‌ ఫండ్స్‌, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ (పీఎంఎస్‌), వెంచర్‌ ఫండ్స్‌కు అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొన్నారు. 

 

పీఎంఎస్‌ పరిశ్రమ ఏటా 50 వృద్ధి చెందుతున్నట్టు రిలయన్స్‌ ఏఎంసీ పీఎంఎస్‌ హెడ్‌ షాజద్‌ మదన్‌ తెలిపారు. అధిక రాబడుల కాంక్షే వారిని పీఎంఎస్‌ వైపు నడిపిస్తోందన్నారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ వృద్ధి చెందుతుంటే, పీఎంఎస్‌ సైతం వృద్ధి బాటలోనే ఉంటుందని చెప్పారు. ఏఐఎఫ్‌ విభాగం మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ అంత పెద్దది కాదన్నారు. సిక్స్త్‌ సెన్స్‌ వెంచర్స్‌ సీఈవో నిఖిల్‌ వోరా మాట్లాడుతూ... ‘‘వెంచర్‌ ఫండ్స్‌ భవిష్యత్తులో దిగ్గజాలు కానున్న వాటిల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఈ రోజు దిగ్గజాలుగా ఉన్నవి రేపు కూడా ఉండాలని లేదు. 95 శాతం ఈ రోజున్న అగ్రగామి కంపెనీలు దశాబ్ద కాలంలో అంతరించిపోతాయి’’ అని పేర్కొన్నారు. లిస్టింగ్‌ ముందస్తు దశలో ఉంటే ఓ కంపెనీ విలువ పరంగా తక్కువలో ఉన్నట్టు కాదని ఐఐఎఫ్‌ఎల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ వ్యవస్థాపకుడు కరణ్‌భగత్‌ అన్నారు. ఇన్వెస్టర్లు అధిక రాబడులు కోరుకుంటున్నందునే... లిస్టింగ్‌ ముందస్తు దశలో పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయని విశ్లేషించారు. ఓ కంపెనీ ప్రారంభ దశలో ఇన్వెస్ట్‌ చేయడం అన్నది కఠినమైన టాస్క్‌గా భారత్‌ ఇన్నోవేషన్‌ ఫండ్‌ ఎండీ కునాల్‌ఉపాధ్యాయ అభివర్ణించారు. 



You may be interested

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 3rd December 2018

వివిధ వార్తలను అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు... అటోరంగ షేర్లు:- పరిశ్రమలో ద్రవ్యత్వలోటు, పెరిగిన ఇంధన ఖర్చులు, అధిక వడ్డీరేట్ల కారణంగా నవంబర్‌లో వాహన విక్రయాలు అంతంత మాత్రంగానే జరిగాయి. నెమ్మదించిన అమ్మకాల ప్రభావం నేడు ఆయా కంపెనీల షేర్లపై ప్రభావాన్ని చూపవచ్చు. విమానయాన రంగ షేర్లు:- అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు రోజురోజుకూ దిగివస్తున్న నేపథ్యంలో దేశీయ ఆయిల​ మార్కెటింగ్‌ కంపెనీలు ఏటీఎఫ్‌ ధరలను 11శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో

జీవిత బీమా చౌక... ఆరోగ్య బీమా ఖరీదు!

Sunday 2nd December 2018

జీవిత బీమా పాలసీలు అందుబాటు ధరలకు దిగిరానున్నాయి. అదే సమయంలో ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియం కాస్త భారం కానుంది. ప్రజల ఆయుర్ధాయం పెరిగిపోతుండడం ఇందుకు కారణం. ఇక ఆరోగ్య బీమా పాలసీల్లో మినహాయింపులను తగ్గించేయాలని పలు కోర్టులు ఆదేశాలు జారీ చేసినందున వీటి ప్రీమియం పెరగనుంది. ‘‘నూతన మోర్టాలిటీ (మరణాలకు సంబంధించి) టేబుల్‌లో 10 శాతం మెరుగుదల ఉంది. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ యాక్చురీస్‌ ఇండియా దీన్ని రూపొందించింది. ఈ

Most from this category